సుప్రీం కోర్టు వారు రివ్యూకి అనుమతించటం,"మనవు " బ్లాగు పోస్టుకి ఒక గొప్ప పాజిటివ్ కామెంట్ లాంటిది !
నేను జులై పదమూడవ తారీకున ఈ బ్లాగులో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సారాంశం ఏమిటంటే అంతకుముందు సుప్రీం కోర్టు వారు ఇచ్చిన రెండు తీర్పులలో ఒక తీర్పు సహేతుకమని,రెండవది సహేతుకం కాజాలదని ,పైపెవ్చ్చు రాజకీయ నాయకులు,అధికార్లు అట్టి తీర్పును అడ్వాంటేజ్ గా తీసుకుని దుర్వినియోగం పరచే అవకాశం ఉందని , కాబట్టి అట్టి తీర్పు మిద రివ్యూ కోరవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది . అట్టి పోస్టుకు మిత్రులు , సీనియర్ న్యాయవాది గారైన G నరేందర్ గారు సమర్దించడమైనది. ఈ రోజు అదే కేసులకు సంబందించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు వేసిన రివ్యూ పెటిషన్లు ను పరిశిలించిన అనంతరం సుప్రీం క...