చట్టానికి అది అత్యాచారమే అయినా , పిల్లలకు మాత్రం అది సరదా, సరదా "సెల్ ఆట"!
పద్దెనిమిది ఏండ్ల పై బడిన అమ్మాయితో శ్రుంగారం లో పాల్గొనటానికి , పద్దెనిమిదేండ్ల లోపు అమ్మాయితో పాల్గొనటానికి చాలా తేడా ఉంది. ఇందులో మొదటి దానిలో అమ్మాయి ఇచ్చే అంగీకారానికి విలువ ఉంది కా బట్టి , చట్ట ప్రకారం అది నేరం కాదు. కానీ అదే మైనర్ అమ్మాయి తన అంగీకారం తో శ్రుంగారం లో పాల్గొన్న ఖచ్చితంగా అది నేరమే అవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ శ్రుంగారం లో పాల్గొనటానికి చట్టం పెట్టిన వయో పరిమితి 18 యేండ్లు కనుక. కాబట్టి నెక్కొండ లో ఆ నలుగురు పిల్లలు ఆడిన ఆట "అత్యాచారం " ఆట. వివరాలు లోకి వెలితే,
పాప వయస్సు ఏడేళ్ళు , బాబుల వయస్సు వరుసగా 11, 15, 15. అందరూ మైనర్లే. వారిది వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామం. ఆ నలుగురు ఆటలు ఆడుదామని ఊరి బయటకు వెళ్ళారు. అమ్మాయితో కలసి ఆ ముగ్గురు పోరగాళ్ళకి ఏమి ఆట ఆడాలా అని ఆలోచిస్తున్న తరుణం లో తాము తరచూ చూస్తున్న అబ్బాయిలు , అమ్మాయిలూ అడే ఆట ఆడదామని అని పించింది. ఆ పెద్ద కుర్రాళ్ళ మనసులో చాన్నాళ్ళనుంచి ఆ కోరిక ఉన్నట్లుంది. అందుకే ఆ పాపను ఆటల నెపం పేరుతో ఊరి భయటకు తీసుకు వచ్చి ప్రలోభపెట్టి అందరు కలసి ఆ ఆట ఆడారు. మరి ఆట ఆడిన వాళ్ళు ఊరికే ఆడితే ఏమి బాగుంటుంది? ఎం మజా ఉంటుంది? అందులో వారిలో ఉన్నది "మగబుద్ది" కదా, తాము చేసిన ఘన కార్యం తమ స్నేహితులకు చూపించి తాము కూడా "సెల్ ఆటలు " అడే అంత గొప్పవారం అయ్యామని ప్రకటించుకునేది ఎలా? అందుకే ఆ ఘన కార్యాన్ని అందులో ఉన్న 11 యేండ్ల పిల్ల వాడు సెల్ చిత్రీకరణ చేసాడు అట! ఆ అమ్మాయి వయస్సు 7 సంవత్సారాలు కాబట్టి ఖచ్చితంగా అభం శుభం తెలియని పాపే. అందుకే ఆ పిల్ల మ్రుగాళ్ళు తనతో ఆడింది ఆటే అనుకుంది తప్పా , లైంగిక దాడి అని గ్రహించ లేక పోయింది. అందుకే తల్లి తండ్రులకు చెప్పకుండా కాం గా ఉంది.
ఆ తర్వాత ఆ పిల్లలు చేసిన ఘనకార్యం సెల్ చిత్ర ప్రదర్శన ద్వారా ఊళ్ళో పోకస్ అయి , ఆ విషయం అమ్మాయి తల్లి తండ్రులకు తెలియటం, వారు కేసు పెట్టడం , పోలిసులు పోరగాళ్ళ మీద "నిర్భయ " మరియు ఇంకా అనేక సెక్షన్ ల క్రింద కేసు బుక్ చేసి వారిని జువైనల్ హోమ్ కి, పాపని హాస్పిటల్ కి పంపించి దర్యాప్తు చేస్తున్నారు. అదీ విషయం. ఇది పిల్ల మ్రుగాళ్ళు చేసిన అత్యాచారం కాబట్టి చట్ట ప్రకారం వారికి మూడేళ్ళు కంటే ఎక్కువ శిక్ష విదించడం కుదరదు. కాబట్టి వారు ముగ్గురూ మూడేళ్ళ తర్వాత కాలరెగరేస్తో ఊళ్ళో తిరుగుతారు! మరి ఆ పాప కుటుంబ పరిస్తిటి అగమ్య గోచరంగా మారుతుంది.అసలు ఇటువంటి పిల్ల మ్రుగాళ్ళు మన సమాజం లో తయారు అవటానికి ఎవరు ముఖ్య కారణం అంటే వెనుకటి పరిస్తితుల సంగతి ఏమో కానీ , ఇప్పుడైతే మాత్రం కచ్చితంగా అది సెల్ సంస్కృతే!
