అయిదేళ్ళ పాప మీద అత్యాచారం చేసిన 13 యేండ్ల పిల్లాడిని "మ్రుగాడు" అనవచ్చా ?


                                                       

                                       నేను మొన్న ఒక పోస్టులో స్త్రీ ,పురుషుల సహజ ప్రవృత్తిని గురించి చెపుతూ, పురుషుడు సహజంగా సెక్స్ విషయం లో చంచల స్వబావి అని, స్త్రీలకు కొంత స్వనియంత్రణ శక్తి ఉంటుందని, దాని వలన నైతిక జీవన విదానం అమలు పరచే బాద్యతను మన పూర్వికులు స్త్రీల మీద ఎక్కువుగా ఉంచారని చెప్పాను. దానికి మిత్రులొకరు అబ్యంతరం చెపుతూ, సెక్స్ విషయం లో కూడా  స్త్రీ పురుషుల స్వబావం నిర్ణయించేది జన్మ కాదని, విద్య , సంస్కారం , సమాజ పరిస్తితుల వలన  మనిషి వైఖరి నిర్ణయించబడుతుందని చెప్పారు. నేను ఆ వాదనతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాను. అయన గారు చెప్పిన అంశాలు మనిషిలోని సహజ ప్రవృత్తిని నియంత్రించి , సమకాలీన సమాజం పరిస్తితులకు  అనుకూలంగా మెలిగేలా మలచగలవు కానీ , సహజ ప్రవృత్తిని పూర్తిగా నిరోదించలేవు అని నా ద్రుడాభిప్రాయం. అయితే ఒక విషయం ని  గాడంగా నమ్మి , సుమారు పద్దెనిమిదేళ్ళు  పైన ఆ నమ్మకం అలాగే ఉంచుకుంటే అతని వైఖరిలో మార్పు కలిగే అవకాశం ఉంది. కానీ ఇది స్వచ్చందంగా జరగాలి.అలాగే సంస్కరించబడిన వైఖరి తాలుకూ ప్రబావం తరవాతి తరాలకు బదలీ అవుతాయి అంటె   స్త్రీ పురుష వైఖరులు  వారి పూర్వ తరాలు నుండి సంక్రమింపబడీ ఉంటాయి.అందుకే నా ఉద్దేశ్యం ప్రకారం పిల్లలు చేసే నేరాలకు కొంత బాద్యత పెద్దలు వహించి తీరాలి.

      "ఆవు చేలో మేస్తుంటే దూడ  గట్టున మేస్తుందా ?" అని సామెత. ఇది ఎంతో అనుభవ పూర్వకంగా చెప్పిన మాట. అంటే పిల్లల ప్రవ్రుతిని తల్లితండ్రుల ప్రవ్రుతితో పోల్చి అంచనా  వేయవచ్చు. అయితే కొంతమందిలో ఇది వ్యతిరేక పలితాలు చూపిస్తుంది . ఉదాహరణకు ఒక వ్యక్తీకి  దొంగతనం చేయటం అలవాటు. అతనికి దొంగతనం చేయాల్సిన అవసరం లేకపోయినా ఎవరిదో ఒకరిది దొంగతనం చేస్తే అతనికి కలిగే ఆనందమే వేరు. అందుకని షాపులలో, ఇతర చోట్ల చిల్లర దొంగతనం అంటే వేల రూపాయలు బట్టలు ఖరీదు చేసి కూడా , ఎవరూ చూడకుండా ఒక కర్చీప్ నొక్కి వేయడం లాంటివి చేస్తుంటారు. వారి పిల్లల్లో ఆ బుద్ది సహజంగా వచ్చినా , వారికున్న విద్యాజ్ఞానం వలన అది తప్పుడు పని అని  గాడంగా నమ్మితే  వారికి ఇరవైయేండ్లు వచ్చే సరికి వారి సహజ వైఖరి సంస్కరించబడుతుంది .అందుకే పాతికేండ్లు వయసు వచ్చకా పెండ్లి చేసుకుంటే ఈ  సంస్కరించభడిన  వైఖరె తర్వాతి తరాలకు సంప్రాప్తమవుతుంది అని నా అభిప్రాయం. అలా ఒక క్రమశిక్షనా యుతమైన పద్దతిలో సమాజ మనుగడలకు పనికి వచ్చే విద్యను నిరంతర బోద ద్వారా అందిస్తూ, అది పిల్లలు స్వచ్చందంగా నమ్మితే , ఖచ్చితంగా ఒక 25 సంవత్సరాలకు మార్పు రావచ్చు. కానీ మార్కులు కోసం బట్టీ పట్టించే సో కాల్డ్ కార్పోరేట్ చదువులు పిల్లలని వ్యాపారాలకు పనికి వచ్చే బానిసలుగా మారుస్తాయి తప్పా , సుసమాజ నిర్మాణానికి పనికి వచ్చే పౌరులుగా మార్చ జాలవు.

      ఇక పోతే మనిషిలో సెక్స్ బావనలు చిన్నతనం నుండే ఉంటాయి. పైన చెప్పిన వంశ లక్షణాలు బట్టి అవి కొంత మంది పిల్లలో విపరీతంగా కూడా  ఉండవచ్చు. అది నిజమని నిరూపించే సంఘటన ఒకటి ఖమ్మం నగరానికి దగ్గరలో ఉన్న ఏదులాపురం గ్రామం లో జరిగింది. ఒక పాప. 5 వ తరగతి చదువుతుంది. ఆ పాప స్నేహితురాల్ పక్కింట్లో ఉంటుంది. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన ఈ  పాప బ్యాగు ఇంట్లో పడేసి, తన స్నేహితురాలితో కలసి ఆడుకుందామని పక్కింటిక్ వెల్లింది. అక్కడ స్నేహితురాలు కాని స్నేహితురాలి తల్లి తండ్రులు కానీ లేరు. ఆ స్నేహితురాలి అన్న 13 యేండ్ల వాడు ఉన్నాడు. మనం ఇద్దరం ఆదుకుందాం రా అని చెప్పి , ఆ పాప మీద బలవంతంగా అత్యాచారం చేసి పారి పోయాడట. ఆ పాప ఏడ్చుకుంటు విషయం తన తల్లితండ్రులకు చెప్పింది. ఆరోగ్య పరిస్తితి బాగాలేకపోతే పాపను హాస్పిటల్లో జాయిన్ చేసారు. పోలిసులు కేసు నమోదు చేసి విచారిస్తునారు.

   పై ఉదంతం లో తప్పు ఎవరిదీ అంటే పిల్లాడిదే అని ఠక్కున చెపుతారు. కానీ వాడి  వైఖరిలో మార్పు తేవడానికి తగిన శ్రద్ద తీసుకోని తల్లితండ్రులను చట్టం ఏమి అనదు. వాడిని ఇంకా పతనం చేస్తున్నసమకాలిన స్వేఛా సంస్కృతిని, దానిని పెంచి పోష్స్తున్న వారిని ఏమి అనదు. మహా అయితే ఆ కుర్రాడు మీద కేసు పెట్టి గరిష్టంగా మూడేళ్ళు శిక్ష వేయించ గలుగుతుంది.కానీ వాడికి కూడా  పదేండ్లు శిక్ష విదించి ,మూడేళ్ళు శిక్షా కాలం ,తర్వాత , మిగిలిన ఏడేండ్లు వాడిలోని నేర ప్రవ్రుత్తి సంస్కరించబడేలా అధికారుల పర్యవేక్షణలో విద్యనందిస్తో , వాటికి అయ్యే ఖర్చులు యావత్తు తల్లితండ్రుల దగ్గర నుంచి వసూలు చేసేలా ఉండాలి. అలా చెల్లీంచక పోతే ఆస్తులను జప్తు చేసేలా ఉండాలి. ఏదైనా సరే ప్రభుత్వానికి చిత్త  శుద్ది ఉంటే చాలా చేయవచ్చు. అంత ఆలోచించే తీరిక మన రాజకీయ నాయకులకు ఉందా ? ఎవరైనా ఆందోళనలు చేస్తే ఒక చట్టం చేసి ప్రజల ముఖానా పారేయడానికి తప్పా వీరెందుకు పనికి రారు.
                                                     (6/11/2013 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!