Posts

Showing posts with the label కామన్ మాన్

పవన్ కళ్యాన్ లోని "కామన్ మాన్ " ఎందుకు ముడుచుకు పోయాడు? కేజ్రీవాల్ లోని "అమ్ ఆద్మీ " ఎలా ముందుకొచ్చాడు!?

Image
                                         కామన్ మాన్! అమ్ ఆద్మీ !. రెండు పదాలు అర్దం ఒకటే. కానీ అవే పదాలు ఒక చోట ప్రజలలో బ్రహ్మాండమైన చైత్యన్యం తెచ్చి ప్రభుత్వాన్ని మార్చివేస్తే, మన దగ్గర మాత్రం ఏమి చెయ్యలేక ముడుచుకుని పోయింది. కారణం, అక్కడ ఎమోషన్ కి ఆలోచన జతకలిసింది, ఇక్కడ ఉన్న ఎమోషన్ ని 'పెద్దరికం" గొంతు నులిమేసింది. అందుకే అది గత ఆరేళ్ళుగా గొంతు దాటి బయటకు రాలేక పోతుంది.     ఇటీవల డిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ స్తాపించిన ఆం ఆద్మీ పార్టీ 28 సీట్లు సంపాదించి, అధికార కాంగ్రెస్ ని ఊహించని చావు దెబ్బ తీసింది. కొంచం లౌక్యం ప్రదర్శిస్తే కేజ్రీవాలే డిల్లీకి ముఖ్యమంత్రి అవుతారు. మరి సంవత్సర కాలం క్రితం  వరకు ఉనికిలో లేని అమ్ ఆద్మీ పార్టి ఒక్క సారిగా ఎన్నికలలో ఘన విజయాన్ని ఎలా సాదించగలిగింది? ఒకటే కారణం , గత ప్రబుత్వ విదానాల మీద విసిగి వేసారి ఉన్న ప్రజలు , అవినీతి మీద సమర శంఖం పూరించిన "అన్నాహాజారే " లాంటి సామాజిక ఉద్యమ కారుడు వెనుక నడవడానికి సిద్ద పడి...