ఇండియాలో మహాకూటమి గెలిస్తే , పాకిస్తాన్ నరకాసురుడు "దీపావళి " జరుపుకోవడం లో మతలబ్ ఏమిటి?
Namo -Lion |
పాకిస్తాన్! భారతదేశానికి పక్కా శత్రువు. మన దేశం లో ఏ ఉగ్రవాద చర్య జరిగిన దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఉంటాయి. మతమౌడ్యం తో ఉగ్రవాద తండాలకు ఆసరా ఇస్తూ నిరంతరం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వె పాకిస్తాన్ ని మిత్రదేశం అనుకోలేము. వేయి బజరంగీ బాయి సినిమాలు తీసినా అవి పైసలు వసూలు చేసుకోవడానికి పనికి వచ్చేవే తప్పా , పాకిస్తాన్ మనసులో ఇండియా పట్ల ఉండే ద్వేషాన్ని తగ్గించలేవు. ఐ మద్య కొందరు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఇండియాలో వారేదో పెద్ద సౌబ్రాతుత్వం ఉన్న వారిలా సోషల్ మీడియాలో పోజులు పెట్టారు. దేశమమ్టె మట్టి కాదోయి మనుషులోయి అన్నది ఒక నాటి మాట. దేశమంటె రాజకీయాలు , మీడియాయె అన్నది నేటి మాట. ప్రజల మనసుల్లో ఏమున్నా బయటకు చెప్పలేని వారి వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఈ నాడు ఒక దేశపు ప్రజావాణి అంటె ఆ దేశంలోని మీడియా చెపుతున్నాడే అని అర్దం కాబట్టి. "దేశమంటె మట్టి కాదోయి మీడియా యేనోయి " అని చెప్పుకోవలసిన అవసరం ఉంది.
బీహార్లో మహాకుటమి గెలిస్తే పాకిస్తాన్లో టపాసులు పేలుతాయి అని అమిత్ షా గారు అంటె ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. కాని అమిత్ షా గారు చెప్పింది నిజం చేసి చూపిస్తున్నారు పాకిస్తాన్ లోని ప్రజలూ మీడియా. అదే పాకిస్తాన్ లో ఏదైనా రాష్ట్రం లో ఎన్నికలు జరిగి ఎవరైనా గెలిచినా , ఓడినా మన దేశం లో టపాసులు కాల్చిన సందర్బాలు ఉన్నాయా ? మరి ఇక్కడ మహాకూటమి గెలిస్తే వాళ్ళకంత బులుపు ఎందుకు? ఇదేదో నితీష్ కుమారో , లాలూ ప్రసాదో, రాహుల్ గాందో గెలిచారని సంబడం కాదు వారికి. వీరు గెలిస్తే ఎంత? ఓడితే ఎంత? ఇక్కడ మోడి ఓడి పోయారు అనే, వారి సంబరం అంబరం ని అంటుతుంది. ఒక శత్రు దేశం మన దేశ ప్రదాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడి గారి పార్టి అది కూడా ఒక రాష్ట్రం లో ఓటమి పాలైతే , దానిని ఎంజాయి చేస్తున్నారు అంటె , మోడి గారు అంటె వారికి ఎంత బయమో ఇట్టె అర్దమవుతుంది. ఇన్నాళ్ళు వాయిస్ లేని నాయకులు పాలిస్తుంటె , కుక్క అరుపులు అరచే పాకిస్తాన్ కు ఇప్పుడు భారత దేశ సింహాసనం మీద "మోడి సింహం" ఉండటం వారికి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అది కప్పెట్టుకోవడానికే ఇక్కడి రాజకీయ పలితాలను అక్కడ ఎంజాయి చేస్కుంటున్నారు .
మరి ఆ గుంటనక్కల జిత్తులు సరే! మరి ఇక్కడి మహా కూటమి వారి బాద్యత ఏమిటి? N.D.A అయినా, మహాకుటమి అయినా ఇండియా లోని రాజకీయ పార్తీలు. ఒక వేల రేపు మహాకుటమి కేంద్రం లో అధికారం లోకి వస్తే పాకిస్తాన్ లో ఉన్న డాన్ దావూద్ ని ఇండియాకి అప్ప చెపుతారా? భారతదేశం మీద నిరంతరం కాల్పులు జరుపుతున్న సరిహద్దు దళాలు తన కవ్వింపు చేష్టలను మానుకుంటాయా? సందు దొరికితే మన దేశం లోకి ఉగ్రవాడులును పంపిం చాలీ అని చూసే పాకిస్తాన్ మిలటరి అది మానేసి అక్కడి ఉగ్రవాదులను మట్టుపెడుతుందా? నెవ్వర్? మరి అటువంటి పాకిస్తాన్ లోని మీడియా , కొంతమంది ప్రజలు మహాకుటమి గెలుపును సంబరాలు చేసుకుంటునట్లు ఉంటె దానిని ఖండించాల్సిన బాద్యత మహాకుటమి నాయకులకు లేదా? భారతదేశం లో జరిగే ఎన్నికలు తమ అంతర్గత విషయం అని , తమ గెలుపు ఓటములను శత్రు దేశం పండగ చేసుకోవలసిన అవసరం లేదని చాటి చెప్పాల్సిన అవసరం లేదా? ఒకవేళ లేదు అని మహాకుటమి బావిస్తే దానికన్నా చారిత్రిక తప్పిదం మరొకటి ఉండదు.
పాకిస్తాన్ లో జరిగే దీపావలి నరకాసురుడు చేసుకునే పండుగ లాంటిది. మోడి గారి ఓటమి పాకిస్తాన్ కు పండుగ లాంటిది అని అక్కడి వారు బావిస్తే , ఇక రానున్న దశాబ్దాల కాలం మోడి గారే మనకు నాయకుడు. పాకిస్తాన్ నక్కకు భారత్ సింహం లా కనిపిమ్చాలి అంటె గర్జించే మోడి గారి లాంటి వారే మనకు నాయకులు కావాలి తప్పా, వాయిస్ లేని నాయకులు, కలగూరగంప రాజకీయ పార్టీలు కావు. ఈ విషయాన్నీభారత ప్రజలు తొందరలోనే గ్రహిస్తారు. ఎవరెన్ని అనుకున్న " "సింహం సింహమే , నక్కలు నక్కలే " అని విజ్ఞులైన మన ప్రజలు గుర్తిస్తారు.
పాకిస్తాన్ లో మోడి గారి అపజయాన్ని దీపావలి చేసుకుంటున్న వైనం గురించి క్రింది వీడియోలో చుడండి.
మిత్రులకు , వీక్షకులకు, అగ్రిగ్రేటర్ లకు అందరికి దిపావళి శుభాకాంక్షలతో ........
Comments
Post a Comment