పవన్ కళ్యాన్ లోని "కామన్ మాన్ " ఎందుకు ముడుచుకు పోయాడు? కేజ్రీవాల్ లోని "అమ్ ఆద్మీ " ఎలా ముందుకొచ్చాడు!?
కామన్ మాన్! అమ్ ఆద్మీ !. రెండు పదాలు అర్దం ఒకటే. కానీ అవే పదాలు ఒక చోట ప్రజలలో బ్రహ్మాండమైన చైత్యన్యం తెచ్చి ప్రభుత్వాన్ని మార్చివేస్తే, మన దగ్గర మాత్రం ఏమి చెయ్యలేక ముడుచుకుని పోయింది. కారణం, అక్కడ ఎమోషన్ కి ఆలోచన జతకలిసింది, ఇక్కడ ఉన్న ఎమోషన్ ని 'పెద్దరికం" గొంతు నులిమేసింది. అందుకే అది గత ఆరేళ్ళుగా గొంతు దాటి బయటకు రాలేక పోతుంది.
ఇటీవల డిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ స్తాపించిన ఆం ఆద్మీ పార్టీ 28 సీట్లు సంపాదించి, అధికార కాంగ్రెస్ ని ఊహించని చావు దెబ్బ తీసింది. కొంచం లౌక్యం ప్రదర్శిస్తే కేజ్రీవాలే డిల్లీకి ముఖ్యమంత్రి అవుతారు. మరి సంవత్సర కాలం క్రితం వరకు ఉనికిలో లేని అమ్ ఆద్మీ పార్టి ఒక్క సారిగా ఎన్నికలలో ఘన విజయాన్ని ఎలా సాదించగలిగింది? ఒకటే కారణం , గత ప్రబుత్వ విదానాల మీద విసిగి వేసారి ఉన్న ప్రజలు , అవినీతి మీద సమర శంఖం పూరించిన "అన్నాహాజారే " లాంటి సామాజిక ఉద్యమ కారుడు వెనుక నడవడానికి సిద్ద పడినపుడు ,కేజ్రీవాల్ తెలివిగా వారి ఎమోషనల్ పీలింగ్స్ ని "ఆంఆద్మీ " పార్టీ స్తాపించడం ద్వారా దాని వైపు ఆకర్షించించి విజయం సాదించాడు. కొంత సంయమనం , లౌక్యం పాటిస్తే డిల్లీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కూడా కేజ్రీవాల్ గారికి అసాద్యం కాదు.
ఇక పోతే మన రాష్త్రాన్నికి వస్తే 2007 సంవత్సరం లోనే ప్రముఖ చలనచిత్ర నటుడు పవన్ కళ్యాన్ గారు "కామన్ మాన్ ప్రొటెక్షన్ పోర్స్" అనే పేరుతో ఒక సంస్త స్తాపిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ ప్రకటించే సమయం లో అయన గారి ముఖం లో ప్రతిపలించిన ఎమోషనల్ పీలింగ్స్ చూస్తుంటే , సామాన్య మానవుడి సేవలో జన్మ సార్ధకత చేసుకోవాలనే తపన కనిపించింది. వెంటనే తన చెక్బుక్ తీసి ఒక కోటి రూపాయల విరాళం కూడా సదరు సంస్తకి రాసిచ్చాడు. తన వెంట ఎవరు వచ్చినా , రాకున్నా తను మాత్రం కామన్ మాన్ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తాను అని ఎంతో బావోద్వ్గంగా చెప్పాడు. బహుశా ఆయనకు చిరంజీవి గారి పనికి రానీ ప్రజా రాజ్యం అడ్డు లేకుండా ఉన్నట్లైతే తప్పకుండా ఏదో ఒకటి చేసే వాడు. కానీ దురదృష్ట వశాత్తు తెలుగు ప్రజలు అతనిలోని "పవనిజాన్ని " చూడలేక పోయారు. అంతే కాదు , తెలుగు నాట ఏ మేదావి ఆయనలోని ఏమోషన్ని అస్త్రంగా మార్చి ప్రజా కంటక విదానాల మీద ఎక్కుపెట్టలేక పోతున్నారు.
మన ప్రజా స్వామ్యం లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రబుత్వాల మీద ప్రజలకు బాగా వ్యతిరేకత కలిగే వరకు ఎవరి మాట వారు వినరు.అవినీతి గురించి అసలు ప్రజలు పట్ట్ంచుకోను కూడా పట్టించుకోరు. అలా పట్టించుకునే వారే అయితే "కరప్షన్ మాన్" లు ఎవరూ ప్రజా నాయకులం అంటూ ప్రజల్లో తిరిగే అవకాశమే ఉండెది కాదు . అదే బాగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సమయంలో ఏ కొద్ది పాటి చరిష్మ ఉన్న నాయకుడు ప్రభుత్వ విదానాలకు ఎదురు తిరిగినా, ఖచ్చితంగా ప్రజలు వారికి పట్టం కడతారు. ఇది జనతా పార్టీ విషయం లోను, N.T.R గారి విషయస్ం లోను, కేజ్రీవాల్ గారి విషయం లోను అర్దం అవుతుంది. ఇంకా కొన్నాళ్ళు ఓపిక పట్టి ఉంటే చిరంజీవి గారికి కూడా సీమాంద్రులు బ్రహ్మరదం పట్టే వారే. కాబట్టి నెగటివ్ వోట్ ద్వారా నే మనదేశం లో రాజ్యాదికారం సాద్యం. దానికి చరిష్మా కల ప్రజా నాయకుడు అవసరం. లేకపోతే జయప్రకాశ్ నారాయణ్ గారి పార్టీ పరిస్తితే . సదరు చరిష్మా కల నాయకుడు ని వెనకుండి నడపగలిగిన మేదావులు ఉంటే తప్పకుండా తెలుగునాట రాజకీయాలలో మార్పు సాదించవచ్చు. అది సామాన్య ప్రజలకు మేలు చేసే విదంగాను మలచ వచ్చు.
ఇప్పుడు తెలుగు రాజ్యం లో ప్రజలు రెండు బలమైన ఎమోషనల్ గ్రూపులుగా గా విడి పోయి ఉన్నారు. ఒకటీ రాష్ట్ర విభజన కోరుకుంటున్న వారు. రెండు సమైక్యతా కోరుకుంటున్న వారు. రాష్ట్ర విభజన కోరుకుంటున్న వారి దగ్గరకు వెళ్లి ఇప్పుడు ఏ వాదం వినిపించినా వారు వినిపించుకోరు. అలాగే సమైక్యతా వాదం తప్పా సీమాంద్రాలో ఏ అవినీతి నిర్మూలనా వాదం పనిచెయ్యదు సమైక్యతను కాపాడతామని బరోసా ఇస్తే "కరప్షన్ మాన్ " కి అయినా మద్దతు ప్రకటిస్తారు తప్పా , నీతి వంతమైన పాలన ఇస్తాను అని "గాందీ గారే" దిగివచ్చి చెప్పినా ఎవరూ వినే పరిస్తితిలో లేరు. కాబట్టి సీమాంద్రా ప్రజలలోకి వెళ్ళడానికి కామన్ మాన్ పవన్ కళ్యాన్ గారికి ఇదే మంచి అవఖాశం. పెద్దగా పార్టీ మానిపెశ్టో లు అంటూ ప్రణాళికలు రచించాల్సిన అవసరం లేదు. సమైఖ్యాతా రాగం ఒకటి ఆలపిస్తే చాలు , పవర్ లోకి రావడం ఖాయం. కారణం అభిమానుల్లో ఉన్న "పవనిజం" . వ్యక్తీ గతంగా చిరంజీవి గారి కంటే ఎన్నో రెట్లు మెరుగైన వ్యక్తిగా పవన్ కళ్యాన్ కి సినిమా ఇండస్ట్రీలో పేరుంది. అలాగే ఆయనకి ప్రజలకి సేవ చేయాలన్న ఎమోషన్ అయన ముఖంలో బాగా కనిపిస్తుంటుంది,మాటల్లో వినిపిస్తుంటుంది . మరి అటువంటి వ్యక్తిని అస్త్రం గా మలచి ప్రయోగించగల మేదావులు తెలుగునాట ఎవరూ లేరా?
సీమాంద్రాలో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్తితుల వలన కాంగ్రెస్ దుంప నాశనం కావడం ఖాయం. తెలుగు దేశం ని ప్రజలు పూర్తిగా నమ్మే పరిస్తితి లేదు. ఈ అవకాశం ఏ "కరప్షన్ మాన్" లో తీసుకునే బదులు ఈ ఎమోషనల్ హీరో ని రంగం లోకి తెచ్చి కామన్ మాన్ కి ఉపయోగపడే రాజకీయ సంస్కరణలు సాదించడం తెలివిగల పని అవుతుంది. ఆ దిశగా తెలుగు మేదావులు ఆలోచిస్తే మంచిది. పవన్ కళ్యాన్ లోని కామన్ మాన్ పట్ల ఉన్న ఎమోషనల్ ఫీలింగ్ ని ఈ విడియో లింక్ లో చూడండి .
(16/12/2013 Post Republished)
Comments
Post a Comment