మొగుడు మీద ఒక్క తప్పుడు కంప్లైంట్ చేసినా , పెళ్ళానికి విడాకులు ఇవ్వవచ్చు అంటున్న సుప్రీం కోర్టు!
కోడలా ! కోడలా ! నీ పెత్తనం ఎన్నాళ్ళె అంటే , మా అత్త ఊళ్లోకి వెళ్లి వచ్చిందాకా అందందట !. అలా అయింది బార్యల పెట్టె తప్పుడు 498A కేసుల పరిస్తితి. మా అయన నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు , కొంచం బుద్ది చెప్పండయ్యా అని ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరకు వెళితే చాలు , అ మొగుడి మీద , వాడి తరపున బందువులందరి మీద ఇంక్లూడింగ్ అతనంటే పడక ఎప్పుడో వేరుపడిన అన్నదమ్ముల మీద కూడా కేసులు బనాయించేలా చేసి తమ బుద్ది లేని ప్రదర్శిస్తున్నారు పెద్ద మనుషులు అనబడే వారు. ఇక పోలిసులు అయితే సరే సరి డబ్బులు చేతిలో పడితే సరి , మొగుడ్ని అతని తరపు వారిని తీసుకు వచ్చి దొంగలు, కేడిలు ఉండె సెల్ లో రోజల్లా ఉంచి , కోర్టుకు పంపితే అక్కడ రిమాండ్ పేరుతో మరి కొన్నాళ్ళు నేరస్తుల సహవాసం చేస...