తెలంగాణా సోగ్గాడి "సాగు సొగసు" చూడతరమా!?

                                                             


తెలంగాణా పోరాట రధసారధి K.C.R గారు ఉంటే తెలంగాణా భవన్ లో లేకుంటే తన  ఫాం హౌస్ లో ఉంటుంటారు. తెలంగాణా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ కి వచ్చిన కీలక తరుణం లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చక్కగా తన పాం హౌస్ లో కూర్చుని తన పార్టి నేతలకు అక్కడినుండే మార్గ దర్శనం చేస్తున్నారు అంటే ఆ వ్యవసాయ క్షేత్రం అంటే అయన గారికెంత మక్కువో తెలుస్తుంది. అసలు పొద్దస్తమానం ఆ పాంహౌస్ లో కూర్చుని అయన చేస్తున్న అంత గొప్ప వ్యసాయం ఏమిటి అంటూ ఆయనను ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. మెదక్ జిల్లా ,పూర్ మండలం, ఎర్రవల్లి గ్రామంలో ఉన్న ఈ పాం హౌస్ లోకి ఎవరు పడితే వారు స్వేచ్చ గా వెళ్ళడానికి వీలు లేదు. ఒక ప్రొటెక్టేడ్ ఏరియా లాగ దీని ని పర్యవేక్షిస్తుంటారు K.C.R  అనుచర గణాలు.

   అయితే కొన్ని T.V  చానల్స్ కే ఆ వ్యవసాయ క్షేత్రం గురించి ప్రసారాలు చేసే వీలు కలిగింది. ఆ వీలు లేని వారు బయటి నుంచే విడియోలు తీసి తమకు తోచిన విదంగా ప్రసారం చేసారు. కానీ K.C.R అనుమతితో లోపలకు వెళ్లి వీడియో తీసిన చానళ్ళు ప్రసారం చేసిన దృశ్యాలు చూస్తె , బవిష్యత్ లో తెలుగు రైతు లేక కనీసం తెలంగాణా రైతు అంటే ఇలా ఉండబోతున్నాడా ! అనేలా ఒక అద్బుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. రైతు అంటే ఎండకు ఎండి , వానకు తడిసి సాంప్రాదాయ సేద్యంతో , అప్పుల ఊబిలో కూరుకు పోయి , ఆత్మ హత్యలు తప్ప వేరే మార్గం లేదనుకునే వారు ఈ  సోగాడ్డి సాగు సొగసు చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. కాకర కాయ పంటలో కూడా కోట్ల రూపాయల ఆదాయం సంపాదించవచ్చు అని చెపుతున్న K.C.R గారిని చూస్తె ఎవరికైనా ముచ్చట వేయక తప్పదు .

  K.C.R గారి లెక్క ప్రకారం కేవలం 2 నుండి 3 ఎకరాలు ఉన్న రైతు సైతం ఐ ఆదునిక వ్యవసాయ పద్దతి అవలంబిస్తే లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చట. మరి అంట చక్కటి అవకాశం ఉన్నా తెలుగు రైతు కు ఈ  దుస్తితి ఎందుకంటే , ఈ వ్యవసాయ విదానం గురించి సీమాంద్రా ప్రభుత్వాలు రైతులకు సరి అయిన సమాచారం కానీ, సహకారం కానీ ఇవ్వక పోవటం వలననే రైతులకు ఈ ఆదునిక వ్యవసాయ పద్దతి గురించి తెలియడం లేదు అని అంటున్నారు K.C.R  గారు. తెలంగాణా రైతుకు అయినా సీమాంద్రా రైతుకు అయినా తమకు ఈ నీచ
రాజకీయాల కంటే తానూ , తన కుటుంభం అభివృద్ధి ముఖ్యం. వారు అభివృద్ధి చెందదానికి K.C.R  గారు అవలంబిస్తున్న ఆదునిక వ్యవసాయం పనికొస్తుండంటే ,అటువంటి విదానాన్ని అవలంభించడానికి తమకు ఎవరు సహాయం చేస్తారో వారే తమ నాయకులు అనడానికి ఆరికి అబ్యంతరం ఉండక పోవచ్చు.

   కానీ 10,000 లోన్ ఇవడానికే రైతులకు చుక్కలు చూపించే బాంక్ లు , K.C.R  గారికి ఇచ్చినట్లు లక్షలు రూపాయలు ఏ సెక్యూరిటి లేకుండా ఇవ్వ గలవా? అటువంటి సెక్యోరితీని కనీసం ప్రభుత్వం అయినా రైతులు పక్షానా బాంకులకు ఇవ్వగలదా ? ఎంతసేపు సబ్సిడీల ఆశలు చూపించి , రైతులను బిచ్చగాళ్ళ స్తాయికి దిగ జార్చిన ఆదునిక ప్రభుత్వాలు వారు ఆదునిక వ్యవసాయం చేసుకునేందుకు సహకరించగలదా ? కాబట్టి కనీసం K.C.R  గారైన రేపు రాబోయే తెలంగాణాలో అయినా తెలంగాణా రైతులు ను ఆదునిక రైతులు గా మారుస్తాను అని హామి ఇస్తే రైతుల వోట్లన్ని ఆయనకే.

  తెలంగాణా రైతులు అంటే పంచె ఎగగట్టి,   పైన బట్టలు లేకుండా ,భుజం మీద ఒక నల్ల కంబలి వేసుకుని పాటలు పాడే తెలంగాణ అన్నలు లాగా కాకుండా , విదేశి రైతులు మాదిరి, సోగ్గాడు  మాదిరి ఉండాలని ",భూమి కోసం ,భుక్తి కోసం" అని పాడిందే పాడి ,పాడిందే పాడి, అలుపూ ఆరాటం తప్పా, ఆమ్దాని ఏమిలేని విదానం కన్నా ," భూమి తక్కువైనా భుక్తి ఎక్కువ ఇచ్చే" ఆదునిక వ్యవసాయ విదానం ప్రతి తెలుగు రైతు చేపట్టాలని కోరుకుంటున్న K.C.R  నిజంగా అభినందనీయులు. చూదాం అయన ఆదర్శాలు కనీసం తెలంగాణాలో ఎంత వరకు అమలు అవుతాయో!K.C.R  సాగు సొగసు వివరాల కోసం ఈ  క్రింది వీడియోను చూడండి

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!