Posts

Showing posts with the label బోరు బావి ఆపరేషన్

బుర్ర లేని అధికారులను బోరు బావి ఆపరేషన్ కు పంపితే , 40 అడుగుల్లో ఉన్న చిన్నారిని 260 అడుగులకు పంపి చంపారట !!

Image
                                                                         తెలంగాణా రాష్ట్రం లోని రైతులకు తమ పొలాల్లో వేసుకున్న బోరు బావులు వ్యవసాయానికి   కావాల్సిన నీళ్లు ఇచ్చేవి కొన్ని అయితే , రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేవి మరి కొన్ని. అందులో చిన్నారి రైతు బిడ్డలను తమ పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ రైతు కుటుంబాలు వారు పడే బాధ వర్ణనాతీతం. అదేమీ మాయో కానీ , బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో ఎక్కువ శాతం గిరిజన  బిడ్డలే కావడం విచారించ దగిన విషయం.            మన శ్రీ హరి కోట నుంచి మన శాస్త్రజ్ఞులు అంతరిక్షం లోకి ఏక కాలం లో అనేక ఉపగ్రహాలను , ఎన్నో వేల  కిలోమీటర్లు దూరం లో ఉన్న నిర్ణిత కక్ష్యలలో  విజయవంతంగా ప్రవేశపెడుతూ  విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటె " ఔరా మన శాస్త్రజ్ఞులు ఇంతటి ప్రతిభావంతులా " అని సంభ్రమాశ్చా...