మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?


                                                        

కేంద్ర మంత్రిశశిదరూర్ గారి బార్య సునందా ఆత్మహత్య కేసు లో జరిగినట్లు ఏ సామాన్య పౌరుడు కేసులోనో జరిగితే ఈ పాటికి భర్త  స్తానం లో ఉన్న వారు  అతని బందువులు పోలిస్ వారి నరకాన్ని  చవి చూసి ఉండే వారు. ఆమె గారు చేసుకున్న ది ఆత్మహత్యే అని ఒక వేళ అనుకున్నా  దానికి కారణం బహిరంగమే . ఆత్మహత్యకు కు ముందు ఆమె గారు శశిదరూర్ గారి ప్రియురాలితో గొడవపడడం , అది కూడా బహిరంగంగా ట్విట్తర్ సాక్షిగా జరగడం, ఆ తర్వాత మంత్రి గారు ఆమె కలసి తమ మద్య ఏ పొరపొచ్చాలు లేవని నాటకీయంగా మీడియా ముందు ప్రకటించడం , అల ప్రకటించిన 24 గంటల లోపే ఆమె గారు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడం  కనపడుతుంటే ఆమె గారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారెవరో అర్దం కావటం లేదా ?

  పోస్ట్ మార్టం రెపోర్టులో కూడా ఆమె ఒంటి మీద కొన్ని  గాయాలు  ఉన్నాయని తేలిన తర్వాత ఇంకా నిందితులను అరెస్ట్ చెయ్యక పోవడం అనేది సరి అయిన దర్యాప్తు విదానం అనిపించుకోదు. ఇంప్లూయన్స్ చేయగలిగిన స్తాయిలో ఉన్నవారే  ఈ కేసులో అనుమానితులుగా ఉన్నపుడు ఈ కేసు నిస్పక్షపాతంగ దర్యాప్తు జరుపబడుతుందని సామన్య పొరుడు ఎలా నమ్మగలడు. స్త్రీలకు ఏదైన జరిగితే ముందుండే మహిళా సంఘాలు సైతం  సునందా గారి కేసు విషయంలో ఎందుకు మౌనంగ ఉన్నాయో అర్దం కావటం లేదు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగ సాగాలంటే కేంద్ర మంత్రి పదవి నుండి శశిదరూర్ గారు తప్పుకోవడం మంచి పద్దతి. లేదా ప్రదాన మంత్రిగారైనా ఆయనను తాత్కాలికంగ అయినా ఆయనని  పదవి నుండి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది.
       సునందా గారి పోస్ట్ మార్టం రెపోర్ట్  చాలు, కేసులో మంత్రి గారికి వ్యతిరేకంగా ప్రాదమిక అదారాలు ఉన్నాయని చెప్పడానికి.కాని ప్రజలు ఆందోళనలు చెయ్యందే ఏ పనీ సక్రమంగా చెయ్యడానికి ఇష్టపడని పోలిస్ వారు , ఈ కేసులో సరి అయిన విదంగా దర్యాప్తు చేస్తారు అనేది  డౌటే!
       
           

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.