అతను ప్రేమించినది ఎవర్ని? భార్యనా? లేక ఆమెనా?
ఇది ఒక బార్యా,భర్తల ప్రేమ కథ లాంటి నిజం.వారివురు భార్యా భర్తలు.అతను ప్రభుత్వ ఉడ్యొగి, ఆమె గ్రుహిణి . వారివురు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు అని చెప్పవచ్చు. అమే లేనిదే జీవితమే లేదు అన్నట్టు ప్రవర్తించేవాడు అతను ఆమే అంతె. ఎక్కడికి వెళ్ళినా జంటగానే వేళ్లేవారు. వారి కి ఇద్దరు ఆడపిల్లల్లు. సంసారం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫిగా హాపీగా సాగిపోతుండెది.ఇద్దరు ఆడపిల్లల్లు యుక్తవయస్కులు అయ్యారు.
అటువంటి తరుణంలో ఆ దేవుడికి వారి ప్రేమను చూసి కన్ను కుట్టిందేమో, పాపం ఆమెకు కాన్సర్ జబ్బు చేసి సంవత్సరం లోపులోనే చనిపోయింది. మేమంతా చాలా బాద పడ్డాం. అతను ఎలా జీవిస్తాడు అని ఆందోళన పడ్డాం. కాని విచిత్రంగా మూడు నెలల లోపే అతను తిరిగి వివాహం చేసుకున్నాడు. ఆడపిల్లల్లు ఆ పెళ్లికి అబ్యంతరం పెట్టినా లెక్క చెయ్యకుండా రెండవ జీవితాన్ని కొనసాగించాడు.
ఆ తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చెయ్యగానే, అతనికి ఏదో ముల్లు గుచ్చుకుని,సెప్టిక్ అయి, అతను మరణించడం,ఆ తర్వాత రెందవ అమ్మాయి పెళ్లి అయి,ఆస్తులు, పిల్లలు, రెండవ బార్య పంచుకుని ఎవరి దారిన వారు బ్రతుకుతున్నారు. ఇదీ కథ,
ప్రియమైన పాటకులారా! నాదొకటే సందేహం.సుమారు ఇరవై సంవత్సరాలు, పదిమంది ఈర్ష్యపడెలా ప్రేమైక జీవితం సాగించిన అతను, బార్యా చనిపోయి, మూడు నెలలు గడవక ముందే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అంటే అతను తన బార్య మీద చూపింది నిజమయిన ప్రేమా? కాదా?అతను ప్రేమించింది దేనిని? బార్యనా లేక ఆమేనా(మనస్సు)?ఎందుకంటే బార్యలు ఎంతమందైనా దొరకొచ్చు, కాని ఆమె మాత్రం దొరకదు.అతను చేసింది సామాజికంగా తప్పు కాక పోయినప్పాటికి, మరీ మూడు నెలలు గడవక మ0దే బార్యను మరచిపోవడం అంటే " ప్రేమ" గురించి అనుబందాలు గురించి ఆలోచించే వారికి ఎలాగో ఉంటుంది. ఏ మంటారు?
(25/11/2012 Post Republished).
This comment has been removed by a blog administrator.
ReplyDelete