పెళ్లికి అనుమతి అఖ్ఖర్లేదు కాని, పెటాకులు అయితే మాత్రం వాటా ఇవ్వాల్సిందేనట!                                                              

   తనదేమి  పోదు కాబట్టి కాశీ దాక దేకమన్నాడట, వెనుకటికెవ్వడో!. అలాగే ఉంది మొన్న కేంద్ర మంత్రి మండలి వారు తీసుకున్న నిర్ణయం. హీందూ వివాహ చట్టం అని పేరే కాని దాని లోని అంశాల మీద చట్ట సవరణలు చెయ్యాల్సి వచ్చినప్పుడు మాత్రం, హిందూ పరంగా కాకుండా రాజకీయ నిర్ణయానిదే పై చేయి అవుతుంది.

   ఇంత వరకు ఉన్న చట్టాలను అనుసరించి, బార్యా బర్తలు విడి పోవాల్సీ వస్తే భర్త స్వార్జితంలో భార్యకు కూడా వాట ఇవ్వాలి. ఇది సమంజసమయినదే. ఎందుకంటే భర్త పేరున ఆస్తి కూడపెట్టినప్పటికి, అందులో బార్య సహాకారం కూడ ఉంటుంది కాబట్టి. కాని భర్త యొక్క పిత్రార్జిత ఆస్తిలో కూడ విడాకులు తీసుకునే భార్యకు కూడా వాటా ఇవ్వాలంటే కొంచం ఆలోచన చెయ్యాల్శి ఉంది. ఈ మద్య తల్లితండ్రుల అనుమతులు లేకుండా, వయసే అనుమతిగా బావించి, లేచి పోయి పెండ్లీళ్ళు చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురాలు లాంటివి వెలగబెట్టి మొహం మొత్తాక, ఒకరి మీద ఒకరు దుమ్మెట్టి పోసుకుని,  ఎవరింటికి వారు వెళ్ళిపోవడం ఎక్కువైంది.  ,అదీ ఇంటి దగ్గర్నుంచి ఎత్తుకెళ్ళిన సొమ్ములు ఉంటే కొంచం ఎక్కువ కాలం కలిసి ఉంటున్నారు, లేకుంటే త్వరలోనే విడిపోతున్నారు. వయసు వేడిలో ముందు వెనుకలు కానక, ఆకర్షణలుకు లోనై, పెండ్లిళ్లు చేసుకుని, ఆనక సరిపడక విడి పోతున్న వారి సంఖ్య తక్కువ ఏమి కాదు.

   పౌరుడికి ఉన్న ప్రాధమికి హక్కులో, కుటుంభ పరిరక్షణ హక్కు కూడ ఉంది. అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలలో కూడా చేర్చారు. కాని కుటుంభ ఆసక్తులకు, వ్యక్తి ఆసక్తులకు బేదాభి ప్రాయం ఏర్పడినపుడు, చట్టం ముందు వెనుక ఆలోచించకుండా ఏకపక్షంగా వ్యక్తి ఆసక్తులని కాపాడుతుంది. ఉదాహరణకు లేటెస్ట్ చట్ట సవరణ ప్రకారం ఒక ఉదాహరణ చూదాం.

  పది ఎకరాల ఆసామి ఉన్నాడు. ఒక్కడే కొడుకు.ఇద్దరు కూతుళ్ళు. ఆడపిల్లలకు అప్పో, సప్పో చేసి ఉన్న ఆస్తి అమ్మకుండా పెండ్లిళ్ళు చేసాడు. ఒక్కడే కొడుకు కదా, మంచి తగిన సంబందం చూసి చేదామనుకునే సమయంలో, ఆ అబ్బాయి కాస్త ఒక అమ్మాయి ఆకర్షణలో పడి ఆమెను తీసుకుని వెళ్ళి పోయాడు. తల్లి తండ్రులు పోలిస్ కేస్ పెడదామన్న కుదరదు. వారి గోడు పట్టించుకుంటానికి చట్టం లో ఎటువంటి వెసులు బాటు లేదు. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత, ఆ ప్రేమ పెళ్ళి పెటాకులై విడాకులు తీసుకునారు. ఇప్పుడు ఆ అనుమతి లేని కోడలికి ఈఆసామి కుటుంభ ఆస్తిలో భాగం ఇవ్వల్సిందేనా? ఆ కోడలికి, ఆసామి గారి కుటుంభానికి ఏమైనా సంబందం ఉందా? లేక పోయ్నా కుటుంబ ఆస్తిని, కుటుంబం లోని ఆడపిల్లల్ని కాదని కూడ  ఇవ్వాల్సిందేనా? ఆ ఆస్తితో ఆవిడ గారు వేరే వేళ్లి పెండ్లి చేసుకుని, హాయిగా ఉంటే, ఈ ఆసామి పూర్వికులు, కడుపులు కాల్చుకుని, కష్ట పడి సంపాదించిన సొమ్ము ను అమ్మాయి  దొంగిలించినట్లు కాదా? దానినా చట్టాలు సమర్దించేది?

  కాబట్టి ఇది అసమంజస నిర్ణయం. దీని మీద హిందూ ప్రజాభిప్రాయ సేకరణ జరగ వలసిందె.తల్లితంద్రుల అనుమతి లేకుండా, పెండ్లిళ్ళు చేసుకున్న వారికి ఈ సవరణ వర్తించకుండా చెయ్యాలి లేదా అసలు ప్రతి వివాహం తల్లి తండ్రుల అనుమతితో కాని, కోర్టు అనుమతితో కాని చేసుకునేలా చట్ట సవరణ చెయ్యడం దీనికి నివారణోపాయం. దీని మీద మరింత సమాచారం కొరకు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html.      

                                               (19/7/2013 Post Republished).

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )