సీటు కోసం సర్దుకుపోదామని మామ రాజయ్యగారు అనుకుంటే, చచ్చిపోయి సాదిద్దామని కోడలు అనుకున్నట్లుంది ?!!!


                                                                               

                             
                                      నిన్న తెల్లవారు జామున తెలంగాణా రాష్ట్రం లోని వరంగల్ నగరం లో , మాజీ M.P రాజయ్యగారి ఇంట్లో జరిగిన ఘోర ఉదంతం అందరిని నివ్వెరపరచింది. రాజ్య గారి కోడలు తన ముగ్గురు పిల్లలతో సహా సజీవదహనం కావడం , అది గాంచిన రాజయ్య బోరు బోరున విలపిస్తూ ఉండడం చూచిన వారెవరికైనా మనసు చలించక తప్పదు. రాజయ్య గారి కోడలు సారికకు  , కొడుకు అనిల్ కు మద్య సక్యత లేకపోవడం, అనిల్ రెండొ వివాహం చేసుకుని తన జీవితం తానూ గడుపుతూ ఉండడం, గతం లో సారిక భర్త మీద , అత్తా మామల మీద గృహ హింస కేసులు పెట్టి అవి ఇప్పటికి పెండింగ్ లో ఉండడం వలన , రాజయ్య గారి  కుటుంబ సభ్యులకు , కోడలు సారికకు పడడం లేదని అర్దం అవుతుంది. ఈ పరిస్తితుల్లో సారిక , తన ముగ్గురు పిల్లలుతో సహా సజీవ దహనం అయితే , ఆమెను కన్నవారికి , తోడపుట్టిన వారికి ,రాజయ్య గారి కుటుంబం మీద అంతులేని కోపం కలగడం సహజం. అందుకే తమ కూతురిని రాజయ్య గారి కుటుంబ సభ్యులే చంపారని ఆరోపణలు చెయ్యడం కూడా సహజమే.

    కాని కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు, సజీవ దహనం లో సారిక తో పాటు, రాజయ్య గారి చిన్నారి   మనుమలు 3 ఆహుతి కావడం, రాజయ్య గారు గత 3 రోజుల క్రితమే కోడలు ఉంటున్న నివాసం కే తన కొడుకు తో సహా వచ్చి ఉండటం చూస్తుంటే , ఈ  ఘోరం లో అయన గాని, అయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని చెప్పలేము. సారికను చంపాలి అనుకునే వారు కోరి మరి వచ్చి , ఆమె తో ఉండి చంపి కేసులో ఇరుక్కుంటారా? అయితే అప్పటి దాక విడిగా ఉంటున్న  వారు ఎందుకు వచ్చి ఆమె తో కలసి ఉన్నారు అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. దానికి ఒక కారణం ఉంది. 

                                   రాజయ్య  గారు వరంగల్ MP  సీటుకు కాంగ్రెస్ తరపున అభ్యర్దిగా ఖరారు అయ్యారు. అయితే వారం రోజుల క్రితం , అయన కోడలు సారిక , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి గారికి ఒక లేఖ రాసిందట. అందులో తన మామకు టికెట్ ఇవ్వవద్దని ,కొడుక్కే చెప్పి కుటుంబాన్ని సరి దిద్దలేని వాడు , సమాజాన్ని ఏమి ఉద్దరిస్తాడు అని , ఆ లేఖలో రాసిందట. రాజయ్య  గారిని ఈ  విషయం  గురించి సోనియాగాంది గారు ప్రశ్నించారు అట. దానికి రాజయ్య గారు ఈ విషయం లో కోడలితో సర్దుబాటు చేసుకుని , ఆమె నుండి ఏ గొడవా రాకుండా చూసుకునే బాద్యత తనది అని, హామి ఇచ్చి టికెట్ ఖరారు చేసుకునారు అట. అందువలన కోడలికి దూరంగ ఉంటె తన రాజకీయ కెరీర్ కే నష్టమని బావించి , కొడుకును కూడా వెంటపెట్టుకుని కోడలు ఉంటున్న బంగలాకే తన నివాసం మార్చినట్లుంది. కోడలి ముందే కొడుకును మందలించడం వలన ఆ రాత్రి రాజయ్య గారికి, అయన కొడుకుకు గొడవ జరిగి ఉండాలి. 

                         అయితే తన రాజకీయ ప్రయోజనం కోసం కోడలితో సఖ్యత పడటానికి , కొడుకుని కోడలును కలపడానికి ప్రయత్నించడం చూసిన సారిక మనసులో ఒక్క సారిగా రాజయ్య గారి మీద అంతులేని ఆవేశం తో కూడిన ఆగ్రహం వచ్చి ఉండాలి. ఇన్నాళ్ళు ఎంతో అవేదన అనుభవిస్తున్న పట్టించుకోని వారు, ఈ  రోజు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన వద్దకు రావడాన్ని అసహ్యించుకున్న ఆమె , రాజయ్య గారి రాజకీయ ప్రయోజనాలను చావు దెబ్బ తీయాలని, తను బ్రతికిఉండి ఆయనకు టికెట్ రాకుండా చేయలేక పోయినా ,చచ్చి అయినా సరే అయన కెరీర్ ను దెబ్బ తీయాలని బావించినట్లు ఉంది. తను ఒక్కతే చనిపోతే , తన అత్తా గారి కుటుంబం బాదపడదు అని బావించిన ఆమె తనతో పాటు తన పిల్లలను వారికి దక్కకుండా చేయాలని బావించే ఈ ఘోరానికి ఒడిగట్టి ఉండవచ్చు. గతం లో ఆమె చేసిన ఆత్మ హత్యా ప్రయత్నాలు కూడా దీనినే బలపరుస్తున్నాయి. 

                              రాజయ్య గారు ఎంత రాజకీయ జీవి అయినా , ఆయన ప్రేమానురాగాలకు అతీతుడు కాదు. కొడుకుని మందలించలేక పోవడానికి అతడి మీద ఉన్న గుడ్డి ప్రేమ కారణం కావచ్చు. అలాగే కోడలిని విడాకులు ఇచ్చి వదులుకో లేకపోవడానికి  ఆమె ద్వారా తన కుటుంబానికి లభించిన వారసులు 3 మనుమలు ఉండడం. తమకు కోడలి అవసరం లేక పోయినా , తన మనుమలు కు తల్లి అవసరం. రాజయ్య గారికి మనుమలు అంటె అంతులేని ప్రేమ కావచ్చు. అందుకే కోడలు సజీవ దహనం అయ్యిందన్న వార్త కంటె , ముక్కుపచ్చ లారని తన వారసులు 3 గురు చనిపోయారన్న వార్తా ఆయన్ని కుప్ప కూలేలా చేసింది. అందుకే అయన చిన్న పిల్లాడిలా రోదించారు. దీనిని బట్టి చూస్తే సారిక చచ్చి తన మామని సాదించింది అని చెప్పవచ్చు. అలాగే రాజయ్య గారి కుటుంబం కి పిల్లలని సజీవ దహనం చేసే అంత రాక్షస మనస్తత్వం ఉండంటె నమ్మడం కష్టమే. అది తమ రాజకీయ కెరీర్ ను దెబ్బ తీస్తుంది కాబట్టి, రాజయ్య గారిలోని రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పనికి అంగీకరించడు. 

     కాబట్టి  . MP సీటు కోసం సర్దుకుపోదామని మామగారు అయిన రాజయ్య గారు  అనుకుంటే, చచ్చిపోయి సాదిద్దామని కోడలుసారిక గారు  అనుకున్నట్లుంది . మరి పోలిస్ వారి విచారణలో ఏమి తేలుతుందొ చూదాం.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం