ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువా! చెల్లని బిల్లుకు వాదన లేక్కువ!
తెలుగు వారి అసెంబ్లీ సాక్షిగా ఒక గ్రేట్ డ్రామా నడుస్తుంది . భారతీయ అత్యున్నత రాజ్యంగ సంస్తలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముక్యమంత్రే ఆరోపిస్తున్న పరిస్తితులు తొలిసారిగా భారత శాసన నిర్మాణ చరిత్రలో చోటుచేసుకుంది . అటువంటి పరిస్తితిని కూడా ప్రజలు అందోళన లకు బదులు ఇక ముందు ఎం జరుగుతుంది ?అని ఆసక్తిగా గమనిస్తున్నారు అంటే ,తెలుగు ప్రజలు కూడా రాజకీయ పార్టీల వారిగా విడిపోయి తమ తమ పార్టిలను వెనకేసుకు రావడం వలననే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది .అసలు అసెంబ్లీలో జరుగుతున్న తంతు చూస్తుంటే విలువలు తో కూడుకున్న రాజకీయాలు కోరుకునే వారికి ఎవరికైనా అసహ్యం కలుగక మానదు .
ఒక జాతీయ స్తాయి పార్టి అందులో అధికారం లో ఉన్న పార్టి వారు , రాష్ట్ర పునర్విభజన బిల్లు అనే అతి ముక్యమైన బిల్లును తొలుత ఒరిజినల్ బిల్ గా వ్యవహరిస్తూ ఆంద్ర ప్రదెసశ్ అసెoబ్లీకి పంపి, దాని మీద సుమారు ఎనబై మంది దాక చివరకు ముఖ్యమంత్రి తో సహా తన అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాత , అసెంబ్లీకి పంపింది ఒరిజినల్ బిల్ కాదు డ్రాప్ట్ బిల్ అని ఒక లేఖ ద్వారా తెలియ పరచడం లో అసలు ఉద్దేశ్యం ఏమిటి? రాష్త్రాల పునర్విభజన నిమిత్తం పంపే బిల్లు ఒరిజనల్ బిల్ మాత్రమే పంపాలని డ్రాప్ట్ బిల్ పంపితే దానికి విలువ ఉందదని ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కానీ, వారి కార్య నిర్వహణా అజమాయిషిలో పని చేస్తున్న సెక్రట్రీలకు కాని తెలియదా? తెలిస్తే ఒక ఒరిజినల్ బిల్ ని ఉద్దేశ్యాలు, కారణాలు ప్రస్తావించకుండా ఎలా రాష్ట్ర అసెంబ్లీకి పంపారు? అదేమని అడిగిన తర్వాత కానీ దానిని డ్రాప్ట్ బిల్ మాత్రమే అని చెపుతున్నారు అంటే రాజ్యాంగ విదానాలు పట్ల వారికున్న గౌరవం ఏ పాటిదో అర్దమవుతుంది. ఇలా రాజ్యాంగ సంస్తలను వాటి విదానాలను గౌరవించని వారు , తమ రాజకియ ప్రయోజనాల కోసం అవమాన పరచె విదంగా వాడుకునే వారు , ఏ మాత్రం పదవులలో కొనసాగడానికి అర్హులు కారు. వారు, అత్యున్నత స్తాయి కేంద్ర ప్రబుత్వ సెక్రట్రీలైనా , మరెవరైనా సరే తక్షణమే వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని అలా జరగటం లేదు.రాష్ట్ర అసెంబ్లీలోనే బిల్ టెక్నికల్ పరమైన అంశాలలో కూడా సీమాంద్రా వర్గం, తెలంగాణా వర్గం గా విడిపోయి వాదులాడుకుంటున్నారు అంటే ఇంతకంటే సిగ్గు చేటైన విషయం వేరొకటి ఉందా?
ఈ విషయంలో అధికార కాంగ్రెస్ వారి డ్రామా స్పష్టంగా తెలియ వస్తుంది. ఆ విషయం గ్రహించక తెలంగాణా వారు కేంద్ర ప్రబుత్వ పెద్దలను ఇంద్రుళ్ళు , చంద్రుళ్ళు అని పొగడడం వారిలోని వివేక శూన్యతను తెలియ పరుస్తుంది. కాంగ్రెస్ మొదట్లో టి.ఆర్.యస్ తమలో విలీనమవుతుందని , తద్వారా తమకు తెలంగాణా లో అత్యదిక సీట్లు వస్తాయని బావించి తెలంగాణా కి సై అంది . కానీ రాను రాను కె.సి.ఆర్ మాట మీద విశ్వాశం కోల్పోయిన కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేక, డొంక తిరుగుడు వ్యవహారంలో కిరణ్ కుమార్ గారిని హీరో చేసి సీమాంద్రా వారికి మేలు చేసి, తద్వారా సీమాంద్రాలో అత్యదిక సీట్లను కైవసం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది . అందులో బాగమె "చెల్లు బాటు కానీ విదంగా పునర్విభజన బిల్ ను రూపొందించి అసెంబ్లీకి పంపింది.దాని మీద తర్జన భర్జన లు అనే డ్రామాతో పుణ్య కాలం కాస్తా గడచి పోయేలా చేసి, తీరా చివరి సమయంలో చావు కబురు చల్లగా చెప్పినట్లు, పంపింది బిల్ కాదు, డ్రాప్ట్ బిల్ అని అనడం, దానితో సదరు బిల్ ను వెనుకకు పంపమని ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారిని కోరడం చూస్తుంటె, ఇంకా కాంగ్రెస్ వారి డ్రామాలు తెలంగాణా లోని రాజకీయ పార్టిలు కానీ, ప్రజలు కానీ అర్దం చేసుకోక పోవడం చాలా దురద్రుష్టకరం. ఇలా తెలంగాణ నాయకులు ఉండబట్టే తెలంగానా ప్రజలు ఎలప్పుడూ వంచింప బడుతున్నారు.
తెలంగాణాలో కె.సి.ఆర్,గారిని ని సీమాంద్రాలో జగన్ గారిని కలుపుకుని పాయిదా పొందుదాం అని తొలుత అనుకున్న కాంగ్రెస్ పార్టీ , కె.సి.ఆర్ గారి మీద నమ్మక్కం సడలడంతో కొత్త డ్రామాకు స్వీకారం చుట్టిoది. అందులో బాగమే కిరన్ కుమార్ గారి" లాస్ట్ బాల్" అంకం. ఇప్పుడు జరుగుతున్న తంతు చాలు సుప్రీం కోర్టు వారు పునర్విభజన బిల్ విషయంలో జ్యోక్యం చేసుకోవడానికి. కాబట్టి ఒక వేళ స్పీకర్ గారు బిల్ ని వెనుకకు తిప్పి పంపక పోయినా, కోర్టు వారు మాత్రం ఆపుచేసి తీరుతారు అ నే నమ్మక్కం సీమాంద్రా నాయకులలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కావలసింది అదే. ఈ దెబ్బతో ఖచ్చితంగా సీమంద్రాలో కిరన్ గారు హీరో అయి పోతారు. తెలంగాణా వారు మళ్ళి పూల్స్ అయిపోతారు.
తెలంగాణా ప్రజలు కానీ, సీమాంద్రా ప్రజలు కానీ , పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి నీచపు పనులను సమర్దించడం సరి కాదు. రాజ్యాంగ సంస్తలు వాటి విదానాలను పార్టిల ప్రయోజనాల కోసం వాడుకునే వారికి బుద్ది చెప్పవలసిన అవసరం మేదావులపై ఉంది. అ దిశగా తెలుగు మేదావులు ఆలోచన చేస్తారు అని ఆశిద్దాం.
Comments
Post a Comment