Posts

Showing posts with the label gang rape

మగవాళ్లలో" రేప్" లు చేసేది ఎక్కువుగా వీరేనంట!

Image
                                                                                                ".రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు...మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల...వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు"  పై మాటలు ఒక మిత్రుని అభిప్రాయ వ్యాఖ్యలు. నేను నిన్న "మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!" అనే ఒక టపా పెట్టడం జరిగింది. దానికి స్పందించిన ఒక మిత్రుడు పై విదంగా స్పందించారు. నాకు కొంచం ఆశ్చర్యం  తో కూడిన అనుమానం వచ్చింది.నిజంగా మగవాళ్లలో రేప్ లు చెసే వారు ప్రత్యేక ఫీల్డ్ కు చెందిన వారేనా? వీరి వల్లనే సమాజం లో స్త్రీల మీద ఎక్కువుగా అత్యాచారాలు జరుగుతున్నాయా? ఒక వేళ అదే నిజమయితే ప్రబుత్వాలు ఈ విషయం మీద ఎందుకు ద్రుష్టి పెట్టడం లేదు?.   అత్యాచారాల విషయం గూర్చి, కేంద్ర ప్రబుత్వం వారు జస్టిస్ వర్మ గారి కమీషన్ వేసినట్లు తెలిసింది. ఈ విషయం లో ప్రజలు పై పై మాటలు కాకుండ తమకు తెలిసిన విషయాలను ఉటంకిస్తూ, సహేతుకమయిన, నివారణోపాయాలను కమీషన్ కి సూచిస్తే మంచిది. సమస్య చిన్నది కాదు

"నపుంసకుడి చేతిలో రంభ" లాంటి పాలన అంటే ఇదే మరి! .

                                                                         ఏదయినా ఒక ఘోరం జరగగానే, దాని గురించి ప్రజలు, మీడీయా ఉవ్వెత్తునా స్పందించడం, అది చూశి హడావుడిగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత చట్టం తన పని ఎలాగు తాను చేసుకు పోతుంది కాబట్టి,అందరూ దానిని మర్చి పోయి మరొక సంఘటణ జరిగే దాక, పట్టిచ్చుకోవక పోవడం మామూలైపోయింది.   మన దేశంలో "మానబంగాలు, దోపిడీలు" సాదారణ నేరాలై పోయాయి. దేశ రాజదానిలోనే అత్యంత కిరాతకంగా ఒక అబలని "గాంగ్ రేప్" చేసి కుక్కల్ను విసిరేసినట్లు, బస్సులోంచి విసిరేశారు అంటే అసలు నేరగాళ్ళకు, ప్రభుత్వం అన్నా, పోలిస్లు అన్నా భయం ఉందా? అహ ఉందా అని?  "రాజు నిద్రపోతున్నా, రాజ్య దండం రాజ్యాన్ని పహారా కాస్తుండాలి" అనేది చాణక్య రాజ్య నీతి."తమ వాటాలు తమకు ముడితే  చాలు, పట్టపగలు మర్డర్ చేశినా పర్వానై" అనేది నేటి దండణాదికారుల నీతి.అందుకే నేరస్తులు ఇంతగా రెచ్చి పోతున్నారు. డబ్బులు వెదజల్ల గలిగిన వాడు, ఎంత పెద్ద నేరం చేసినా, సుళువుగానే తప్పించుకుంటున్నాడు. ఒక వేళా వాడు జైళ్లల్లో ఉండాల్సి వచ్చినా అక్కడవారి&q