Posts

Showing posts from 2015

"కాలామని" + కాంతామణి = కాల్ మనీ

Image
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 వేల కోట్ల రూపాయల స్కాం గా అభివర్ణిస్తున్న "కాల్ మని " వ్యవహారంలో సామాన్య ప్రజలకు అంతుపట్టని అనేక విషయాలు ఉన్నాయి. చూడబోతే కాల్ మనీ గుట్టును కావాలనే పధక రచయితలు బయటపెట్టడం వలననే వెలుగులోకి వచ్చినట్లు కనపడుతుంది. దానిలో బాగంగానే పోలిస్ వారి దాడులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది.

 ఈ  కాల్ మని దందాలో చోటామోటా రాజకీయ నాయకులు, క్రింది స్తాయి పోలిసులు అప్పులు ఇచ్చిన వారైతే , వాటిని తీసుకుని తిరిగి కట్టలేని వారు ఎక్కువమంది స్త్రీలే కావడం విశేషం . సదరు స్త్రీ లు ఫోన్ చేయగానే ఇంటికి వెళ్లి కేవలం ప్రామిసారి నోట్లు మీద సంతకాలు లాంటివి తీసుకుని  లక్షలు , లక్షలు ఇచ్చెయ్యడం , తిరిగి వారు వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించలేని పక్షం లో, వారితో వ్యభిచారం చేయించి అయినా తమ డబ్బులు రాబట్టుకోవాలని చూసే నీచ సంస్క్రుతి , రెగ్యులర్ గా డబ్బులను వడ్డిలకు తిప్పే వారిలో ఉంటుందా? ఇలా చేస్తే వారి వడ్డి వ్యాపారాలు  మూతపడి  పోతాయని తెలియదా వారికి? కాబట్టి సాంప్రదాయ వడ్డీ వ్యాపారస్తులు కాని, కష్టార్జితాన్ని వడ్డిలకు ఇచ్చి సంపదను పెంచుకోవాలని …

ఆంద్రా అసెంబ్లీ ని అల్లలాడిస్తున్న ఒక్క "ఆడ ధీర " !!

Image
ఆమె గారి పేరు రోజా ! పేరుకే రోజా యే కాని ,ముట్టుకోక ముందే కసక్కున దిగుతాయి ముళ్ళు లాంటి మాటలు. ఆమె గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు చలన చిత్ర రంగం లో తనదైన హావబావ శైలి తో రాటు దేలిన నటి మణి కాబట్టి, ఆ అనుభవం రాజకీయ రంగానికి పనికి వచ్చింది. ఆమె గారు అసెంబ్లీలో మాట్లాడే మాటలు లో మాటర్ ఉన్నా లేకపోయినా , హవాబావాలు తో అధికార పార్టి సబ్యులను కట్టడి చేస్తూ ప్రతి పక్షానికి ఆనందం చేకూర్చడం లో సపలిక్రుతురాలు అవుతుంది ఈ మాజీ నటీ మణి. ఆమె ను ఎదుర్కోవడానికి  మగ సభ్యులకు  మహా ఇబ్బంది అనుకుంటే   అధికార పార్టిలోని మహిళా సభ్యులకు కూడా ఆమె నోట్లో నోరు పెట్టే దమ్మున్న వారు లేకుండా పోయారు. చివరకు ఆమె గారి మాటల దాడి సాక్షాత్ ముక్యమంత్రి గారి మీదకే మల్లె సరికి , ఇక తట్టుకోలేక ఏడాది పాటు అసెంబ్లీ  నుండి సస్పెండ్ చేసి "హమ్మయ్య " అని ఊపిరి పీల్చుకున్నారు రాజ్యాంగ పరిరక్షకులు.

                        నోరు ఉంది కదా , లేడిస్ తెగించి మాట్లాడితే ఎంతటి వారైనా చేసే దేమిలేదు అని అనుకునే రోజా గారి లాంటి వారికి చెంప పెట్టు లాంటిది సస్పెన్షన్ ఆస్త్రం. బహుసా తెల…

Google గమ్మత్తు గా "సాష్టాంగ భుజంగాసనాలు " యానిమేషన్ !!

Image
నేను  "S.S.M Ashramam (Surya Savarnika Manavu AshramaM  " అనే నా ఇంగ్లీష్ బ్లాగులో, ఏప్రియల్ 18 2015 నాడు "SURYA NAMASKAR -THE BEST SPIRITUAL YOGA " అనే టపాలో సూర్య నమస్కారాలకు సంబందించిన కొన్ని చిత్రాలు పెట్టడం జరిగింది. అయితే ఈ  రోజున Google ఫొటోస్ నుండి ఒక మెస్సేజ్ వచ్చింది . అదేమిటంటే నేను పెట్టిన చిత్రాలు లో నుండి "సాష్టాంగ ఆసనం ", భుజంగాసనం  చిత్రాలను కలిపి యానినిమేషన్ చిత్రం గా మలచడం జరిగిందని. ఆ యానిమేషన్ చిత్రం చూస్తే అచ్చంగా  ఒక అమ్మాయి సముద్రపు ఒడ్డున ఉదయపు ఎక్సర్సైజ్ లు చేస్తున్నట్లే ఉంది కదూ !. పై చిత్రం సదరు గూగుల్ వారి యానిమేషన్ చిత్రమే. ఇక నా బ్లాగు టపా కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి.


Surya Namaskar- The best Spiritual Yoga !

"రూల్ అప్ లా " ఉన్నంతకాలం , "తీఫ్ ఫెస్టివల్ " అయినా "భీఫ్ పెస్టివల్ " అయినా 'నహీ చలేగా!నహీ చలేగా !'

Image
మన రాష్ట్రం పక్కనే ఉన్న ఒకానొక పొరుగు రాష్ట్రం లో "దొంగల పల్లె " ఉంది అట. ఈ  మద్య మన పోలిస్ వారు వారిని అరెస్ట్ చేయడానికి అని వెడితే ఊరు ఊరంతా కలసి పోలిస్ వారి మీద దండ యాత్ర చేస్తే ఆశ్చర్య పోవడం పోలిసుల వంతు అయింది అట. అసలు విషయం ఏమిటంటె , ఆ పల్లెలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది కుల వ్రుత్తి ఏమిటంటే దొంగతనం చేయడం. తర తరాలుగా వారి తాత ముత్తాతల కాలం నుండి దొంగతనాలు చేస్తూ తద్వారా సంపాదించిన దానితో రాజ భోగాలు అనుభవిస్తున్నారు. అయితే వారి పల్లె ఉన్న ప్రాంతం లోని పోలీసులకు వారికి మద్య ఒక "పెద్దమనుషుల ఒప్పందం " లాంటిది ఉందట. దొంగతనాలు వారి రాష్ట్రం లో చేయడానికి వీలు లేదు. పక్కనే ఉన్న మన రాష్ట్రం లో చేసి సొమ్మును వారి రాష్ట్రానికి చేరిస్తే , మన రాష్ట్ర పోలిసులు అరెస్ట్ లు చేయడానికి వచ్చినా సహకరించకుండా ఉండటమో , లేక సమాచారం ముందుగా సంబందిత దొంగలకు చేర వేయడం ద్వారా వారు పట్టుబడకుండా , స్తానిక పోలిస్ వారికి సహకరించాలి అన్న మాట. ఇలా సహకరించినందుకు పోలిస్ వారి వాటా పోలీసులకు ఉంటుంది . తమ జూరిస్డిక్షన్ లో దొంగతనాలు జరుగవు పై అధికారుల ఒత…

పెండ్లి అయిన "సానియా మీర్జా " గారు , "Miss " ఎలా అయ్యారు ! ఓ 'రబ్బా' '!!!?

Image
నాకు తెలిసినంతవరకు ఇంగ్లీష్ లో వివాహితులు అయిన స్త్రీ పురుషులను సంబొందించడమ్ లో వివక్షత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. పురుషుడు అవివాహితుడు అయినా , వివాహితుడు అయినా సంబోదించడం తేడా ఏమి ఉండదు . మిస్టర్ X అని సర్వకాల సర్వాస్తల యందు పిలువవచ్చు . కాని అదే స్త్రీ అయితే పెండ్లి కాక ముందు Miss Y  అని పిలువబడిన ఆమె పెండ్లి అయ్యాక మాత్రం Mrs Y (మిస్సెస్) అని పిలువబడుతుంది. ఇది అందరి విషయం లో ఒకటే అనుకునే వాణ్ని ఇన్నాళ్ళు . కాని ఈ సంబోధ సూత్రం "ఇండియాలో ఇంతులకు రక్షణ లేదహో " అని చాటి చెపుతున్న మన టెన్నిస్ తార "సానియా మీర్జా " గారికి  వర్తించదని , నిన్నటి ఇండియన్ ఎక్ప్రేస్ ఆమె తరపున ఇచ్చిన వివరణ చూసే దాక నాకు తెలియదు. ఒకవేళ ఇండియన్ ఎక్స్ప్రెస్స్ వారు స్త్రీలను సంబొదించడమ్ లో ఉన్న వివక్షతను వ్యతిరేకించి, పురుషులు మాదిరే స్త్రీలను కూడా సర్వకాల , సర్వాస్తల యందు Miss గానే ఉదహరిస్తున్నారేమో ?

                ఇంతకీ విషయం ఏమిటంటే , ఈ  మద్య మద్యప్రదేశ్ ప్రబుత్వం వారు మన టెన్నిస్ తార గారిని  వార్షిక క్రీడా అవార్డుల పంక్షన్ కి  పిలిచ…

పుట్టింట్లో ఉన్నా , అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురేరా డొంగ్రే ! ---- ఛత్తీస్ గడ్ హైకోర్ట్

Image
అదేదో   సినిమాలోమహనటులు స్వర్గీయ  శ్రీ S.V రంగారావు అన్న డైలాగ్ పేమస్ డైలాగ్ గా మారి ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉండేది . అదే "అడవిలో ఉన్నా , బోనులో ఉన్నా పులి పులేరా డొంగ్రే " అన్న డైలాగ్ . ఇందులో డొంగ్రే అన్నది ఉతపదం. అదిగో అలాంటి డైలాగ్ ను గుర్తుకు తెచ్చింది  మొన్న ఛత్తీస్ గడ్ హైకోర్ట్ వారు ఒక కేసులో  ఇచ్చిన తీర్పు. "శ్రీమతి సరోజినీ బాయి vs స్టేట్ అప్ ఛత్తీస్ గడ్ " అనే కేసులో హై  కోర్టు వారు  సంచలన తీర్పును చెపుతూ  పుట్టింట్లో ఉన్నా ," అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురే" అని నొక్కి చెపుతూ , చనిపోయిన తండ్రి ఉద్యోగ హక్కును పొందడానికి పెండ్లి అయిన కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో , పెండ్లి అయిన కూతురికి అంతే హక్కు ఉంటుందని , దానిని కాదనడం పౌరుడికి రాజ్యాంగ ప్రసాదించిన ప్రాదమిక హక్కులను కాదనదమేని , ఇది ఖచ్చితంగా స్త్రీ పురుషుల మద్య వివక్షను చూపడమే కాబట్టి  ఆర్టికిల్ 16 (2) కు వ్యతిరేకమని బల్ల గుద్ది మరీ చెప్పింది. కేసు వివరాలు లోకి వెలితే

                                   జల్దేవ్ ప్రదాన్ అనే వ్యక్తీ ఛత్తీస్ గడ్ లోని మహాసమండ్ లో జనవనరుల శాఖలో ఉద్యొగం…

మతం "యాగం " చేస్తుంటే , విజ్ఞానం "ఆగమాగం " చేస్తుంది!!

Image
మత పరమైన అన్ని క్రతువులు విశ్వాసం కు సంబందించినవి. ప్రపంచ వ్యాప్తంగా ఈ  మతం, ఆ మతం అని లేకుండా అన్ని మతాలలో విశ్వాసాలకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవేవి సైన్స్ దృష్టితో పరిసిలీస్తే నేడు సమాజాభివ్రుద్దికి పనికి వచ్చేవిగా అనిపించకపోవచ్చు. కాని వ్యక్తిగత దృష్టితో   చూస్తే కొన్ని కోట్లు ఖర్చు చేసినా మనిషికి లభించని అలౌకిక ఆనందం తో కూడుకున్న పాజిటివ్ దృక్పదం , ఆయా మత వర్గాల ప్రజలలో కలిగించడానికి , ఈ విశ్వాస పూరిత క్రతువులు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి కోవకు చెందినవే పురాణాలలో చెప్పబడి , నేటికి కొనసాగుతున్న "యజ్ఞాలు " యాగాలు . భారత రాజ్యాంగం తన ప్రజలకు ఇచ్చిన మత స్వేచ్చకు అనుగుణంగా యజ్ఞాలు , యాగాలు చేసుకునే స్వేచ్చ ఉంది . దాని గురించి మాట్లాడాల్సిన అవసరం దేవుని నమ్మని నాస్తికులకు కాని, హిందూయేతర మతస్తులకు కాని లేదు.

                          ఈ  మద్య  విజ్ఞాన వాదులం అని హేతువాదులం అని విర్రవీగే కొందరు , కేవలం హిందూ మతం కి సంబందించిన విశ్వాసాలను పలుచన చేసే మాటలు మాట్లాడుతూ , ఇతరమతాల…

అమీర్ ఖాన్, భారతదేశ విషయం లోనే కాదు , భార్యల విషయం లోనూ పెద్ద "P .K " నే అంట !!!!?

