"ఇప్పట్లో రాముడిలా ఉండటం కష్టం " అని పక్కింటికి పోయి పడి చనిపోయిన 'సినిమా హీరో '

                                                                       


ఈ  రోజు ఈ నాడు పేపర్లో ఒక దురదృష్టకర సంఘటన గురించి ప్రచురించారు . త్వరలో తెలుగుతెరకు పరిచయం కాబోతున్న "బాల ప్రశాంత్ " అనే వర్ధమాన హీరో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. ఆతను ఆత్మ హత్య చేసుకున్నట్లుగా పోలిసులు చెపుతున్న అసలు విషయం వివాహేతర సంబందమే అని ఈ నాడు వారు పూసగుచ్చినట్లు చెప్పేసారు . కాబట్టి దాని గురించి మల్లీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? క్రింది చిత్రం లోని సమాచారం చూడండి .
                                                                             


                                           
                                             పాపం ! ఎవరో ఒక నిర్మాతకి ప్రస్తుత పరిస్తితులకు తగ్గట్టు  మాంచి సినిమా తీసి  జనం మీదకు వదిలేదామని అనిపించినట్లుంది . అందుకే "ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండి బాబు " అనే ఇంత పొడుగు టైటిల్ తో సినిమా మొదలెట్టి 90% పూర్ర్తి చేసారంట. అందులో గుంతకల్ కి చెందిన బాల ప్రసాంత్ హీరో. వయస్సు 25 యేండ్లు కాబట్టి రాముడిలా ఉండటం కష్టం అనుకునట్లుంది ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆంటిని తనకు సహకరించమని  కోరినట్లు ఉంది. ఆమె గారికి కూడా "మొగుడు ఊరెళితే " అనే ఎపిసోడ్ లో నటించాలని తహ తహ గా ఉన్నట్లు ఉంది , హీరో గారి కోరికను తీర్చడానికి సమ్మతి తెలిపింది కామోసు.

  అలా వారిద్దరు తమ శక్తి వంచన లేకుండా "మొగుడు ఊరెళితే " ఎపిసోడ్ కోసం కష్టపడసాగారు. అలా ఆంటి గారి అయన గురువారం  ఊరెల్లడం చూసి , రాత్రి 10 గంటలకు ఆంటి గారి ఇంటికి వెళ్ళాడు కుర్ర హీరొ. అది చ్గూసి కడుపు మండిన వారెవరో ఆంటి గారి భర్తకు పోన్ చేయడం , అయన అది నిజమో కాదో తెలుసుకోమని తన బందువులను తన ఇంటికి పంపిస్తే , కంగారు పడిన అంటి ప్రియుడిని మంచం క్రిందకు నెట్టి, ఇంటికి వచ్చిన బందువుల ముందు తన పాతివ్రత్యం గురించి వీరడైలాగులు పలుకుతూ , సీన్ పండించడం కోసం , బ్లేడ్ తో చేతి మీద గాటులు పెట్టుకుంటే , బిత్తరపోయిన బందువులు ఆమె హస్పిటల్ కి తీసుకువెల్లారట. పాపం , మంచం క్రింద ఉన్న హీరోకి ముచ్చెమటలు పట్టి, ఇంట్లో నుంఛి బయటకు పోయే మార్గం తెలియక, పైపులు పట్టుకు దిగుతూ , అపార్ట్మెంట్ పై నుంది జారిపోయి , క్రిందపడి మరణించి ఉంటాడని కదనం. ఒక వేల ఎవరైనా చంపి పడేసినా , చెప్పే దిక్కే లేని దిక్కుమాలిన చావుకు గురయ్యాడు బాల ప్రశాంత్.

                       ఆ విదంగా రాముడిలా బ్రతకడం కష్టం అనుకుని "మొగుడు ఊరెళితే " అనే ఎపిసోడ్ లో ఇరుక్కుని , చివరకు దుర్మరణం పాలు అయిన వర్ధమాన హీరో ఉదంతం "రాముడిలా బ్రతకడం కష్టం " అనుకుని పక్క దారులు తొక్కే వారికి కాస్త కను విప్పు కలగచేయాలని ఆశిద్దాం. అలాగే బాలప్రశాంత్ ఆత్మకు శాంతిని , 90% సినిమా పూర్తి అయి , హీరో దుర్మరణం తో దిగాలుపడుతున్న నిర్మాతకు మనశాంతిని ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకుంటూ .......
Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.