కేవలం గోడకు బొక్క ఖర్చుతొ కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇచ్చిన "తనిష్క్ జ్యుయలరి" దొంగలు !

                                                          

ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దాని వెనుకాల  ఒక  పరమార్దం లేకపోయినా , ఖచ్చితంగా స్వార్ధం ఉంటుంది .ఇటివల సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ లోని "తనిష్క్ జ్యుయలరి " షాప్ లోని నగల దొంగతనం కేసు విషయంలో ,తమకు తాము దొంగలు గా ప్రకటించుకుని స్వచ్చందంగా మీడియా ముందుకు వచ్చిన కిరణ్ , అతని బందువైన ఆనంద్ చెపుతున్న అంశాలు నమ్మ దగిన విదంగా లేవు . సుమారు ఆరున్నర కోట్ల విలువైన బంగారం సునాయాసంగా అంటే కేవలం ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్ తో గోడకు బొక్క పెట్టి , నదురు బెదురూ లేకుండా , అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న కిరణ్ బయట ఉంటే , నడవడానికే ఇబ్బంది పడుతున్న వికలాంగుడైన ఆనంద్ షాపులోకి ప్రవేసించి అంత బంగారం , సుమారు గంటన్నర  సేపు దొంగిలించి , ఆ  బంగారం మొత్తాన్ని నింపాదిగా క్యారి బ్యాగులలొనె తమ రూముకు చేర్చారు  అనే కహాని నమ్మట్టానికి మనకు కూడా దైర్య సాహాసా లు కావాల్సిందే . (పూర్తీ వివరాలకు క్రింది విడియోలు చూడగలరు ).

     ఇక పొతే తనను ఎవరూ  గుర్తు పట్టకుండా అసలు దొంగ ఆనంద్ దొంగ తనం చేసే సమయంలో టోపీ పెట్టు కున్నాడట. పోలియో వలన కలిగిన అంగ వైకల్యమె అతనిని పట్టించేటట్లు ఉంటే ఇంకా టోపీ రక్షిస్తుoదా అతనిని ? అని విసువల్స్ చూసిన వారికి అనిపించక మానదు . ఆతను కాళ్ళకు , చేతులకు పాలిదిన్ కవర్లు చుట్టుకుని పాద ముద్రలు , వేలి ముద్రలు పొలిసు వారికి దొరకకుండా జాగర్త పడడం , అలాగే దొంగతనం చేసిన తర్వాత అ ప్రాంతంలో కారం చల్లడం ద్వారా పోలిస్ కుక్కలకు వాసన పట్టే అవకాశం  ఇవ్వకపోవడం చూస్తుంటే , వీరి  ప్లాన్ కి పై స్తాయిలో  సాంకేతిక సలహా దారులు ఎవరో ఉండి  ఉంటారు అనిపిస్తుంది .

   అసలు ప్లాన్ అంతా కిరణ్  తనదేనని సెలవిచ్చాడు . అది నిజం అని అసలు దొంగ ఆనంద్ కూడా ఒప్పుకుంటున్నాడు . మరి అటువంటప్పుడు చోరి ని వికలాంగుడు అయిన ఆనంద్ మాత్రమె ఎందుకు చేసాడు ? అది కాక అ దొంగ తనం తాను ఒక్కడినే చేసాను అని మొదట కిరణ్ t.v 9 ముందు చెప్పి వారి ద్వారా పోలీసులకు లొంగి పోయాడు . కాని సి.సి. పుటేజ్ లలో దొంగ యొక్క కుంటి తనం స్పష్టం గా కనపడుతుండడం  వలన పోలీసులు నమ్మక్క పోయే సరికి తిరిగి ఆనంద్ ని N.TV ద్వారా పోలీసులకు సరెండర్ చేసారు .దీనికి టి.వి ఇంటర్యూలు , సంచలన బ్రేకింగ్ న్యూస్ ప్రసారాలు లాంటి తతంగాలు జోరుగా జరుతున్నాయి . అంటే ఈ  దొంగతనం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం పబ్లిసిటి యే  అన్నది స్పష్టంగా తెలుస్తుంది . మరి అటువంటి పబ్లిసిటి వలన ఎవరికీ లాభం అంటే "తనిష్క్ జ్యూయలరి " వారికీ మాత్రమె అన్నది స్పష్టం .

  తనిష్క్ జ్యుయలరి వారు తమ బంగారు అబరణాలు అడ్వర్టైస్ మెంట్ ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటారు  . వారి ఒక నిమిషంన్నర నిడివిగల అడ్వర్టై స్మెన్ట్ ప్రసారం కావాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది  . మరి అటువంటిది గత వారం రోజులుగా తెలుగు నాట మీడియా ద్వారా  తనిష్క్ జ్యూయలరి చోరి అంతా బ్రేకింగ్ న్యూస్ లుగా ప్రసారం జరుగుతుంది అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇంత  పబ్లిసిటి సాధ్య పడుతుంది చెప్పండి . అంటే అ కోట్ల రూపాయలు  తనిష్క్ వారికి లాభమేగా ! ఇక సదరు దొంగ తనం వెనుక ఒక ఉద్దాత్త ఆశయం ఉన్నట్లు హిరో దొంగ గారు అయిన కిరణ్ చెపుతున్నాడు .ఆతను ఒక ప్రజా నాయకుడిగా తనకు సమర్ధత ఉందనే విషయం ప్రజలకు తెలియ చెప్పాలనే ఈ దొంగ తనం చేసినట్లు చెప్పాడు . కిరణ్ ముఖం లో ఎక్కడా అతను  చెపుతున్న దిరొదాత్త మైన ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపించటం లేదు . అతనిలో బావావేశానికి బదులు ఎవరో చెప్పిన చిలక పలుకులు డ్రమటిక్  గా చెపుతున్నట్లు అనిపిస్తుంది .

         అలాగే కిరణ్ బందువైన (మేనమామ అని చెప్పాడు ) ఆనంద్ కూడా ఒక పక్క పోలీసులు తన కోసం తీవ్రంగా వెతుకుతున్న సమయం లోనే NTV  వారి వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వడం లో గల అసలు ఉద్దేశ్యం ఏమిటి ? కొట్టేసిన బంగారంలో ఒక్క అబరణం అన్నా బీరు  పోకుండా మొత్తం రికవరీ అయింది . కిరణ్ చేసిన ఘన కార్యం చూసి ఎవరూ అతనికి పార్టి టికెట్ ఇవ్వరు .కనీసం వారి స్వంత ఊరి వాళ్ళే సర్పంచగా కూడా అవకాశ  మివ్వరు . ఒక వేళా  అలా చేయాలనుకుంటే కొట్టేసిన బంగారం అమ్మెసి అందులో నుంచి తెలివిగా ఒక కోటి రూపాయలు ఖర్చుచేసి ఉండే వాడు . కోట్ల రూపాయల బంగారం రెక్కి లేకుండా కొట్టేయ గలిగిన వాడికి అ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండదు అనుకోలేము . కాబట్టి ఆతను కాని , ఆనంద్ కాని చెప్పేది నమ్మదగినదిగా లెదు. ఇదంతా బవిశత్ లో కోర్టులో డిపెన్స్ కోసం పనికొచ్చే మాటలు అని అర్దమవుతుంది . అలాగే కిరణ్ మానసిక స్తితి బాగా లేదనడం కూడా అందులో బాగమే కావచ్చు. ఆనంద్ ఎమాన్నాడో తెలుసుకోవాలంటే క్రింది విడియో ను చూడండి . కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లోపబ్లిసిటి రూపం లో లాబపడింది "తనిష్క్ జ్యూయలరిస్ " వారు మాత్రమే అని చెప్పవచ్చు.
        

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )