అమీర్ ఖాన్, భారతదేశ విషయం లోనే కాదు , భార్యల విషయం లోనూ పెద్ద "P .K " నే అంట !!!!?

                                                                                                                       అమీర్ ఖాన్ గారు హీరో గా నటించిన "P.K " సినిమా బాక్స్పాపిస్ బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్టు అయింది. అది అంతలా సక్సెస్ కావడానికి అమీర్ ఖాన్ నటన కంటె , మతవిశ్వాసాలను గాయపరచే సంఘటనలు ఉన్నా వాటిని స్పోర్టివ్ గా తీసుకున్నకోట్ల మంది  హిందూ ప్రజల సహన శీలత్వమే కారణమని చెప్పక తప్పదు.  ఇదే  అమీర్ ఖాన్ ,ముస్లిం కంట్రిస్ లో, వారి మత విశ్వాసాలను గాయపరచే సంఘటనలతో ఉన్న సినిమాలో నటించి ఉన్నట్లు అయితే ఈ  పాటికి  ఏమై  ఉండెవాడొ ?  అది తెలియబట్టె  అమీర్ ఖాన్ గారు  చాన్నాళ్ళ వరకు కొంతమంది  మేదావులు అనబడే వారు చేస్తున్న"అసహనం పెరేడ్ " లో పాల్గొనకుండా కామ్ గా ఉన్నట్లు ఉంది. కాని "అసహన వాదులు ఉర్కోరు కదా ! అందుకే ఆయన్ని కూడా ఇండియాలో అసహనం పెరిగిపోతుందని ఒక పబ్లిక్ స్తేట్మేంట్  ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఉంది . వారి బాద తట్టుకోలేక చివరకు తప్పు అంతా బార్య మీదకు నెడుతూ అటూ ఇటూ కాని వక వంకర మాట "నా భార్య , మా పిల్ల వాడి విషయం లో భయపడుతుంది , ఇండియా మనకు సేప్ కాదు వేరే  దేశానికి వెళ్లి పోదామా అని అడిగింది " అని   , భారతీయులలో అత్యధికుల చేత తిట్లు తింటున్నాడు. కాని తన మనసులో ఏముందో స్పష్టంగా చెప్పలేని అతని స్తేట్మెంట్ , అమీర్ ఖాన్ గారి మనస్తత్వం ని చక్కగా తెలియ చేస్తుంది.

                 PK  సినిమాలో అమీర్ ఖాన్ గారు పోషించిన "పర గ్రహ వాసి" పాత్ర నవ్వు తెప్పిస్తుంటుంది . ఆ పాత్ర చేసె పనులు , మాట్లాడే మాటలు ఇక్కడి జనాలకు అర్దం కాక "PK " హై క్యా అని అడుగుతుంటారు . అంటే "తాగి వచ్చావా "అని అర్దం. తాగినోడికి డోసు ఎక్కువ అయితే తనేమి వాగుతున్నాడో తనకీ తెలియదు , ఎదుటి వాడికి తెలియదు. అలా PK హై అనిపించుకున్న ఆ పాత్రలో నటించి కోట్ల మందిని ఎంటర్టైన్ చేసాడు. కాని ఒక బాద్యత కలిగిన ఇండియన్ సెలబ్రిటి గా ఆచి తూచి ,  ఎక్కడో ఒకటీ అరా , అదీ కూదా సెక్యులర్ వాదులు అని చెప్పొబడుతున్న నాయకుల పాలనలో ఉన్న రాష్ట్రాలలో జరిగిన పనులను ఇండియా మొత్తానికి ఆపాదించి, భారదేశమ్ లో అభద్రతా బావం పెరిగిపోయిందని, దానికి తన భార్య ఎంతో బయపడి పోతుందని, తన రెండవ భార్య కొడుకు స్వేచ్చ గా బ్రతికే పరిస్తితి లేదనే అర్ధం వచ్చేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు?

                                                                                 

                               
                                             అసలు అమీర్ ఖాన్ గారి మొదటి భార్య , రెండవ భార్య ఇద్దరు హిందువులే! మొదటి భార్య మీద ఆయనకి ప్రేమాభిమానాలు మెండుగా ఉన్నప్పటికి విడాకులు తీసుకున్నాడు. అదీ కూదా 16 యేండ్లు  కాపురం చేసి ఆమె ద్వారా ఇద్దరి బిడ్డలను పొంది మరీ విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చినప్పటికి ఆమెకు , అతనికి మద్య రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. అమీర్ ఖాన్ గారి ఇంట్లో జరిగే అన్ని పంక్షన్ లను మొదటి భార్య రీనా దత్తా వస్తూ , పోతూనే ఉందట. అదేమిటి మీరిద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారుగా అని ఎవరైనా అంటే "నా ఖర్మ బాగోలేక విడాకులు తీసుకున్నా " అని అంటున్నాడు అంట. మరి రెందవ వివాహం కూదా , విడాకులు అయిన 3 యేండ్లకు తీసుకున్నాడు. కాబట్టి రెండవ పెండ్లాం మీద మోజుతో మొదటి ఆమెకు విడాకులు ఇచ్చాడు అనటానికి వీలు లేదు. కాబట్టి విడాకులు ఎందుకు ఇచ్చాడో , తర్వాత ఎందుకు బాదపడుతున్నాడొ ఆయనకే తెలియని "PK " పరిస్తితి ఆయనది అని అర్దం అవుతుంది. 

                                      తన భర్తతో తన అనుబందం ఎలా దృడ పరచుకోవాలి అనే  విషయం లో , అమీర్ ఖాన్ గారి రెండవ భార్య కిరణ్ రావుకు క్లారిటీ బాగానే ఉన్నట్లు ఉంది . అందుకే దేశం లోని కొంత మంది మోడి గారి వ్యతిరేకులు "అసహనం " "అసహనం " అని గోల చేస్తుంటే , కిరణ్ రావు గారు ఆ గోల ని తన సంసార బందం గట్టి చేసుకోవడానికి ఉపయోగించాలి అని అనుకుని ఉంతుంది. ఎందు కంటే మొదటి భార్య తో విడాకులు తీసుకున్నా , ఇంకా ఆమెనే పట్టుకుని ఊగులాడుతు , తన విడాకులు తీసుకోవడం ని ఖర్మ గా బావిస్తున్న భర్తను చూస్తే , ఆమె లో రోజు రోజుకూ అభద్రతా బావం ఎక్కువై పోతున్నట్లు ఉంది. మొదటి భార్య ద్వారా పొందిన సంతానం చేతికి అంది వచ్చారు. వారి మీద మమకారం తో అయినా రేపు మొదటి భార్యకు,  ఆమె పిల్లలకే అంకితమైతే తన పరిస్తితి ఏమిటి? ఎన్నో  అబార్షన్ లు అయ్యాక లేక లేక ఒక్కడు పుట్టాడు తనకి? రేపు తమ ఇద్దరినీ నెగ్లెట్ చేసి , మొదటి భార్యతోనే ఉండిపోతే? అలాంటి అభద్రతా బావం ఎక్కువ అవ్వడం వలననే , భర్తని తీసుకుని విదేశాలకు వెల్లిపోవాలి అనే ఆలోచనకు వచ్చి ఉండాలి.అలా వెళిపోతే మొదటి భార్యతో కాంటాక్ట్ ఉండదు . తనకు మాత్రమే అతని శేష జీవితం అంకితమ్. లేకుంటే తన కు తిప్పలే అనుకున్న ఆమె , తనలో ఉన్న అభద్రతా బావం ని దేశం లో ఉన్న అభద్రతా బావం గా చూపి , తెలివిగా విదేశాలకు వెల్లిపోదాం అని కోరితే , దానికి PK అమీర్ ఖాన్ గారు , అసలు సంగతి తెలియక మీడియా ముందు మాట్లాడి అభాసు పాలు అయ్యాడు. రాజకీయ పార్తీలను విమర్శిస్తే Ok  అంటారేమో కాని, భారతదేశాన్ని విమర్శిస్తే మాత్రం P.K  అంటారని గ్రహించలేని పెద్ద PK, Mr.అమీర్ ఖాన్ .   

    ఆ విదంగా అమీర్ ఖాన్ గారు , భారతదేశ విషయం లోనే కాదు , భార్యల విషయం లోనూ పెద్ద "P .K " నే అని రుజువు చేసుకున్నారు .

      

Comments

 1. మీరు పీకే సినిమా చూసారాండీ? అందులో ఇస్లాం క్రైస్తవ మతాలను కూడా వదిలిపెట్టలేదు.

  ReplyDelete
  Replies
  1. వేరే పనుల్లొ బిజిగా ఉండటం వలన మీ వ్యాఖ్యకు సకాలం లొ పబ్లిష్ చేయనందుకు క్షమించగలరు. మీరు అన్నట్లు PK సినిమాలో అన్ని మతాల విదానాలను విమర్సించడమ్ జరిగింది. కాని ఆ సినిమా ముక్య ఉద్దేస్యం హిందూ మతవిదానాలను టార్గెట్ చేయదమే . మిగతా మతాలను విమర్సీంచడమ్ అనేది వారు అన్ని మతాలను సమద్రుష్టితో చూసారు అని పించుకోవడానికో లేక సెన్సార్ వారి నుండి ఇబ్బందులు కలుగ కుండా చూడటానికో అయుంటుంది.

   ఉదాహరణకు భారతదేశం లో ఉన్న మత విదానాల్లో "విగ్రహారాదన" ప్రదానమైంది. ఈ ద్రుష్టితో చూస్తే దర్గాలకు వెళ్ళి విగ్రహారాదన చేసే ముస్లిం లు ఇండియన్ మత విదానాలను పాటించే ముస్లిం లు అయితే, తతిమ్మా వారు విదేసి మత విదానాలు పాటించే వారు అని చెప్పవచ్చు. సినిమాలో ముక్యంగా విమర్శించింది ఇండియన్ మత విదానాలను పాటించే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లను తప్పా, విదేసి విదానాలు పాతించే వారిని కాదని మనం అర్దం చేసుకుంటె pk సినిమా ప్రమోట్ చేసిన వారి నిజస్వరూపం అర్దం అవుతుంది. స్వదేశి, విదేసి మతాలు అనేది కొలిచే దేవుళ్ళను బట్టి కాక, కొలుస్తున్న విదానాలు బట్టి అంచనా వేయాలి అనెది నా అభిప్రాయం.

   మీ స్పందనకు దన్యవాదాలు.

   Delete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )