Posts

Showing posts from January, 2014

ముద్దు పెట్టలేదని ఆడపిల్లలను కొట్టే వాడు కూడా ఆద్యాత్మిక వాదులను విమర్సిస్తాడా !?

                                                            అతనొక సినిమా యాక్టర్ ! డైలాగ్ కింగ్ అని అభిమానులు మురిసిపోతుంటారు . సినిమాలలో ఎంత గొప్ప డైలాగ్ చెపితే అంతగా చప్పట్లు కొట్టవచ్చు ప్రేక్షకులు . దిని వలన నిర్మాతలకు కాసుల పంట పండుతుంది . కాని అదే డైలాగులు నిజ జీవితంలో చెప్పాలంటే కొంత అయినా నైతిక అర్హత ఉండాలి . ల "దేనికైనా రెడి " అనే సినిమా విషయంలో బ్రాహ్మణ వర్గం చేత  చీత్కారాలకు గురి అయి చివరకు హై  కోర్టు వారిచేత "పద్మశ్రీ " బిరుదు సరెండర్ కు ఆదేశించ బడినా ఇంకా ఇతనికి నోటి దూల తీరినట్లు కనిపించడం లేదు . కేవలం తన సినిమా ప్రమోషన్ ల కోసం సమాజం లోని కొన్ని  వర్గాల ప్రజలను అవమానిoచేటట్లు మాట్లాడడం ఇతనికి అలవాటు గా మారింది . దీని వలన అతని సినిమాలు కు మంచి పబ్లిసిటి వచ్చి అతనికి నోట్ల పంట పండుతుంది . అంటే అతని నోటి దూల కూడా అతనికి లాబం చేకూరుస్తుంది . అందుకే అంత నీచంగా ఆటను చేల రేగి పొతున్నాదు.  సదరు డైలాగ్ కింగ్ తన కుటుంబ సబ్యులతొ "పాండవులు , పాండవులు తుమ్మెదా" అనే సినిమా తిసాడట. దాని ప్రమోషన్ కోసం నిన్న తిరుపతి వెళ్లి అక్కడి సబలొ తన అజ్ఞాన్నాన్ని

కేవలం గోడకు బొక్క ఖర్చుతొ కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇచ్చిన "తనిష్క్ జ్యుయలరి" దొంగలు !

                                                           ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దాని వెనుకాల  ఒక  పరమార్దం లేకపోయినా , ఖచ్చితంగా స్వార్ధం ఉంటుంది .ఇటివల సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ లోని "తనిష్క్ జ్యుయలరి " షాప్ లోని నగల దొంగతనం కేసు విషయంలో ,తమకు తాము దొంగలు గా ప్రకటించుకుని స్వచ్చందంగా మీడియా ముందుకు వచ్చిన కిరణ్ , అతని బందువైన ఆనంద్ చెపుతున్న అంశాలు నమ్మ దగిన విదంగా లేవు . సుమారు ఆరున్నర కోట్ల విలువైన బంగారం సునాయాసంగా అంటే కేవలం ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్ తో గోడకు బొక్క పెట్టి , నదురు బెదురూ లేకుండా , అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న కిరణ్ బయట ఉంటే , నడవడానికే ఇబ్బంది పడుతున్న వికలాంగుడైన ఆనంద్ షాపులోకి ప్రవేసించి అంత బంగారం , సుమారు గంటన్నర  సేపు దొంగిలించి , ఆ  బంగారం మొత్తాన్ని నింపాదిగా క్యారి బ్యాగులలొనె తమ రూముకు చేర్చారు  అనే కహాని నమ్మట్టానికి మనకు కూడా దైర్య సాహాసా లు కావాల్సిందే . (పూర్తీ వివరాలకు క్రింది విడియోలు చూడగలరు ).      ఇక పొతే తనను ఎవరూ  గుర్తు పట్టకుండా అసలు దొంగ ఆనంద్ దొంగ తనం చేసే సమయంలో టోపీ పెట్టు కున్నాడట. పోలియో వలన కలిగి

13 మంది మిద మోపబడిన 'వీర్ భూం గాంగ్ రేప్ కేసు' తప్పుడు కేసా !?

                                                ఇటివల భారత దేశ  ప్రతిష్టను ప్రపంచ దేశాలలో దిగ జార్చిన ఉదంతం, మరియు స్వాతంత్ర్య బారతంలో అత్యదిక కాలం C.P.M  పార్టి వారి ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ లోని వీరబూo జిల్లా లోని లబ్ పూర్ అనే గ్రామంలో జరిగిన ఘోర ఉదంతం అయిన సంచలన "13 మంది మ్రుగాళ్ళ గాంగ్ రేప్ కేసు" తప్పుడు కేసు అని హిందూ సమితి గౌరవ అద్యక్షుడుగా ప్రకటించుకుంటున్న తపన్ ఘోష్ అనే ఆయన పేస్ బుక్ లో, గూగుల్ లో ఒక చిత్ర సహిత సమాచార టపా పెట్టడం విస్మయ పరుస్తుంది. ఒక వేళ ఆయన ఆరోపిస్తున్నదే నిజమయితే అది ఖచ్చితంగా భారతీయ గిరిజన సంస్క్రుతిని కావాలని అవమాన పరచినట్లే అవుతుంది. వివరాలు లోకి వెళితే ,   మొన్న ఇరవయ్యో తారీఖున భారతీయ మీడియా ఒక సంచలనాత్మక విషయం ప్రసారం చేసాయి. అదేమిటంటే పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్ భూం (భీర్ భూం) లోని లబపూర్ అనే గ్రామంలో ఇరవై యేండ్ల అమ్మాయి, తన మతానికి చెందని వాడిని ప్రేమించిందని , దానిని వ్యతిరేకించిన అ గ్రామస్తులు "సలిషి సభ" అనే స్తానిక  న్యాయస్థానం కు  పిర్యాదు చేయగా ,  వారు ఆ అమాయిని , ఆమె ప్రెమికుడ

అణకువగా కాపురం చేస్తుంటే అనుమానిo చాడు. విసిగి పుట్టింటికి వెళితే ఆత్మహత్య చేసుకున్నాడు .

                                                       ఇది మద్యం మహమ్మారి బారిన పడి నాశనం అయిన ఒక కుటుంభ గాదా . ఇది ఖమ్మం జిల్లాలో ని మడుపల్లి  అనే గ్రామం లో జరిగిoది. ఇది ఒక మడు పల్లి గ్రామానికే కాదు. యావత్ తెలుగునాట అంతా జరుగుతున్నతంతే . మద్యం మహమ్మారి బారిన పడి  నాశనం కాని కుటుంబాలు ఉన్న పల్లెలు తెలుగునాట లేవు అంటే అతిశయోక్తి కాకపొవచ్చు. అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం . ఏదో ఒక గ్రామంలో ని ప్రజలు స్వచ్చందంగా  నూటికి నూరు శాతం తమ గ్రామాన్ని మద్య రహిత గ్రామంగ మార్చి , అదే సాంప్రదాయం కల కాలం సాగేలా కొన్ని గ్రామ కట్టు బాట్లు ఏర్పరచుకోవడం . అంటే మద్యం ని పూర్తిగా అరికట్టడం సాధ్యమయ్యే విషయమే . కాని సర్కార్ వారే బడా మద్యం వ్యాపారిగా మారిన మన రాష్ట్రంలో మద్య నియంత్రణ గురించి ఆలోచించడం సాధ్య పడే పనియెనా !?    మడుపల్లి గ్రామానికి చెందిన వెంకట రెడ్డి గారికి బార్య మిద ఎనలేని ప్రెమ. ఆమె లేకుండా ఉండలేడు . కాని దురదృష్ట వశాత్తు అతను  మద్యానికి బానిస అయ్యాడు . మద్యానికి అలవాటు పడ్డ తోలి నాళ్లలో తనలో లైంగిక పటుత్వం అదికమవుతున్నట్లు అనిపిoచిదను కుంటా   . అ అపోహతో నే మద్యపానం అలవాటుగా మార్చుకు

ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువా! చెల్లని బిల్లుకు వాదన లేక్కువ!

                                                            తెలుగు వారి అసెంబ్లీ సాక్షిగా ఒక గ్రేట్ డ్రామా నడుస్తుంది . భారతీయ అత్యున్నత రాజ్యంగ సంస్తలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముక్యమంత్రే ఆరోపిస్తున్న పరిస్తితులు తొలిసారిగా భారత శాసన నిర్మాణ చరిత్రలో చోటుచేసుకుంది . అటువంటి పరిస్తితిని కూడా ప్రజలు అందోళన లకు బదులు ఇక ముందు   ఎం జరుగుతుంది  ?అని ఆసక్తిగా  గమనిస్తున్నారు అంటే ,తెలుగు ప్రజలు కూడా రాజకీయ పార్టీల వారిగా విడిపోయి తమ తమ పార్టిలను వెనకేసుకు రావడం వలననే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది .అసలు అసెంబ్లీలో జరుగుతున్న తంతు చూస్తుంటే  విలువలు తో కూడుకున్న రాజకీయాలు కోరుకునే వారికి ఎవరికైనా అసహ్యం కలుగక మానదు .      ఒక జాతీయ స్తాయి పార్టి అందులో అధికారం లో ఉన్న పార్టి వారు , రాష్ట్ర పునర్విభజన బిల్లు అనే అతి ముక్యమైన బిల్లును తొలుత ఒరిజినల్ బిల్ గా వ్యవహరిస్తూ ఆంద్ర ప్రదెసశ్ అసెoబ్లీకి పంపి, దాని మీద సుమారు ఎనబై మంది దాక చివరకు ముఖ్యమంత్రి తో సహా తన అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాత , అసెంబ్లీకి పంపింది ఒరిజినల్ బిల్ కాదు డ్రాప్ట్ బిల్ అని ఒక లేఖ ద్వా

స్త్రీ స్వెచ్చ రోడ్డున పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి !

Image
                                                   పురుషులు తాగుడుకు బానిసలై ఇల్లూ , ఒళ్ళూ  గుల్ల చేసుకుంటుంటే , ఇంట్లో స్త్రీలు ఎంత నరకం అనుబవిస్తునారో మనం చూస్తూనే వున్నాం . స్త్రీ సంక్షేమమే తమ ద్యెయమని చెప్పే ప్రభుత్వాలు , అ స్త్రీలకు నరకాన్ని ప్రసాదిస్తున్న పురుషుల  మద్యం వ్యసన్నాన్ని రూపు మాపడానికి, తగిన చర్యలు తీసుకునే బదులు , అర్దరాత్రి దాక మద్యం షాపులు తెరచి మరి మద్యం సరపరా చెయ్యడమే కాక , అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ మద్యం అమిస్తుమ్ది . దీనికి కారణం స్పష్టం . ప్రజల సంక్షేమం కంటే తన ఆదాయమే తనకు ముక్యమనే బేహారి తనం ప్రజాస్వామ్య ప్రబుత్వాల లక్ష్యం అయింది .   యువత  ఒక్క సారి మత్తుకు అలవాటు పడ్డాక , సాదారణ మద్యం ఇచ్చె కిక్ వారికి సరిపోవటం లెదు. అందుకే నగరాలలో డ్రగ్ సేవనం అలవాటు చెసుకుమ్టున్నారు. డ్రగ్ వినియోగం ఎక్కువ కావడం వలన చట్ట విరుద్దమైన వాటి వినియోగం , సరపరా కొరకు మాపియా గాంగ్ లు నగరాలలో తిష్ట వెస్తున్నాయి. ఇది  రాను రాను యువత జీవితాలను నాశనం చెస్తున్నాయి. సాదారణ కుటుంబాలకు చెందిన యువతను మద్యం మహామారి నాశనం చేస్తుంటే , కొంచం కలిగిన కుటుంబాల పిల్లలను ఈ డ్రగ్ సం

అదర్మపత్నుల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు!

                                                     ఈ  రోజు ఉదయాన్నే  ఒక మంచి వార్తా మరియు  ఒక దుర్వార్తా వినాల్సి వచ్చింది . ముందుగా దుర్వార్త ఏమిటంటే "ధర్మపత్ని" చిత్రం ద్వారా చలన చిత్ర రంగంలో అడుగుపెట్టి ఎదురులేని నట దిగ్గజంగా సిని ప్రపం చంలో వెలుగొందిన ద్రువతార నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుగారు అస్తమిమ్చారన్న  విషయం తెలిసి బాద పడని తెలుగు వారు ఉండరు . అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ లక్ష్మి నరసింహున్ని ప్రార్దిస్తున్నాను .  ఇక పొతే ఆ శుభవార్త  ఏమిటంటే భారతీయ కుటుంబ వ్యవస్తను చిన్నా బిన్నం చేస్తున్న ఇండియన్ పినల్ కోడ్ లోని సెక్షన్ 498 A అమలు విషయంలో కుటుంబ  పటిష్టతకు మేలు చేసే కొన్ని మార్గ దర్సకాలను ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు వారు జారిచెయ్యదమె కాక తక్షణమే ఆంద్రప్రదేశ్ పోలిస్ వారు  వాటిని అమలు చెయ్యాలని రాష్ట్ర డి.జి.ఫి ని ఆదేశించడం జరిగింది . నేను ఇదే బ్లాగులో   నవంబర్ 19 2013 న ఒక టపా "మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?" అనే టైటిల్ తో ప్రచురించడం జరిగింది . అందులో

మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?

                                                         కేంద్ర మంత్రిశశిదరూర్ గారి బార్య సునందా ఆత్మహత్య కేసు లో జరిగినట్లు ఏ సామాన్య పౌరుడు కేసులోనో జరిగితే ఈ పాటికి భర్త  స్తానం లో ఉన్న వారు  అతని బందువులు పోలిస్ వారి నరకాన్ని  చవి చూసి ఉండే వారు. ఆమె గారు చేసుకున్న ది ఆత్మహత్యే అని ఒక వేళ అనుకున్నా  దానికి కారణం బహిరంగమే . ఆత్మహత్యకు కు ముందు ఆమె గారు శశిదరూర్ గారి ప్రియురాలితో గొడవపడడం , అది కూడా బహిరంగంగా ట్విట్తర్ సాక్షిగా జరగడం, ఆ తర్వాత మంత్రి గారు ఆమె కలసి తమ మద్య ఏ పొరపొచ్చాలు లేవని నాటకీయంగా మీడియా ముందు ప్రకటించడం , అల ప్రకటించిన 24 గంటల లోపే ఆమె గారు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడం  కనపడుతుంటే ఆమె గారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారెవరో అర్దం కావటం లేదా ?   పోస్ట్ మార్టం రెపోర్టులో కూడా ఆమె ఒంటి మీద కొన్ని  గాయాలు  ఉన్నాయని తేలిన తర్వాత ఇంకా నిందితులను అరెస్ట్ చెయ్యక పోవడం అనేది సరి అయిన దర్యాప్తు విదానం అనిపించుకోదు. ఇంప్లూయన్స్ చేయగలిగిన స్తాయిలో ఉన్నవారే  ఈ కేసులో అనుమానితులుగా ఉన్నపుడు ఈ కేసు నిస్పక్షపాతంగ దర్యాప్తు జరుపబడుతుందని సామన్య పొరుడు ఎలా నమ్మగలడు. స్

మాజీ ఎక్స్టర్నల్ ఎపైర్స్ మంత్రి గారి ఎక్స్టర్నల్ ఎపైర్స్ కి బార్య బలి అయిపోయిందా !? పాపం!

                                                            నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంటుంది కొంత మంది పెద్దల ప్రవర్తనలు చూస్తుంటే. వ్యక్తుల ప్రైవేట్ లైప్ లు ఎలా ఉన్నా  దాని గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం ఇతరులకు ఉండరాదు అని స్వేచా జీవులు ఆశిస్తుంటారు. కాని ఒక నీతి వంతమైన సమాజ నిర్మాణం కొరకు ప్రతి వ్యక్తి కొన్ని కట్టు బాట్లను పాటించక తప్పదు. ముఖ్యంగా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు, పబ్లిక్ లైప్ లో ఉన్నవారు నైతికంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఈ రోజు డిల్లీ లోని లీలా పాలెస్  హాస్పిటల్లో  కేంద్ర మంత్రి శశిదరూర్ గారి సతీమణీ సునందా పుష్కర్ గారు ఆత్మ హత్య చేసుకుని మరణించడం చాలా దురద్రుష్టకర విషయం. సునంద గారు మంత్రి గారికి ముచ్చటగా మూడవ బార్య. ఆమెకు కూడా అంతే నట. అయితే ఈమె మీద మోజు తీరింది కాబోలు ఒక పాకీస్తానీ  జర్నలిస్ట్ తో మంత్రి గారు ఎక్స్టర్నల్ ఎపైర్ పెట్టుకున్నారట. దీని మీద బార్యా ప్రియురాళ్ళు ఇద్దరికి మద్య "ట్విట్టర్ టీట్స్" యుద్దం జరిగింది. తర్వత బార్యా భర్తలు ఇద్దరూ గొడవపడడం  కూడా జరిగిందట. అయితే వారిద్దరి మద్య కాంప్రమైజ్ కుదిరి నిన్న

పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?

Image
                                                          ఈ  దేశంలో  జ్ఞాన వంతులకు కొదువ లేదు కాని , ఇంగిత జ్ఞానం ఉన్న వారు కూస్తంత తక్కువే ఉన్నారు అనిపిస్తుంది . లేకపోతె మరేమిటి చెప్పండి , పట్టుమని పది రోజులు కాలేదు డిల్లి పీట్టాన్ని అం ఆద్మీ  పార్టి వారు అధిరోహించి , అప్పుడే   ఆ  పార్టి పాలన మిద విమర్శలు మొదలయ్యాయి. బయట ప్రజలు  కంటే విపక్షాలు, స్వంత పార్టి లోని పదవులు దొరకని అసమ్మతి  వాదులు   అప్పుడే వారి రాజకీయ బుద్దిని బయట పెట్టుకోవడం మొదలెట్టారు.    దీనంతటికి ముఖ్య కారణం వాస్తవాలను పక్కన పెట్టి అతిగా ఆంఆద్మీ గురించి  ఎక్కువ గా ఊహించడం, తెల్లారే సరికి ఏదో దేశంలో విప్లవం వచ్చిందని మీడియా అంతా పని గట్టుకుని ఆం ఆద్మీ మీదే పోకస్ చేసి ప్రచారాలు చెయ్యడం, దానితో కేజ్రీ వాల్ ఏదో అతీత శక్తులు కలిన వాడుగా ఒక్క రోజులొనే డిల్లీ ని ప్రక్షాళణ చేస్తాడని బావించడం ఇవ్వన్నీ ఇంగిత జ్ణానం లేని వారి ఆలోచనలు.   ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P   పార్టీ  ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధిన

సంక్రాంతి పండుగ ఎప్పుడు చెయ్యాలో "పండితులకు" తెలియదు! కోడి పందాలు ఎలా ఆపాలో పోలీసులకు తెలియదు!

Image
                                                      ఉన్న ఊరే ! ఉదకమండలం అయిన వేళ !                                                                                                                        బోగి మంటలు మా గుడిలో గోదాదేవి కల్యాణం రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు , అరిసెలు వండుకోవడాలు , ఇవ్వన్ని సాంప్రాదాయక  సంక్రాంతి పండుగలో కనిపించే అంశాలు . తెలుగు గ్రామాలలో ఎ పండుగ గొప్పగా జరుపుకోలేక పోయినా  సంక్రాంతి పండుగ మాత్రం తమకు కలిగినంతలో ఘనంగానే జరుపుకుంటారు ప్రజలు. కారణం అప్పటికే రైతులకు పంటల తాలూకు పలాలు చేతికొచ్చి ప్రతి ఇంట్లో దన దాన్యాలు ఉండడమే . అంతే  కాకుండా చలికాలం చివరి నెల కావడం వలన వాతా వరణం కూడా మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ పండుగ మూడు రోజులు ఆనందంగా గడచి పోయేలా చెస్తుoది .     నిజంగా సంక్రాంతి శోభ చూడాలంటే పల్లెలకు వెళ్ళాల్సిందే . పొద్దునే పట్టిన పొగమంచు అందాలు పల్లెలను ఉదక మండలాలుగా మారుస్తాయి . బోగి నాడు వేసుకునే "బోగి మంటలు" , దాని చుట్టూ చేరి కుటుంబ సబ్యులు అంతా వెచ్చని చలి కాగుతుoటె, ఆహా ! ఆ  ఆనుబూతే  వేరు . అ తర్వాత ఆడపిల్లలు ఇం

మూడేళ్ళ క్రితం పెట్టిన ముద్దును రుజువు చేయగలదా ఆ ' మిస్ X' లాయరమ్మ!?

                                                          వినడానికి సుప్రీం కోర్టు  సిద్దం అయితే రిటైర్డ్ అయిన కొంత మంది సుప్రీం కోర్టు జడ్జ్ ల మిద, వారి అనైతిక ప్రవర్తనల మిద వరుస  కంప్లైంట్ లు రాక తప్పవేమో అనిపిస్తుంది . ఇటివలే అనైతిక ప్రవర్తన ల ఆరోపనలతొ పదవి నుండి వైదొలగిన పంజాబ్ హుమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జుస్తిస్ గంగూలి గారి కేసును దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు వారు , ఇక నుండి తమ కోర్టు మాజీ న్యాయమూర్తుల అనైతిక ప్రవర్తనల మిద వచ్చె పిర్యాదులు ను విన రాదనీ , గత డిసెంబర్ 5 వ తారికున ,పుల్ బెంచ్ తీర్మానం చెయ్యటం జరిగిoది. దానిని సవాలు చేస్తూ మిస్ X (కల్పిత పేరు) అనే మహిళా న్యాయవాది ఒకామె సుప్రీం కోర్టులో క్వాశ్ పెటిషన్ వెయ్యడం జరిగింది . అంతే  కాదు , తాను న్యాయ విద్యార్దిని  శిక్షణ లో ఉన్నప్పుడు , తన పట్ల జస్టిస్ స్వంతంత్ర కుమార్ అనుచితంగా ప్రవర్తించడమే కాక , తనను ముద్దు పెట్టుకోవడం జరిగిందని, దాని మీద విశాఖ కేసులోని గైడ్ లైన్స్ ఆదారం గా విచారణ జరిపించాలని కూడా జరిగింది.    మే నెల 2011  న సదరు మిస్స్X   గారు న్యాయ విద్యార్దిని గా శిక్షణ లో ఉండగా , ఆమె శిక్షకుడుగా వ్యవహరి

తెలంగాణా సోగ్గాడి "సాగు సొగసు" చూడతరమా!?

Image
                                                              తెలంగాణా పోరాట రధసారధి K.C.R గారు ఉంటే తెలంగాణా భవన్ లో లేకుంటే తన  ఫాం హౌస్ లో ఉంటుంటారు. తెలంగాణా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ కి వచ్చిన కీలక తరుణం లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చక్కగా తన పాం హౌస్ లో కూర్చుని తన పార్టి నేతలకు అక్కడినుండే మార్గ దర్శనం చేస్తున్నారు అంటే ఆ వ్యవసాయ క్షేత్రం అంటే అయన గారికెంత మక్కువో తెలుస్తుంది. అసలు పొద్దస్తమానం ఆ పాంహౌస్ లో కూర్చుని అయన చేస్తున్న అంత గొప్ప వ్యసాయం ఏమిటి అంటూ ఆయనను ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. మెదక్ జిల్లా ,పూర్ మండలం, ఎర్రవల్లి గ్రామంలో ఉన్న ఈ పాం హౌస్ లోకి ఎవరు పడితే వారు స్వేచ్చ గా వెళ్ళడానికి వీలు లేదు. ఒక ప్రొటెక్టేడ్ ఏరియా లాగ దీని ని పర్యవేక్షిస్తుంటారు K.C.R  అనుచర గణాలు.    అయితే కొన్ని T.V  చానల్స్ కే ఆ వ్యవసాయ క్షేత్రం గురించి ప్రసారాలు చేసే వీలు కలిగింది. ఆ వీలు లేని వారు బయటి నుంచే విడియోలు తీసి తమకు తోచిన విదంగా ప్రసారం చేసారు. కానీ K.C.R అనుమతితో లోపలకు వెళ్లి వీడియో తీసిన చానళ్ళు ప్రసారం చేసిన దృశ్యాలు చూస్తె , బవిష్యత్ లో తెలుగు రైతు

మదర్సాలను ప్రోత్సాహించేవారు మానవ హక్కుల కార్యకర్తలా !?

                                                             నిన్న ఆంద్రజ్యోతి ఆన్లైన్ ఎడిషన్ లో మానవ హక్కుల కార్య కర్తలుగా ప్రకటించుకున్న వారు ఇద్దరు రాసిన ఒక ఆర్టికిల్ చూశాను. దాని పేరు" హీరా వివాదం లో వాస్తవాలు". విషయం ఏమిటంటే , తిరుపతి దగ్గర తొండవాడ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న "హీరా ఇస్లామిక్ యూనివర్సిటి " ని హిందూ సంస్తలు అబ్యంతరం పెట్టడం బెదిరింపులు తో కూడిన చరిత్ర వక్రీకరణ అని , దానిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రగతి శీల వాదులందరూ ఏకం కావాలని పిలుపు ను ఇచ్చారు ,  సదరు స్వయం ప్రకటిత మానవ హక్కుల కార్య కర్తలు .    సరే  క్లుప్తంగా విషయం ఏమిటంటే అప్రకటిత హిందూ హోలీ సిటీ తిరుపతి కి దగ్గరలో తొండవాడ గ్రామంలో , తిమ్మప్ప దేవాలయం వద్ద కొంత మంది అన్యమతస్తులు 'హీరా ముస్లిం యూనివర్సిటి పేరుతో అక్రమంగా ఒక భవంతిని నిర్మించి అందులో వారికి సంబందించిన మత బోదనలు చేస్తున్నారు. ఈ  మద్య పుత్తూరులో పట్టుబడిన ఉగ్రవాదులు అదే మతానికి చెందిన వారు కావడం, ఇంటెలిజెన్స్ వర్గాల వారి సమాచారం ప్రకారం  అదే ప్రాంతంలో చాలా మంది ఉగ్రవాదులు పాగా వేసి ఉన్నారన్నది  తెలియడంతో సహజంగా

తెలంగాణా ను అడ్డుకుంటున్నందుకే C.M గారి హెలికాప్టర్ ను M.P గారు పేల్చి వేస్తాను అంటుంటే , రేపు తెలంగాణా రాకపోతే సీమాంద్రా సెటిలర్స్ పరిస్తితి? ?

                                                              ఎవరికైనా పెడతానంటే ఆశ , కొడతానంటే భయం! సీమాంద్రా నాయకులు ఇచ్చిన అంగీకార పత్రాలు ఆదారంగా సోనియా గాందీ తెలంగాణా రాష్ట్రానికి O.K  అంది. కానీ ఇప్పుడు సీమాంద్రా ప్రజలు ఒప్పుకోవటం లేదు కబట్టి కోంతమంది నాయకులు మాట మార్చి సమైక్యామ్ద్రా కావలంటున్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న కీలక సమయం లో ముఖ్యమంత్రి గారు తెలంగాణా మంత్రి గారు నిర్వహిస్తున్న శాసన సభ వ్యవహారాల శాఖ మార్చి దానిని సీమాంద్రా కు చెందిన మంత్రికి అప్ప చెప్పడం ఖచ్చితంగా రెండు ప్రాంతాల నాయకుల మద్య అరని  చిచ్చును రగిలించే చర్య అని చెప్పవచ్చు.   దీని మీద తెలంగాణా కు చెందిన M.P  పొన్నం ప్రభాకర్ గారు C.M. గారి మీద కారాలు మిరియాలు నూరుతూ ,C.M  గారు కరీం నగర్ వస్తే అయన హెలికాప్టర్ ను గాల్లోనే పేల్చి వేస్తాను అని ఒక తీవ్ర వాది లా  మాట్లాడడం , తెలంగాణా నాయకులలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్న్బ వారి మీద ఎంత అసహనం ఉందో తెలియ చేస్తుంది. మరి రేపు ఏ కారణం చేతనైనా తెలంగాణా రాకపోతే , తెలంగాణాలోని యువత మానసిక పరిస్తితి ఏమిటి? వారు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? తెలంగాణా ల

తిరుమల కొండకు వెళ్లి "అనకొండల కద" చెప్పిన చంద్ర బాబులో అంత హుషారు ఎలా వచ్చింది?

                                                        రాజకీయాలు ఏ క్షణాన ఎలా మారుతాయో తెలియదు. తెలంగాణా రాష్ట్ర విభజన లో తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్దాంతంతో అటు సీమాంద్రా ప్రజలకు, ఇటు తెలంగాణా ప్రజలకు  కాకుండా 'రెండిటికి చెడ్డ రేవడి " అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు బావించారు. కనీసం సీమాంద్రా ప్రాంతం వారి వోట్లతోనైనా లాబం పొందాలని బావించిన పార్టీలు, తెలంగాణా వాదాన్ని ప్రక్కన పెట్టి   జై సమైక్యాంద్రా అని అనే సరికి వారికే సీమాంద్రాలో ప్రజలు పట్టం కడతారని ఆశిస్తున్న్బారు. ఇక తెలంగాణాలో T.R.S  ప్రభంజనాన్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు అనేది అర్దమవుతుంది. కాబట్టి రెండు ప్రాంతాల్లో తెలుగు దేశం పని ఇబ్బంది కరంగా మారింది అనుకుంటున్నారు విశ్లేషకులు . కానీ ప్రస్తుతం ఆ పార్టీ అదినేత చంద్ర బాబు గారి లోని దీమా  తో   కూడిన హుషారు చూస్తుంటే ఎక్కడో   చక్రం తిప్పారు అనిపిస్తుంది.   ఒక పక్క  తెలంగాణా విభజన అంశం అసెంబ్లీలో ఉన్న కీలక సమయంలో ,అసలు దాని గురించి ఏ మాత్రం కంగారు లేనట్లు, తిరుపతి వెళ్లి ఆ ఏడుకొండలు వాడికి మొక్కి , అకడ్నుంచే 2014 ఎన్నికల వాగ్దానా సభలు మొదలు ప

110 రోజులలోనే 66,000తో పాటు మొత్తం 1,66,000 వీక్షణములు పొందేలా "మనవు"ను ఆశీర్వదించిన బ్లాగు వీక్షకులకు , మిత్రులకు, అగ్గ్రిగ్రేటర్లకు అందరికీ 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

                                                                మిత్రులందరికి ముందుగా  నూతన సంవత్సర శుభాకాంక్షలతో..  "మనవు" బ్లాగు ప్రారంభింఛి 16 నెలలు కావస్తుంది. సంవత్సర కాలంలో అంటే పోయన వినాయక చవితి నాటికి మనవు  బ్లాగు లక్ష వీక్షణములు పొందింది. ఆ రోజు నుంచి ఈ  రోజు వరకు అంటే సుమారు 110 రోజులకు 66,000 విక్షణములు పొంది బ్లాగు పట్ల వీక్షక ఆదరణ నానాటికి పెరుగుతూనే ఉంది అని నిరూపించుకుంది. దీనంతటికి కారణం వీక్షకులు, మిత్రులు, అగ్రిగ్రేటర్లు. కావున మరొక్క సారి వారందరికి  క్రుతజ్ణతలు  తెలియ చేసుకుంటున్నాను .    2014 సంవత్సరాంతం బ్లాగు మిత్రులకు, వీక్షకులకు, అగ్రిగ్రేటర్లకు, వారి కుటుంబ సబ్యుల యావన్మందికి ఆ లక్ష్మీ నరసింహా స్వామీ సకల ఆయురారోగ్యాలు తో పాటు దన కనక వస్తు వాహానాదులు కలుగచేయాలని  , ప్రార్దిస్తున్నాను. మీ ఆదరాభిమానాలే మా బ్లాగుకు శ్రీ రామ రక్ష.  ---- మద్దిగుంట నరసింహా రావు .