చదువు ఉన్నా లేక పోయినా మగాడు మాత్రం ఆడదాని విషయం లో చంచల మనస్తత్వం తో ఉంటాడు. 5 సంవత్సరాల పాప అయినా , 60 ఏండ్ల ముదిత అయినా మ్రుగాడుకు ఒకటే ద్రుష్టి. అవకాశం దొరికితే దాడి చెద్దాం అని అనిపిస్తూనే ఉంటుమ్ది. మరి అటువంటి వారికి చేతిలో సెల్ ఉంటే , అందులో వారు కోరుకునే బొమ్మలు కనపడుతూ రెచ్చ గొడుతూ ఉంటే వారు ఆగి చస్తారా! చావరు. అందుకే తమ కోరికలు తీర్చుకునేందుకు తగిన వారు ఎవరు అంటే అభం శుభం తెలియని పాపలు. పెద్దవారైతే గొడవ ఆవుతుంది కాబట్టి , చిన్న పిల్లలను చిదిమి వేయటానికి ప్లాన్ చేసి ఇలా ఆటల పేరుతో వారి మీద లైంగిక దాడులు చేస్తుంటారు. మరి ఇంత క్రిమినల్ మైండ్ ఉన్న వారిని "పిల్లలు" అనే పేరుతో తక్కువ శిక్షలు విదించడం సబబా? ఒక వేళా అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ప్రకారం వారికి 3 సంవత్సరాలు మాత్రమే శిక్ష విడది స్తే మిగతా కాలం శిక్ష (మేజర్లతో పోలిస్తే) బాద్యులైన వారి తల్లి తండ్రులకు విదించాలి. పిల్లలకు సెల్ లు ఇచ్చి పాడు చేస్తున్న పెద్దల బాద్యత , పిల్ల మ్రుగాళ్ళు చేసే నేరాలలో ఏమి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కొన్ని పరిశోదన ల ప్రకారం సెల్ వినియోగం పిల్లలలో అరోగ్య సమస్యలు అధికం చేస్తుంది. కాబట్టి వీటి వినియోగం మీద చట్ట నిర్మాతలు ఆలోచించాలి.
పేస్బుక్ లాంటి సామాజిక సైట్ వలన ఈ దేశం లో పిల్లలు మరీ బ్రష్టు పట్టి పోతున్నారు. వేద భూమి, పుణ్య భూమి, నైతిక కట్టుబాట్లకు, భలమైన కుటుంభ వ్యవస్తకు పేరెన్నిక కన్న ఈ భారత భూమి లో అటు సాంప్రదాయ వాదులు కానీ, స్త్రీ రక్షణ గురించి నిత్యం స్లోగన్ లు ఇచ్చే ఇటు సోకాల్డ్ స్త్రీ వాదులు కానీ "పేస్ బుక్" లాంటి సామాజిక సైట్లను, ఇతర చెత్త సైట్లను నియంత్రించమని ఎందుకు ప్రభుత్వాలను కోరరో అర్దం కావటం లేదు. ఈ విషయం లో మన పొరుగు దేశమైన చైనా ప్రపంచానికే ఆదర్శ ప్రాయం. అది పేస్ బుక్ ను నిషేదించి పౌరుల పట్ల తన నిబద్దత ను చాటుకుంది. కానీ దిక్కుమాలిన వ్యాపార దృక్పదంతో, పిల్లలను నాశనం చేస్తున్నా తమ కేమి పట్టనట్లు చూస్తున్నారు ఈ దేశ పాలకులు. పై సంఘటణ లో తరహా సెల్ చిత్రీకరణలు ఎన్ని ఫేస్ బుక్ లో షికారు చేస్తున్నాయో తెలియదు. కావున తక్షణం ప్రభుత్వమ అన్నీ అశ్లీల సైటులను నిషేదించి , పేస్ బుక్ పైనా తగిన నియంత్రణలు , అలాగే మైనర్లు సెల్ వాడకం పైనా పెద్దలను బాద్యులు చేస్తూ కటిన చట్ట సవరణలు చేయాలి. అదే మన పిల్లలకు శ్రీ రామ రక్ష.
(24/11/2013 Post Re posted).
Comments
Post a Comment