"కిస్ అప్ లవ్ " ఉద్యమం తో తో పేరు గాంచి, విటులను ఆకర్షిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ' రేష్మి నాయర్ దంపతులు'!

                                                                         

                             
                                          రాహుల్ పసుపులన్ , రేష్మి నాయర్ అనే వారు భార్యాభర్తలు. వీరిలో పసుపులన్ చలనచిత్ర రంగం లో పనిచేస్తుంటె రేష్మి నాయర్ మోడల్ గా ఉంటుంది. వీరివురూ గత సంవత్సరం, మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా  జరిగిన "కిస్ అప్ లవ్ " అనే సంచలన ఉద్యమం లో పాల్గొని ప్రఖ్యాతి గాంచారు. అసలు కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకుల్లో వీరు ముఖ్యులు అట. ఏ ఉద్యమం వెనుకాల అయినా స్వలాభాపరులు కొంతమంది ఉంటారు. కాని జన బాహుళ్యం క్షేమాన్ని కోరుకునే ఉద్యమాలలో అటువంటి స్వలాబపరుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు. కాని అసలు ఉద్యమమే నీతిబాహ్యమైనది అయితే , అటువంటి ఉద్యమాల వల్ల   నిర్వాహకులకు లాబం , సమాజానికి నష్టం అని నిరూపించారు, కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకులు అయిన పసుపులన్  దంపతులు.

                          మొన్న మంగళ వారం  కిస్ అప్ లవ్ ఉద్యమానికి ప్రసిద్ది చెందిన కేరళలోని కోచి నగరం లో పోలిసులు , ఆన్లైన్  విదానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న 6 నిర్వాహకులను అరెస్ట్ చేసారు. అలా అరెస్ట్ చేయబడిన వారిలో , గత సంవత్సరం కిస్ అప్ లవ్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన , రాహుల్ పసుపులన్ , రేష్మి నాయర్ దంపతులు కూదా ఉండటం తో ప్రజలు నివ్వెరపోయారు అట. ఇదేదో ఆషామాషి గా చేసిన అరెస్టులు కావు. పక్కా ప్రణాలికతో , రెడ్ హండెండ్ గా పట్టుకున్నారు అట. అదెలా జరిగింది అంటె :

                      నలుగురు పోలిసులు విటుల అవతారమెత్తి , కోచి విమానాశ్రయం దగ్గరలో ఉన్న లాడ్జిలో దిగారు అట. వారు ఒక అమ్మాయిల బ్రోకర్ అడ్రెస్స్ కనుకున్ని అతణ్ణి కాంటాక్ట్ చేస్తే , అతడు   రేష్మి నాయర్ పొటోలు చూపించి ఆమె   కాంటాక్ట్ చేస్తుందని  చెప్పాడు .విటుల వేషం లో ఉన్న పోలీసులు వద్దకు ఆ సాయంత్రం రేష్మి నాయర్ తన 6 ఏండ్ల కొడుకుతో కలిసి లాడ్జికి వచ్చింది. వారితో సంప్రదింపులు జరిపి వారికి బెంగలూర్ కు చెందిన , అక్కా చెల్లెళ్ళు అయిన మైనర్ బాలికలను కుదిర్చి పెట్టింది. సదరు బాలికలు రాగానే , పోలిసులు తమ అసలు రూపాలు దరించి , రూపా నాయర్ ని , వెబ్సైట్ ద్వారా విటులను ఆకర్షిస్తూ ఆమెకు సహాయం చేస్తున్న ఆమె భర్తను అరెస్ట్ చేసి రేమాండ్ కు తరలించారు. మొత్తం 6 గురిని అరెస్ట్ చేసారు ఈ  కేసులో. 


                    గత సంవత్సరం కోచి లో జరిగిన "ముద్దుల ప్రేమ " ఉద్యమం ను నిర్వహించిన వీరు , ఆన్లైన్ వ్యభిచారం నిర్వాహకులుగా పట్టుబడటం తో వీరి ఉద్యమ స్వబావం ఏమిటొ అర్దం అవుతుంది. కేవలం తమ వ్యభిచార వ్యాపార పబ్లిసిటి కోసమే , "కిస్ అప్ లవ్" అనే ఉద్యమం నిర్వహించినట్లు తేటతెల్లం అవుతుంది. మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకం అనే పేరుతో యువతను, విద్యార్దులను రెచ్ గొట్టి, వారిని బహిరంగ ప్రదేశం లో ముద్దులు పెట్టుకునేలా ప్రోత్సాహిస్తూ వీరు నడిపిన ఉద్యమం చాలామందిలో అసహ్యం కలిగించింది. దీని వలన వారికి బోల్డంతా మీడియా పబ్లిసిటి వచ్చి, విటులకు వీరి గురించి క్రేజ్ ఏర్పడి ఉండాలి. దాని ఆసరాగా చేసుకుని వీరు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లింపచేసుకుంటున్నారు. అంటే వీరి పిలుపుకు స్పందించి "కిస్ అప్ లవ్" ఉద్యమం  లో పాల్గొన్నవారు, ప్రోతస్సాహించిన వారు అందరూ పరోక్షంగా వీరి వ్యాపారాభివ్రుద్దికి తోడ్పడిన వారేనన్నమాట. !

     గత సంవత్సరం "కిస్ అప్ లవ్" కి వ్యతిరేకంగా నేను రాసిన 

ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!

  ని క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి  



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!