Image
అమీర్ ఖాన్ గారు హీరో గా నటించిన "P.K " సినిమా బాక్స్పాపిస్ బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్టు అయింది. అది అంతలా సక్సెస్ కావడానికి అమీర్ ఖాన్ నటన కంటె , మతవిశ్వాసాలను గాయపరచే సంఘటనలు ఉన్నా వాటిని స్పోర్టివ్ గా తీసుకున్నకోట్ల మంది  హిందూ ప్రజల సహన శీలత్వమే కారణమని చెప్పక తప్పదు.  ఇదే  అమీర్ ఖాన్ ,ముస్లిం కంట్రిస్ లో, వారి మత విశ్వాసాలను గాయపరచే సంఘటనలతో ఉన్న సినిమాలో నటించి ఉన్నట్లు అయితే ఈ  పాటికి  ఏమై  ఉండెవాడొ ?  అది తెలియబట్టె  అమీర్ ఖాన్ గారు  చాన్నాళ్ళ వరకు కొంతమంది  మేదావులు అనబడే వారు చేస్తున్న"అసహనం పెరేడ్ " లో పాల్గొనకుండా కామ్ గా ఉన్నట్లు ఉంది. కాని "అసహన వాదులు ఉర్కోరు కదా ! అందుకే ఆయన్ని కూడా ఇండియాలో అసహనం పెరిగిపోతుందని ఒక పబ్లిక్ స్తేట్మేంట్  ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఉంది . వారి బాద తట్టుకోలేక చివరకు తప్పు అంతా బార్య మీదకు నెడుతూ అటూ ఇటూ కాని వక వంకర మాట "నా భార్య , మా పిల్ల వాడి విషయం లో భయపడుతుంది , ఇండియా మనకు సేప్ కాదు వేరే  దేశానికి వెళ్లి పోదామా అని అడిగింది " అని   , భారతీయులలో అత్యధి…

"మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి" --(2)

Image
http://ssmanavu.blogspot.in/2012/09/1.html
(ఇదిమాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! మొదటి బాగం  కి  కొనసాగింపు. మొదటి బాగం కోసం లింక్ ని క్లిక్ చెయ్యండి.)

  అవునండి "మాయమైపోతున్న మా  తెలుగు అమ్మాయి" గురించే నేను చెపుతున్నా!. ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగమ్మాయిని  చూసారా? చూస్తే చెప్పండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది. ఓ! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదు కదూ! ఆనవాలు చెపుతా, వినండీ.        మా అమ్మాయి అమాయకంగా అందంగా ఉంటుంది

       మా అమ్మాయి పరికిణి ( లంగా) కట్టుకుని  ఉంటుంది.అలాగే ఓణి వేసుకుని ఉంటుంది.తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుని,చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన చంద్రబింబం లాంటి బోట్టుతో,    కాళ్లకు పట్టిలతో ముద్దబంతి పువ్వులా ఉంటుంది.ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? మాకైతే గత 10 సంవత్సారాలుగ కనిపించడం లేదు. పండక్కో,పబ్బానికో,అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమై పోతుందంతే.
                     మా అమ్మాయి ఎలా మాయమైందంటారా? ఏమి చెప్పం బాబు మా దౌర్బాగ్యం. ఎవరో పంజాబీ అమ్మాయి అంటా,ఆ అమ్మాయిని చూసింది.అంతే !ఆ రోజు నుంచి మా అమ్మాయ…

మాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! (1)

Image
మనందరికి ఒక శుభవార్త! ఏమిటంటే రెపు అక్టోబర్ 1 వ తారీకు నుండి 19 వ తారీకు వరకు 11 వ జీవ వైవిద్య సదస్సు జరగనుంది. ఎక్కడో తెలుసా ?సాక్షాత్తు మన రాజధాని నగరమైన హైదరాబాదులో. ఒక ప్రపంచ స్తాయి సదస్సు మన రాజధాని లో జరగటం మనకు శుభవార్తే కదా!. ఇంతకి జీవ వైవిద్య సదస్సు అంటే క్లుప్తంగా తెలుసుకుందాము.

460 కోట్ల సంవత్సరాలు! ఇది భూమి వయసు!
భూమిని ఒక మహిళతో పోలుద్దాం!… ప్రతి 10 కోట్ల సంవత్సరాలను ఒక సంవత్సరంగా లెక్కిద్దాం! అంటే… భూమి అనే మహిళ వయసు ఇప్పుడు 46 ఏళ్లు.
భూమి పుట్టి కళ్లు తెరిచిన తొలి ఏడేళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు! అది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం!
ఆ తర్వాత మరో 35 సంవత్సరాలపాటు భూమి జీవితంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నకు అస్పష్టమైన సమాధానాలు మాత్రమే లభించాయి.
భూమి 42 ఏళ్ల వయసులో… తొలి పుష్పం వికసించింది.
44 సంవత్సరాల వయసులో… రాక్షస బల్లులలాంటి భారీ సరీసృపాలు నడయాడాయి.
జస్ట్… ఓ ఎనిమిది నెలల కిందటే భూమిపై క్షీరదాలు నడక ప్రారంభించాయి.
పోయిన వారమే ఏప్ (తోకలేని కోతి) నుంచి మనిషి ఆవిర్భావ ప్రక్రియ మొదలైంది.
4 గంటల క్రితం.. ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు.
సరిగ్గా గం…

పెళ్ళాం మాట పట్టించుకోని "అమీర్ ఖాన్ ది గ్రేట్ ".!!!

Image
"గత 6 , 8 నెలలుగా  ఇండియాలో అసహనం  ఎక్కువ అవుతుంది " అని సెలవిచ్చారు ది గ్రేట్ హిందీ యాక్టర్ అమీర్ ఖాన్ గారు. నిజమే మరి! మోడి గారి ప్రబంజనం దేశ విదేశాల్లో హల్చల్ చేస్తుంటే , ఆయనన్నా అయన ప్రభుత్వం అన్నా గిట్టని వారికి "అసహనం " ఎక్కువ అవుతుండడం లో విచిత్రమేమి లేదు. కాకపోతే అది ప్రదర్శించడానికి వారికొక "బూచి " కావాలి . అలాంటి బూచి పాత్రకు RSS  లోని కొంతమంది నోటి తీటగాల్లను ఎన్నుకుని , వారు మాట్లాడే మాటలకు విపరీత పబ్లిసిటి కల్పిస్తూ , మోడి గారు అంటె పడని మేధావులను కలసి వారి వారి అవార్డులను వెనక్కి ఇచ్చేస్తునట్లు ప్రకటనలు చేయిస్తూ తమలోని అసహనాన్ని ప్రదర్శించారు "అసహన వాదులు" . అందులో బాగంగానే ఇప్పుడు అమీర్ఖాన్ గారి చేత పై ప్రకటన చేయించి ఉంటారు.

                                   ఈ సందర్బంగా అమీర్ ఖాన్ బాయి ఒక మాట అన్నారు. " నా భార్య కిరణ్ రావు , ఇండియాలో పెరిగిపోతున్న అసహనం గురించి,  ఎక్కువుగా బయపడుతుంది , ఇండియాను వదిలి విదేశాలకు వెళదామని అంటుంది " అని సన్నాయి నొక్కులు నొక్కాడు. …

"కిస్ అప్ లవ్ " ఉద్యమం తో తో పేరు గాంచి, విటులను ఆకర్షిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ' రేష్మి నాయర్ దంపతులు'!

Image
రాహుల్ పసుపులన్ , రేష్మి నాయర్ అనే వారు భార్యాభర్తలు. వీరిలో పసుపులన్ చలనచిత్ర రంగం లో పనిచేస్తుంటె రేష్మి నాయర్ మోడల్ గా ఉంటుంది. వీరివురూ గత సంవత్సరం, మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా  జరిగిన "కిస్ అప్ లవ్ " అనే సంచలన ఉద్యమం లో పాల్గొని ప్రఖ్యాతి గాంచారు. అసలు కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకుల్లో వీరు ముఖ్యులు అట. ఏ ఉద్యమం వెనుకాల అయినా స్వలాభాపరులు కొంతమంది ఉంటారు. కాని జన బాహుళ్యం క్షేమాన్ని కోరుకునే ఉద్యమాలలో అటువంటి స్వలాబపరుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు. కాని అసలు ఉద్యమమే నీతిబాహ్యమైనది అయితే , అటువంటి ఉద్యమాల వల్ల   నిర్వాహకులకు లాబం , సమాజానికి నష్టం అని నిరూపించారు, కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకులు అయిన పసుపులన్  దంపతులు.

                          మొన్న మంగళ వారం  కిస్ అప్ లవ్ ఉద్యమానికి ప్రసిద్ది చెందిన కేరళలోని కోచి నగరం లో పోలిసులు , ఆన్లైన్  విదానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న 6 నిర్వాహకులను అరెస్ట్ చేసారు. అలా అరెస్ట్ చేయబడిన వారిలో , గత సంవత్సరం కిస్ అప్ లవ్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన , రాహుల్ పసుపులన్ , రేష్మి నాయర్ దంపతుల…

"ఇప్పట్లో రాముడిలా ఉండటం కష్టం " అని పక్కింటికి పోయి పడి చనిపోయిన 'సినిమా హీరో '

Image
ఈ  రోజు ఈ నాడు పేపర్లో ఒక దురదృష్టకర సంఘటన గురించి ప్రచురించారు . త్వరలో తెలుగుతెరకు పరిచయం కాబోతున్న "బాల ప్రశాంత్ " అనే వర్ధమాన హీరో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. ఆతను ఆత్మ హత్య చేసుకున్నట్లుగా పోలిసులు చెపుతున్న అసలు విషయం వివాహేతర సంబందమే అని ఈ నాడు వారు పూసగుచ్చినట్లు చెప్పేసారు . కాబట్టి దాని గురించి మల్లీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? క్రింది చిత్రం లోని సమాచారం చూడండి .
                                             పాపం ! ఎవరో ఒక నిర్మాతకి ప్రస్తుత పరిస్తితులకు తగ్గట్టు  మాంచి సినిమా తీసి  జనం మీదకు వదిలేదామని అనిపించినట్లుంది . అందుకే "ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండి బాబు " అనే ఇంత పొడుగు టైటిల్ తో సినిమా మొదలెట్టి 90% పూర్ర్తి చేసారంట. అందులో గుంతకల్ కి చెందిన బాల ప్రసాంత్ హీరో. వయస్సు 25 యేండ్లు కాబట్టి రాముడిలా ఉండటం కష్టం అనుకునట్లుంది ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆంటిని తనకు సహకరించమని  కోరినట్లు ఉంది. ఆమె గారికి కూడా "మొగుడు ఊరెళితే " అనే ఎపిసోడ్ లో నటించాలని తహ తహ గా ఉన్నట్లు ఉంది , హీరో గారి కోరికను తీర్చడానికి సమ్మతి తెలిపింది కామో…

ఇండియాలో మహాకూటమి గెలిస్తే , పాకిస్తాన్ నరకాసురుడు "దీపావళి " జరుపుకోవడం లో మతలబ్ ఏమిటి?

Image
పాకిస్తాన్! భారతదేశానికి పక్కా శత్రువు. మన దేశం లో ఏ ఉగ్రవాద చర్య జరిగిన దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఉంటాయి. మతమౌడ్యం తో ఉగ్రవాద తండాలకు ఆసరా ఇస్తూ నిరంతరం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వె పాకిస్తాన్ ని మిత్రదేశం అనుకోలేము. వేయి బజరంగీ బాయి  సినిమాలు తీసినా అవి పైసలు వసూలు చేసుకోవడానికి పనికి వచ్చేవే తప్పా , పాకిస్తాన్ మనసులో ఇండియా పట్ల ఉండే ద్వేషాన్ని తగ్గించలేవు. ఐ మద్య కొందరు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఇండియాలో వారేదో పెద్ద సౌబ్రాతుత్వం ఉన్న వారిలా సోషల్ మీడియాలో పోజులు పెట్టారు. దేశమమ్టె మట్టి కాదోయి మనుషులోయి అన్నది ఒక నాటి మాట. దేశమంటె రాజకీయాలు , మీడియాయె అన్నది నేటి మాట. ప్రజల మనసుల్లో ఏమున్నా బయటకు చెప్పలేని వారి వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఈ  నాడు ఒక దేశపు  ప్రజావాణి అంటె  ఆ దేశంలోని మీడియా చెపుతున్నాడే అని అర్దం కాబట్టి. "దేశమంటె  మట్టి కాదోయి మీడియా యేనోయి " అని చెప్పుకోవలసిన అవసరం ఉంది.

                     బీహార్లో మహాకుటమి గెలిస్తే పాకిస్తాన్లో టపాసులు పేలుతాయి అని  అమిత్ షా గారు అంటె ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. కాని అమిత్ ష…

అనవసరంగా రిజర్వేషన్ లు కెలికి , బొందలో పడిన B.J.P !!!

Image
బీహర్ ఎన్నికలు పలితాలు చూస్తే , RSS , శివసేన లోని కొంతమంది  మోడి గారి ప్రభంజనానికి  అడ్డుకట్ట వేయాలి అనే దురుద్దేశ్యం తో పని చేసినట్లు కనపడుతుంది. కాకుంటే ఏమిటి మరి చెప్పండి? కులకర్ణికి నల్లరంగు పూసిందేమో శివసేన కార్యకర్తలు . అదీ కూడా కులకర్ణి గారు సాక్షాత్తు శివసేన చీప్ తో సాయంత్రం గుస గుసలు  మాట్లాడాక  , తెల్లారే సరికి జరిగిన సంఘటణ. దానికి పూర్తి బాద్యత వహించాల్సింది శివసేన అంద్ కో మాత్రమే . కాని ఆ నల్ల రంగు ఏదో మోడి గారే దగ్గరుండి పూయించినట్లు నానా యాగీ చేసి దేశ వ్యాప్త నిరసనలకు నాంది పలికారు మహా కూటమి నాయకులు.అందువలన BJP కి బీహార్లో నష్టం జరిగింది.  ఇప్పుడు బీహార్లో మహాకూటమి గెలిచాక , నిన్న శివసేన అద్యక్షులు మాట్లాడుతూ , నితీష్ ఇంద్రుడు చంద్రుడు అని పొగడడమే కాక , బీహార్లో ఓటమికి మోడి యే పూర్తి బాద్యత వహించాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీని బట్టి చూస్తే శివసేన కు నితీష్ గారికి సత్సంబందాలే ఉన్నట్లు ఉంది. మరి ఈ సత్సంబందాలు ఏమన్నా బీహర్ ఎన్నికల్లో పనిచేసాయా అనే అనుమానం కలుగుతుంది.

   ఇకపోతే RSS వారి ఇంగితం తక్కువ పనులు. ఒకవైపు రిజర…

"మోడి పోభియా" తో బాదపడుతున్న మేదావుల సృష్టి పేరే అసహనం !!

Image
కాంగ్రెస్ ప్రభుత్వం పోయి , మోడీ గారి నేతృత్వం లో B J P  ప్రభుత్వం వచ్చాక , హిందూ జీవన విదానం మీద  దాడులు ఎక్కువ చేస్తున్నారు కొంత మంది కుహన సెక్యులర్ కం అభ్యుదయ వాదులు. గత ప్రభుత్వ హయాంలో ఘోరాతి ఘోరమైన అమానవీయ పనులు దేశ వ్యాప్తంగా జరిగినప్పుడు , ఇంట్లో ముసుగు తన్ని పడుకున్న భీరులు సైతం ఇప్పుడు వీరావతారం ఎత్తి చిందులు తొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఏ చిన్న ప్రకటన అయినా కుల వివక్షత గురించి కాని,మతవివక్షత గురించి కాని వస్తే , దానికి పూర్తి బాద్యత హిందూ జీవన విదానం పాటిస్తున్న కొన్ని వర్గాలదే అని , దానికి నాయకుడు నరేంద్ర మోడీ గారే అనే దుష్ప్రచారం చేస్తూ , సోషల్ మీడియాను కలుషితం చేస్తున్నారు.

   నరేంద్ర మోడి గారు గుజరాత్ ముక్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యాంటి హిందూ శక్తులకు , అయన ఏకంగా ప్రదానమంత్రి అయి భారత దేశ కీర్తీ ప్రతిష్టల తో పాటు తన కీర్తిని కూడా ప్రపంచ వ్యాప్తంగా చాటుతుంటె , అప్పటి దాక ఆయన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలకు మింగుడు పడని పరిస్తితి. ఒక వేల నరేంద్ర మోడి గారు 95% ప్రజలకు ఆమోదయోగ్యం అయ్యే పనులు చేసినా , ఆ 5% శాతం ఉన్న  అయన శ…

"నీ మొగుడిని నాకొదిలేసి పో " అన్న ప్రియురాలిని బజారులో బట్టలూడదీసి బాదిన "భార్యా ది గ్రేట్"!!!

Image
ఏ దేశం లో అయినా భార్య భార్యయే ! బాద్యత లేనిది బాద్యత లేనిదే ! కట్టుకున్న ఆవిడకు  ఉన్నంత హక్కు , ఉంచుకున్న ఆవిడకి ఉండదు. డబ్బు దస్కం ఎంత ఎక్కువుగా ఉన్నా సరే , అపరాద బావన ఉండటం వలన , పదిమందిలో తన చర్యలను సమర్దించుకునే దైర్యం ఉండదు. కాని అదే ఇల్లాలు అయితే తప్పు చేసి తన ఇంటికి, ఒంటికి  ద్రోహం  చేస్తున్న మొగుడినే కాదు అతగాడి ముద్దుల ప్రియురాలును సైతం నడి బజార్ లో నిలవేసి అడుగుతుంది, కడుగుతుంది , అవసరమైతే బడితే పూజ కూడా చేస్తుంది. అటువంటి సమయాల్లో సమాజం ఆమె వెనుకాల ఉంటుంది కాబట్టే ఆమెకు అంత దైర్యం.

