మత మార్పిడి అంటే, ఎడారిలో ఉన్నవాడు ఓడ ఎక్కినట్టు!...
మత స్వేచ్చ అనేది భారతీయుల ప్రాదమిక హక్కులో ఒకటి. కాబట్టి పలానా మతంలో ఉండు, అని బలవంతం చేసే అధికారం ఎవరికి లేక పొయినప్పట్టికి, అసలు ఉన్న మతాని కాదని కొత్త మతం స్వీకరించాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించుకోవడం మంచిది.ఎక్కువ మంది మేదావులు చెప్పే మాట ఈ దేశం లో కొన్ని సామాజిక వర్గాల వారు అనుసరిస్తున్న వర్ణ వివక్షతే మత మార్పిడులకు దారి తీస్తుంది అని.ఇది కొంత వరకు నిమ్న వర్గాల వారు మత మార్పిడి విషయం లో నిజమే అనుకుందాం. మరి అగ్ర వర్ణాల వారు ఎందుకు మతం మారుతున్నారు?దీని వెనుక బలీయమైన ప్రలోబాలు ఉన్నాయన్నది నిర్వి వాదాంశం. అసలు అన్మి మతాల మార్గం ఆ భగవంతుని చేరుకోవడం అయినప్పుడు, మత మార్పిడి అనవసరం మాత్రమే కాదు పనికి రానిది. ఉదాహరణకి మీరు ఎడారిలో ఉన్నారు అనుకుందాం.మీరు భగవంతుని గుడికి పోవడానికి ఆ ఎడారి దాటి వెళ్లాలి అంటే ఏమి చేస్తారు? ఎడారి లో ఉండే వాహన సౌకర్యం వినియోగింకుంటారు.అలాగే మీ మిత్రుడు ఒకరు దీవిలో నివాసం ఉన్నవారు కూడా అదే గుడికి రావాలంటే అతను ఓడ లేక పడవ ఎక్కి వస్తాడు. అంతే కాని మీ మిత్రుడు ఓడ ఎక్కి వస్తున్నాడు