అనవసరంగా రిజర్వేషన్ లు కెలికి , బొందలో పడిన B.J.P !!!

                                                                               



                                          బీహర్ ఎన్నికలు పలితాలు చూస్తే , RSS , శివసేన లోని కొంతమంది  మోడి గారి ప్రభంజనానికి  అడ్డుకట్ట వేయాలి అనే దురుద్దేశ్యం తో పని చేసినట్లు కనపడుతుంది. కాకుంటే ఏమిటి మరి చెప్పండి? కులకర్ణికి నల్లరంగు పూసిందేమో శివసేన కార్యకర్తలు . అదీ కూడా కులకర్ణి గారు సాక్షాత్తు శివసేన చీప్ తో సాయంత్రం గుస గుసలు  మాట్లాడాక  , తెల్లారే సరికి జరిగిన సంఘటణ. దానికి పూర్తి బాద్యత వహించాల్సింది శివసేన అంద్ కో మాత్రమే . కాని ఆ నల్ల రంగు ఏదో మోడి గారే దగ్గరుండి పూయించినట్లు నానా యాగీ చేసి దేశ వ్యాప్త నిరసనలకు నాంది పలికారు మహా కూటమి నాయకులు.అందువలన BJP కి బీహార్లో నష్టం జరిగింది.  ఇప్పుడు బీహార్లో మహాకూటమి గెలిచాక , నిన్న శివసేన అద్యక్షులు మాట్లాడుతూ , నితీష్ ఇంద్రుడు చంద్రుడు అని పొగడడమే కాక , బీహార్లో ఓటమికి మోడి యే పూర్తి బాద్యత వహించాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీని బట్టి చూస్తే శివసేన కు నితీష్ గారికి సత్సంబందాలే ఉన్నట్లు ఉంది. మరి ఈ సత్సంబందాలు ఏమన్నా బీహర్ ఎన్నికల్లో పనిచేసాయా అనే అనుమానం కలుగుతుంది.

   ఇకపోతే RSS వారి ఇంగితం తక్కువ పనులు. ఒకవైపు రిజర్వేషన్  వర్గాలు అధికంగా ఉన్న బీహార్లో ఎన్నికలు జరుగుతుంటే , తగుదునమ్మా అని ర్తెజర్వేషన్ లు పై సమీక్షలు జరపాలంటు కామెంట్ లు చేసి నోటి దూల ప్రదర్శించారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ  నాయకుడైనా , భారతదేశం లో రిజర్వేషన్లు గురించి వ్యతిరేకంగా మాట్లాడి తమ రాజకీయ ఉనికిని కాపాడుకోగలడా? లేదు అని డంఖా బజాయించి చెప్పాయి బీహర్ ఎన్నికలు. కొద్ది శాతం ఉన్న అగ్రవర్ణాల వర్ణాల వారిని ఆకర్షిదాం అనే  , తప్పుడు అంచనాలతో, అధిక ఓటింగ్ వర్గం మనసులో అనుమానం కలిగే లా కామెంట్లు చేసి BJ P  పార్టి పరాజయానికి  కారకులయ్యారు. మోడి అన్నా అయన పాలన అన్నా ఇష్టపడే రిజర్వేషన్ వర్గాల వారు కూడా ఈ విషయం లో ఇష్టం లేకపోయినా, రిజర్వేషన్లు పోతాయేమో అన్న ఒక రకం బయంతో  మోడిగారి  పార్టికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉండాలి. అందుకే గతం లో 100 లోపు ఉన్న సీట్లు ఇప్పుడు 60 లోపుకి కుడించబడ్డాయి. ఈ దెబ్బతో BJp ,RSS లోని రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా గలమెత్తే  వారికి "గొంతులో పచ్చి వెలక్కాయ " పడ్డట్లు అయింది. ఇక మళ్ళి  10 యేండ్ల దాక , భారత దేశం లో ఏ రాజకీయ పార్టి రిజరవేషన్లు గురించి ప్రస్తావించే సాహసం చేయక పోవచ్చు.

        ఏది ఏమైనా ఓట్లపరంగా బీహార్లో అతి పెద్ద పార్టి గా ఉంది  BJ P యే. మోడి గారు అంతిమ సభలో రిజర్వేషన్ లు గురించి క్లారిపై చేసినట్లు , మొదటి సభలోనే చేసి ఉంటె దాని పరిణామం  వేరుగా ఉండి మరో 10% ఓట్లు ఇటువైపు పది ఉండేవి . . ఇది ప్రజాస్వామ్య దేశం. అత్యదిక ప్రజల మనోబావాలు గమనించి మాట్లాడితే ఓట్లు పడతాయి కాని, అత్య్త్సాహం తో ముందు వెనుక కానక తిక్కల మాటలు మాట్లాడితే పరిణామం తిరోగమనమె . ఈ  విషయం BJP పెద్దలు గమనించి , RSS , శివసేన లోని అతి ఉత్సాహపరులను కంట్రోల్ చేస్తే మంచిది.

   బీహర్ ఎన్నికల్లో విజయం సాధించి ముక్యమంత్రిగా మూడవసారి పదవీ బాద్యతలు చేపడుతున్న నితీష్ గారికి శుభాకాంక్షలు.    
      రిజర్వేషన్లు మీద ఇంతకు ముందు నేను రాసిన పొస్ట్  కోసం క్లిక్ చేయండి 

రిజర్వేషన్ లు అంటే ఆగ్రహం వెలిబుచ్చే వారంతా "రెండో రకం మెదడు " వారేనా ??!! 


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం