"మోడి పోభియా" తో బాదపడుతున్న మేదావుల సృష్టి పేరే అసహనం !!

                                                                               

                              కాంగ్రెస్ ప్రభుత్వం పోయి , మోడీ గారి నేతృత్వం లో B J P  ప్రభుత్వం వచ్చాక , హిందూ జీవన విదానం మీద  దాడులు ఎక్కువ చేస్తున్నారు కొంత మంది కుహన సెక్యులర్ కం అభ్యుదయ వాదులు. గత ప్రభుత్వ హయాంలో ఘోరాతి ఘోరమైన అమానవీయ పనులు దేశ వ్యాప్తంగా జరిగినప్పుడు , ఇంట్లో ముసుగు తన్ని పడుకున్న భీరులు సైతం ఇప్పుడు వీరావతారం ఎత్తి చిందులు తొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఏ చిన్న ప్రకటన అయినా కుల వివక్షత గురించి కాని,మతవివక్షత గురించి కాని వస్తే , దానికి పూర్తి బాద్యత హిందూ జీవన విదానం పాటిస్తున్న కొన్ని వర్గాలదే అని , దానికి నాయకుడు నరేంద్ర మోడీ గారే అనే దుష్ప్రచారం చేస్తూ , సోషల్ మీడియాను కలుషితం చేస్తున్నారు.

   నరేంద్ర మోడి గారు గుజరాత్ ముక్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యాంటి హిందూ శక్తులకు , అయన ఏకంగా ప్రదానమంత్రి అయి భారత దేశ కీర్తీ ప్రతిష్టల తో పాటు తన కీర్తిని కూడా ప్రపంచ వ్యాప్తంగా చాటుతుంటె , అప్పటి దాక ఆయన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలకు మింగుడు పడని పరిస్తితి. ఒక వేల నరేంద్ర మోడి గారు 95% ప్రజలకు ఆమోదయోగ్యం అయ్యే పనులు చేసినా , ఆ 5% శాతం ఉన్న  అయన శాశ్వత వ్యతిరేక వర్గం అంగీకరించి తీరదు. ఎందుకంటె అది అంతే. ఇన్నాళ్ళు హిందూ మతాన్ని తెగనాడుతూ తద్వారా లభించే విదేశి అవార్డులు, రివార్డులు తో పబ్బం గడుపుకుంటున్న వారికి , హటాతుగా స్వదేశి  బావజాల అనుకూల నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వం , ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తుంటే ఇబ్బందే కదా. ఒకవేళ కొంపదీసి ఈ స్వదేశి శక్తుల హయాంలో భారతదేశం బాగుపడి పోతే , ఇన్నాళ్ళు హిందూ జీవన విదానం గురించి తాము చెప్పిందంతా "సుత్తి " కబుర్లే అని జనాలకు అర్దమైపోతే ఇంకేమన్నా ఉందా? 

     పైకి మోడిని వ్యతిరెకిస్తున్నాం అని అంటూ అడుగడుగునా  హిందు జీవన విదానాన్నే హేళన చేస్తున్న  ఈ విదేశి బావజాల పుత్రులు చేస్తున్న టక్కూటమారలను ఇప్పుడిప్పుడే భార్తతీయ యువత గమనిస్తుంది. గత 60 యేండ్లుగా వారు కోరుకున్న సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నప్పటికి , దేశంలో ఇంకా వారు కోరుకున్న సామ్యవాదం  ఎందుకు రాలేదో , కుల రహిత, మత రహిత సమాజ స్తాపన ఎందుకు జరుగలేదో వారే చెప్పలేని అయోమయ పరిస్తితి లో ఉన్నారు వారు . ఆచరణకు వీలు కాని సిదాంతాలు తో , పడి కట్టు మాటలతో ప్రజలలో మార్పు తీసుకు వద్దామన్న వారి ఆలోచనలు ఎందుకు పనికి రానివిగా రుజువు అయినవి. ఇక వారు చెప్పే మాటలు వినే స్తితిలో మెజారిటి ప్రజలు లేరు. అందుకే భారత దేశం ని  "అభివృద్ధి మంత్రం " తో, స్వదేశి బావజాలం లోని మంచిని అభివృద్దికి పనికి వచ్చే ఆధునికతో సమన్వయము చేస్తూ , దేసాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలన్న సంకల్పం తో ఉన్న శ్రీ "నరేంద్ర మోడి " గారి వెనుకాల భారత జాతి నడవడానికి సిద్దమయింది. అభివృద్ధి చెందుతున్న అన్ని సమాజాలలో ఉన్నట్లే భారతీయ సమాజం లో కూడా దురాచారాల తాలూకు అవశెషాలు ఉండవచ్చు. అన్ని సమాజాలలో జరుగుతునట్లే ,వాటి నిర్మూలన కూడా క్రమంగా జరుగుతుంది. వాటిని చూపించి హిందూ జీవన విదానం మొత్తం ఇలాంటిదే అని చెపితే నమ్మడానికి ఇంకా ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకుని లేరు. ఎందుకంటె దురాచారాలను ఎవరు మొదలుపెట్టినా వాటించడం లో అన్ని వర్ణాల వారు పోటీ పడ్డారు అని చెప్పక తప్పదు.

                                   ఈ  దేశం లో ద్వంద స్వబావం కలిగిన నాయకులు ఉండటం వలన ఎవరు నిజమైన  అభ్య్దయవాదో  , ఎవరు బూజు పట్టిన బావాలకు ప్రతినిదో అర్దం కాని పరిస్తితి. చెప్పేవి చేయరు. చేసేవి చెప్పరు. లోక్ తాంత్రిక్ వాదులం అని చెప్పుకునే నాయకులు, తమ రాజకీయ బవిష్యత్ కోసం  తాంత్రికుల వద్దకు వెళ్లి తరుణోపాయాలు కావాలి అంటుటారు. కాని పక్కా హిందూ వాది అని ప్రతి పక్షాలు ముద్రవేసిన "మోడి " గారు , తన రాజకీయ బవిష్యత్ కోసం సోషల్ మీడియాని వాడుకోవడమే కాక  , దేశ ప్రగతి కోసం కూడా "డిజిటల్ ఇండియా " కావాలి అంటారు. కాబట్టి ఒక వ్యక్తీ అభ్యుదయ వాది అవునా కాదా అనేది ఆ వ్యక్తీ చేసే పనులు ను బట్టి నిర్ణయించాలి తప్పా , వల్లే వేసే పడి కట్టు పదాలు ద్వారా కాదు.  

                  మోడి అంటె గిట్టని  కుహానా మేదావులు కొందరు కొత్తగా ఇప్పుడొక వాదం మొదలు పెట్టారు. దాని పేరే "అసహనం" . నిజంగా అసహనం ఉంది హిందువులకు కాదు. కొంతమంది మైనార్తీ మేదావులకు మాత్రమే. ఇక్కడ మైనార్తీ అనేది మత పరంగా వాడడం లేదు. అసహనం అని గోల చేస్తున్న మేదావుల సంఖ్య పరంగా వాడుతున్నాను. ఈ "మైనార్తీ మేదావులకు " మోడి పోభియా " ఏర్పడింది. మోడి గారిని తమ శాశ్వత శత్రువుగా బావించి ఇన్నాళ్ళు,మోడి గారికి అమెరికా వీసాలు రాకుండా చేయడం లో కాని ,  అయన అధికారం  లోకి రాకుండా చేయడం కోసం శత విదాల ప్రయత్నించి విపలమైన ఈ విదేశి బావజాల అనుకూల శక్తులు అయన అధికారం లోకి రావడం వలన ఏర్పడిన పోభియా అది. ఎలాగైనా సరే మోడి గారి ప్రభంజనానికి అడ్డుకట్ట వేయక పోతే తమ మనుగడ కష్టమనే అభద్రతా బావం వలన ఈ  మేదావులు బయపడుతున్నట్లు ఉంది. అందుకే తమలోని అభద్రతా బావాన్ని, మైనర్టి ప్రజల అందరి అభద్రతా చిత్రీకరిస్తూ , లేని భయాలను వారిలో కల్పిస్తూ వారందరికి మోడి గారి ప్రభుత్వాన్ని భూతం లా చూపెడుతున్నారు. ఎలాగూ మైనార్తీ ప్రజలకు ఓట్లు ఉంటాయి కాబట్టి వాటి కోసమైనా  " సెక్యులర్ పార్టిలు " అని చెప్పుకుంటున్న వారు వారికి అండగా ఉండక తప్పదు. ఇలా తమ కు అండ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. "మోడి పోబియా "  బాదితులు . దానిలో బాగమే అవార్డుల వాపస్ లాంటివి. 

   మోడి గారు జన్మతః అగ్రవర్ణానికి చెందిన వ్యక్తీ కాదు. కాబట్టి అగ్రవర్ణాలను అడ్డం పెట్టుకుని , యావత్ హిందూ జీవన విదానం మీడ దాడి చేయాలి అనుకునే వారికి అయన కుల ప్రస్తావన తేలేని పరిస్తితి. అలాగే  నరేంద్ర మోడి గారు వారసత్వ రాజకీయల ద్వారా కాకుండా అంటే ఒకరికి కొడుకుగానో , భార్యగానో కాకుండా , స్వయంకృషితో ఎదిగి,  గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిగా రుజువు చేసుకున్నారు. జాతీయ రాజకీయలలో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తీ , ప్రదానమంత్రిగా బాద్యతలు చేపట్టి ,15 నెలల కాలం లొనే  ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు అంటె , అయన పరిపాలనా దక్షత ఏమిటొ అందరికి తెలిసిపోయి ఉందాలి . అందుకే అయన హయాం లో భారతదేశ అభివృద్ధి శర వేగంగా జరిగి రానున్న పదేళ్ళలో ప్రపంచశక్తిగా అగ్రగామిగా భారత్ ఉంటుందనే నమ్మక్కం మెజార్తీ ప్రజల లో కలిగించడం లో సపలిక్రుతం అవుతున్నారు. మనకు కావల్సింది ఆచరణకు పనికి రాని ఆదర్శాలు కాదు, ఉన్నంతలో పనికి వచ్చేమెరుగైన విదానాలు. వాటి ద్వారానే అభివృద్ధి సాద్యం అవుతుంది. అభివృద్ధి కోసమని మన జీవన విదానం లోని మంచిని త్యజించవలసిన పనిలేదు. అలాగే నేటి  సమాజ అవసారాలకు పనికి రాని పాత పద్దతులను అనుసరించాల్సిన అవసరం లేదు. పాత , కొత్తల మేలు కలయికతో నూతన భారత సమాజ నిర్మాణ లక్ష్యమే మోడి గారి సిద్దాంతం . అందుకు ఆయనకు సహకరించడం విజ్ఞులైన ప్రజల  బాద్యత. 

   ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే , విజ్ఞులైన ప్రజలు అధికశాతం ఉన్న సమాజాలలోనే అది సాద్యం. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన