R.K న్యూస్ చానల్ విషయం లో కూడా "మనవు" చెప్పిందే నిజమయింది!.
నేను మొన్న 21 వ తారీఖున ఇదే బ్లాగులో R.K న్యూస్ చానల్ వారి ఊదరగొట్టే ప్రసారాలను గూర్చి ఒక విషయం చెప్పడం జరిగింది. అదే నిజమని రుజువు చేసేలా నిన్న A.B.N చానల్ వారు సదరు R.K న్యూస్ చానల్ వారీ బ్లాక్మెయిలింగ్ ప్రసారాల తీరును విమర్శిస్తూ "చ.. చ.. చానల్ అనే పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమం ద్వారా బహిర్గతమైంది. నేను R.K న్యూస్ చానల్ గురించి "న్యూస్ చానల్ వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం...