రజనీష్ బాబా రాసలీలలుకు సహకరిస్తున్నది ఎవరు?
వండుకుంటే ఒకటే కూర, అడుకుంటే అరవైఆరు కూరలు రుచి చూడవచ్చు అన్న సిదాంతాన్ని బాగా వంటబట్టించుకున్న ప్రబుద్ధులు కొందరు "బాబా"ల అవతారం ఎత్తి , సదరు సిద్దాంతాన్ని సెక్సువల్ లైఫ్ ఎంజాయిమెంట్ కి అప్లై చేస్తున్నట్లు ఉంది. పెండ్లి చేసుకుంటే ఒక్క దానితోనే జీవితం అంతా సంసారం చేయాలి. అదే పెండ్లి , పెటాకులు లేకుండా బాబాలు అవతారం ఎత్తి "సంసార బాధలకు " తరుణోపాయం చెప్పే క్రమంలో , తనకు నచ్చిన , తనను మెచ్చిన తరుణీమణులతో కూడి తన జీవితం సుఖమయం చేసుకుంటుoటే , ధర్మం తప్పినా "కామార్ధ మోక్షములు " మాత్రం కంపల్సరీ దక్కుతాయి అని వీరి ఆలోచన కాబోలు . "సంసారి కానీ వాడు సన్యాసి కావడానికి వీలు లేదు " ...