రాసుకో నాస్తీకా ! "గ్రహచారం బాగా లేకపోతె గాల్లోకి కాల్పులు జరిపినా , భూమి మీదోడు చస్తాడు "
మొన్న కేరళా రాష్ట్రం లోని కొల్లం లో గల పుట్టంగల్ దేవత ఆలయం లో తెల్లవారు ఝామున సంబవించిన ప్రమాదం కడు విషాదకరమైనది. ఆ ఘోర సంఘటనలో సుమారు 110 మందికి పైగా భక్తులు చనిపోవడం , మరో 200 మంది దాక గాయపడడం యావత్ భారతావనిని కలచి వేసింది. భారత ప్రదాని సైతం తక్షణం స్ప్పాట్ కి మరియు హాస్పిటల్ కి వెళ్లి అక్కడి పరిస్తుతులను స్వయంగా గమనించి బాదితులకు సహాయం ప్రకటించడం జరిగింది. కేరళా ముక్యమంత్రి గారు కూడా సంఘటణ మీద జుడిషియల్ విచారణకు ఆదేసించారు. చికిత్స పొందుతున్న భక్తులలో తీవ్రంగా గాయపడిన వారు ఇంకా చనిపోతునే ఉండడం కలచి వేస్తుంది. పై విషాద కర సంఘటణ కేవలం మానవ తప్పిదం అని అర్దమవుతుంది. ఏటా పుట్టంగల్ గుడి ఉత్సవా...