13 మంది మిద మోపబడిన 'వీర్ భూం గాంగ్ రేప్ కేసు' తప్పుడు కేసా !?

                                               


ఇటివల భారత దేశ  ప్రతిష్టను ప్రపంచ దేశాలలో దిగ జార్చిన ఉదంతం, మరియు స్వాతంత్ర్య బారతంలో అత్యదిక కాలం C.P.M  పార్టి వారి ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ లోని వీరబూo జిల్లా లోని లబ్ పూర్ అనే గ్రామంలో జరిగిన ఘోర ఉదంతం అయిన సంచలన "13 మంది మ్రుగాళ్ళ గాంగ్ రేప్ కేసు" తప్పుడు కేసు అని హిందూ సమితి గౌరవ అద్యక్షుడుగా ప్రకటించుకుంటున్న తపన్ ఘోష్ అనే ఆయన పేస్ బుక్ లో, గూగుల్ లో ఒక చిత్ర సహిత సమాచార టపా పెట్టడం విస్మయ పరుస్తుంది. ఒక వేళ ఆయన ఆరోపిస్తున్నదే నిజమయితే అది ఖచ్చితంగా భారతీయ గిరిజన సంస్క్రుతిని కావాలని అవమాన పరచినట్లే అవుతుంది. వివరాలు లోకి వెళితే ,

  మొన్న ఇరవయ్యో తారీఖున భారతీయ మీడియా ఒక సంచలనాత్మక విషయం ప్రసారం చేసాయి. అదేమిటంటే పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్ భూం (భీర్ భూం) లోని లబపూర్ అనే గ్రామంలో ఇరవై యేండ్ల అమ్మాయి, తన మతానికి చెందని వాడిని ప్రేమించిందని , దానిని వ్యతిరేకించిన అ గ్రామస్తులు "సలిషి సభ" అనే స్తానిక  న్యాయస్థానం కు  పిర్యాదు చేయగా ,  వారు ఆ అమాయిని , ఆమె ప్రెమికుడిని పంచాయతీకి పిలిపించి , వారి మద్య ఉన్న సంబందం ని తప్పుగా తీర్మాణించి 5౦,౦౦౦ రూపాయలు జరిమానా గా విదించగా , దానిని  కట్టే శక్తి తమకు లేదని అమ్మాయి తరపున ఆమె తల్లి తండ్రులు అనేసరికి , ఆ పంచాయతి పెద్ద , జరిమానా కట్టనందుకు ఆమ్మాయిని రేప్ చెయ్యమని ఊరి వారిని ప్రోత్సాహించగా , అందులో ఆమె తండ్రి వయసు ఉన్న వారి సహితంగా పదమూడు మంది ఒక రాత్రల్లా ఆమె మీద సామూహిక అత్యాచారం జరిపారని మీడియాలో వార్తలు . . నిజంగా ఇది వర్ణించటానికి వీలు లేని అమానవీయ చర్య.
అయితే అబ్యుదయ బావాలు కలC.P.M  పార్టీ వారి ఏలుబడిలో అత్యదిక కాలం పాలించబడిన రాష్ట్రంలో , అది కూడా కలకత్తా కి దగ్గరలో ఉన్న గ్రామo లో   ఇలాo టి అమానవీయ , సబ్య సమాజం తల దించుకునే   తీర్పులు ఇస్తున్న గ్రామ న్యాయస్తానాలు ఉండటం ఆశ్చర్యకరమే.  ఇన్నాళ్ళు గిరిజన సంస్క్రుతి మీద గౌరవం , అభిమానం ఉన్న వారెవరికైనా ఈ ఉదంతం విన్న తర్వాత వారి కట్టుబట్లు మీద అంతులేని అసహ్యం వేస్తుంది. ఆ అమ్మాయి 13 మంది చేత రేప్ కి గురి కాబడినా అమె ఇంకా బ్రతికి ఉండటానికి కారణం ఆమె గిరిజన స్త్రీ కావడమేనని అమెకు వైద్యం అందించిన డాక్టర్ అన్నారు.
 ఆ తర్వాత ఆ అమ్మాయి కంప్లైంట్ మీద ఆ 13 మీద కేసు నమోదు చేసి , అరెస్ట్ చేసారు. అలా అరెస్ట్ కాబడిన వారిలో పంచాయతీ పెద్ద మరియు ఆమె ప్రియుడు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. నిజంగా ఈ కేసు డిల్లీ నిర్భయ కేసు కంటే కూడా ఘోరమైనది . కానీ  నిర్భయ కేసుకు స్పందించినంతగా మహిళా సంఘాలు ఈ కేసు విషయంలో స్పందించలేదనే చెప్పాలి. బహూశా భీర్ భూం గ్రామ మహిళల సాక్షిగా , వారి పరోక్ష ప్రొత్సాహంతోనే ఈ ఘోరం జరిగింది కాబట్టి , ఈ కేసు గురించి అంతగా స్పందించలెదేమో !.

  అయితే ఇది ఇలా ఉండగా , ఈ రోజు గూగుల్ మరియు పేస్ బుక్ లో తపన్ ఘోష్ అనే పేరు మీద స్తానిక  హిందూ సమితి గౌరవ అద్యక్షుడు పేరు మీద దిమ్మ తిరిగే విషయం ప్రకటించబడి నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆయన గారి ప్రకటనా సారాంశం ఏమిటంటే , సదరు అమ్మాయి , సలీం షేక్ అనే వ్యక్తి సంబందం పెట్టుకుందని , ఆ సలీం షేక్ కి పెండ్లి అయి పిల్లలు ఉండటమే కాక, అతని 15  యేండ్ల కూతురుకు సంబందాలు చూస్తున్నారట. అలాంటి వ్యక్తితో సంబందం పెట్టుకోవడానికి ముఖ్య కారణం అతను ఇస్తున్న డబ్బులే ఆట. కాబట్టి ఇది  ఒక రకంగా వ్యభిచారమే కాబత్టి ఊళ్ళోని మహిళలు ఆ అమ్మాయిని అటువంటి పనిని మానుకొమని హెచరించినా ఆమె ఖాతరు చేయలేదట! దానితో   అమ్మాయి వలన గ్రామ కట్టుబాట్లు దెబ్బ తింటున్నాయి కాబట్టి ఆమెను
గ్రామం విడచి పోవాలని గ్రామ పెద్దలు మహిళలు కోరగా అందుకు ఆమె నిరాకరించి0దట.
  

 దానితో ఎలాగైనా ఆమెను సదరు షేక్ ని  రెడ్ హాండెడ్ పట్టుకుని బుద్ది చెప్పాలని గ్రామ మహిళలు  నిర్ణయించాఅట్. అలా వారిద్దరూ సోమవారం రోజున రెడ్ హాండెడ్ గా దొరికితే వారిని పట్టుకుని పంచయతి చేసారట. ఆ షేక్ ను  స్తానిక త్రుణ మూల్ కాంగ్రెస్ పార్టికి చెందిన వారు హామి ఇచ్చి విడిపించుకు పోయారట. ఈ అమ్మాయిని గ్రామ బహిష్కారం చేసారట. దీనిని ఛ్  పార్టి వారు రాజకీయం చేసి , తమ ప్రత్యర్దులైన త్రుణ మూల్ పార్టీని జాతీయ స్తాయిలో దిగజార్చెందుకు తద్వారా రానున్న ఎన్నికలలో లబ్ది పొందేందుకు కుట్ర పన్ని ఈ తప్పుడు కేసును అమ్మాయి చేత పెట్టించిందని అరోపిస్తున్నారు తపన్ ఘోష్ గారు.ఇది నిజమే కావచ్చు అని అనిపించడానికి ఒక కారణం ఏమిటంటే 13 మంది ఒక రాత్రంతా అత్యాచారం జరిపినా ఆమె ఒక మీడియా ఇంటర్వ్యూలో చెక్కు చెదరని రీతిలో మాట్లాడడం . ఏది ఏమైనా కోర్టులకు కావాల్సింది మెడికిల్ ఎవిడెన్స్ కాబట్టి , డాక్టర్ల రిపోర్ట్ రానిదే ఒక అభి ప్రాయానికి రావడం సాద్యం కాదు.

  ఒక వేళ తపన్ ఘోష్ గారు చెప్పేది నిజమయితే , తమ రాజకీయ లబ్ది కోసం యావత్ బారతీయ గిరిజన సంస్క్రుతిని అవమాన పరచే విదంగా వ్యవహరించిన వారు ఎవరైనా సరే క్షమార్హులు కారు. ఈ ఉదంతంతో బారత దేశ పరువు మంట కలసి పోయింది. కాబట్టి తపన్ ఘోష్ చెపుతున్న దాని మీద కూడా సమగ్రమైన  దర్యాప్తు జరపాలి. ఒక వేళ అతను చెప్పేది అవాస్తవం అయితే దానికి అతనిని ప్రాసిక్యూట్ చెయ్యాలి.లేదూ అతను  చెప్పేది నిజమయితే అటువంటి తప్పుడు కేసు ద్వారా భారత దేశ  పరువు ప్రతిష్టలను అంతర్జాతీయ స్తాయిలో దిగజార్చిన వారిని కథినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉoది. 

  మొన్నీ మద్య  సుప్రీం కోర్టు ప్రదాన న్యాయ మూర్తి గారు దేశ వ్యాప్తంగా "లీగల్ క్లినిక్ " లు ఏర్పాటు చెస్తున్నట్లు  ప్రకటించారు. అందులో బాగంగా గిరిజన గ్రామాలలో కూడా "లీగల్ క్లినిక్ " లు ఏర్పాటు చేసి స్తానిక గిరిజన పెద్దలకు చట్టాల మీద అవగాహన కల్పిస్తే బావుంటుంది. వారి సంస్క్రుతిని గౌరవిస్తూనే భారతీయ చట్టాలకు లోబడి వారి కట్టు బాట్లు ఉండేలా వారికి తర్పీదు ఇవ్వాలి. భారత దేశంలో ఇక నుండి కుల పంచాయితీలు , గ్రామ న్యాయ స్తానాలు స్తానం లో "లీగల్ క్లినిక్ " లు స్తానిక గ్రామస్తుల బాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే ఇలాంటి అనర్దాలను నిరోదించవచ్చు.నిజానికి  నేడు గ్రామాలలో జరిగే పంచాయతీలు రాజకీయ నాయకుల జ్యోక్యం  వలన అన్యాయాలకు వేదికలుగా మారుతున్నాయి . పశ్చిమ బెంగాలే కాదు , మన ఆంద్ర ప్రదేశ్ లో కూడా పెద్దమనుషుల పంచాయతీలు స్త్రీల మీద జరుగుతున్నా  అత్యాచారాలను పోలిస్ స్టేషన్ల వరకు పోకుండా , జరిమానాల  రూపంలో వారి శీలాలకు  విలువకట్టి , అబాగ్యుల నోరు మెదపకుండా చేస్తున్నారు . గ్రామాలలోని రాజకీయ నాయకులను కాదని న్యాయ స్తానాలను ఆశ్రయించే వారు కొద్దిమందే ఉంటారు . తమ మాటను కాదన్న వారి మిద తప్పుడు కేసులు పెట్టి సతాయించడం ద్వారా తమ కాళ్ళ వద్దకు తెచ్చుకోవడం , గ్రామ రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య . వారికి పై స్తాయిలో ఉన్న పలుకు బడితో  స్తానిక పోలిస్ వారిని మేనేజ్ చేస్తారు . అందుకే సామాన్య ప్రజలు ఎవ్వరూ రాజకీయ నాయకులను కాదని బ్రతకలేని పరిస్తితి ఈ  నాడు గ్రామాలలో ఉంది . ముక్యంగా పిల్లలు ,వృద్దుల ఆస్తులు రాజకీయ ప్రబావిత తీర్పులు వలన అన్యాక్రామ్తమవుతున్నాయి .

  అందుకే ప్రబుత్వం, ప్రజల బాగాస్వామ్యంతో , రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా స్వచ్చంద సంస్తల తోడ్పాటుతో ప్రతి గ్రామం లో "లీగల్ క్లినిక్" లు లేక గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేసి వాటి ద్వారానే ప్రజలకు చట్ట పరమైన న్యాయ సేవలు అందేలా చెయాలి. వీటిని జిల్లా న్యాయ స్తానాలతొ అనుసందానం చేసి , గ్రామ , మండల రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిష్పక్ష పాత  సత్వర న్యాయం  ప్రజలకు అందించాలి . తప్పుడు కేసులు పెట్టేవారి విషయంలో కూడా ఒక కఠిన చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉంది .  ఏ  దేశానికి కి అయినా ఏమో కాని "సత్యమేవ జయతే " అన్న అధికార నినాదం కలిగిన మన దేశానికి అటువంటి చట్టం అత్యంత అవసరం . ఇవ్వన్ని జరుగుతాయనే ఆశిద్దాం .          .        

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!