                 ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటె . నిన్న ఒక వీడియో చూసాను . అందులో ఒక చైనా  స్త్రీ మరొక   స్త్రీని ,నడి బాజారులో  వలువలు ఊడదిసి మరీ కొడుతుంది. అయినా జనం వేడుక చూస్తున్నారే కాని పెద్దగా స్పందించినట్లు కనపడడం లేదు. విడియో చినీస్ లేక మరేదో  బాషలో ఉంది కాబట్టి విషయం అర్దం కాక, వైరల్ సెక్షన్ వారు ఇచ్చిన డిస్క్రిప్షన్ చదివాను. విషయం ఇదీ

                      బజారులో తన్నులు తింటున్న ఆమె చైనా దేశం కు చెందిన ఆవిడ. ఆమె  గారికి  ఒక వ్యక్తీ తో పరిచయం అయిందట.  ఆర్న…

సీటు కోసం సర్దుకుపోదామని మామ రాజయ్యగారు అనుకుంటే, చచ్చిపోయి సాదిద్దామని కోడలు అనుకున్నట్లుంది ?!!!

Image
నిన్న తెల్లవారు జామున తెలంగాణా రాష్ట్రం లోని వరంగల్ నగరం లో , మాజీ M.P రాజయ్యగారి ఇంట్లో జరిగిన ఘోర ఉదంతం అందరిని నివ్వెరపరచింది. రాజ్య గారి కోడలు తన ముగ్గురు పిల్లలతో సహా సజీవదహనం కావడం , అది గాంచిన రాజయ్య బోరు బోరున విలపిస్తూ ఉండడం చూచిన వారెవరికైనా మనసు చలించక తప్పదు. రాజయ్య గారి కోడలు సారికకు  , కొడుకు అనిల్ కు మద్య సక్యత లేకపోవడం, అనిల్ రెండొ వివాహం చేసుకుని తన జీవితం తానూ గడుపుతూ ఉండడం, గతం లో సారిక భర్త మీద , అత్తా మామల మీద గృహ హింస కేసులు పెట్టి అవి ఇప్పటికి పెండింగ్ లో ఉండడం వలన , రాజయ్య గారి  కుటుంబ సభ్యులకు , కోడలు సారికకు పడడం లేదని అర్దం అవుతుంది. ఈ పరిస్తితుల్లో సారిక , తన ముగ్గురు పిల్లలుతో సహా సజీవ దహనం అయితే , ఆమెను కన్నవారికి , తోడపుట్టిన వారికి ,రాజయ్య గారి కుటుంబం మీద అంతులేని కోపం కలగడం సహజం. అందుకే తమ కూతురిని రాజయ్య గారి కుటుంబ సభ్యులే చంపారని ఆరోపణలు చెయ్యడం కూడా సహజమే.

    కాని కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు, సజీవ దహనం లో సారిక తో పాటు, రాజయ్య గారి చిన్నారి   మనుమలు 3 ఆహుతి కావడం, రాజయ్య గారు గత 3 రోజుల క్రితమే కోడలు …

శుభమా అని బ్లాగులో "సంప్రదింపుల పారమ్ "పెడితే , నాకొచ్చిన మొదటి సందేశం ఇది!

Image
హలో.
నేను జీవితంలో సమయం ఇస్తుంది ఒక ప్రైవేట్ రుణ రుణదాత మిస్ ఫిలిప్ కెన్ am
మొదలైనవి వ్యక్తులకు అవకాశం రుణ, వ్యాపార సంస్థలు , బీమా, ఆర్
మీరు ఏ ఆర్థిక కష్టాల్లో లేదా రుణ అవసరమైన పెట్టుబడి లేదా మీరు
చేయడానికి ఏ మరింత మేము ఇక్కడ ఉంటాయి మీ బిల్లులు అన్వేషణ చెల్లించడానికి ఋణం
అన్ని మీ ఆర్థిక సమస్యలు గతంలో ఒక విషయం. మేము అన్ని రకాల అందించే
ముందస్తు ఫీజు లేకుండా 2 % చొప్పున ఏ కరెన్సీ విలువ కలిగిన లో రుణ.
నేను మీరు మేము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయడానికి ఈ గొప్ప మీడియం ఉపయోగించడానికి కావలసిన
మీ ఆర్థిక సమస్య పరిష్కరించడానికి రుణ ఎలాంటి మీకు సహాయం.
అవును అప్పుడు E-philipkenloan@gmail.com ద్వారా ఇప్పుడు తిరిగి వస్తే
మరిన్ని వివరాలకు , మీరు అత్యంత సంతోషాన్నిస్తుంది ...

భవదీయులు, 

పంపిన వారి బాషలో చెప్పాలంటే ఇది. 

Hello. 
I will give you the time in the life of a private loan lender can not miss the Phillip am 
Etc. The loan is likely to individuals, business firms, insurance, or 
If you need any financial difficulty or debt investment or you 
What is more, we are here to make money to pay your bills search 
All …