పెళ్ళాం మాట పట్టించుకోని "అమీర్ ఖాన్ ది గ్రేట్ ".!!!

                                                                                                                                         "గత 6 , 8 నెలలుగా  ఇండియాలో అసహనం  ఎక్కువ అవుతుంది " అని సెలవిచ్చారు ది గ్రేట్ హిందీ యాక్టర్ అమీర్ ఖాన్ గారు. నిజమే మరి! మోడి గారి ప్రబంజనం దేశ విదేశాల్లో హల్చల్ చేస్తుంటే , ఆయనన్నా అయన ప్రభుత్వం అన్నా గిట్టని వారికి "అసహనం " ఎక్కువ అవుతుండడం లో విచిత్రమేమి లేదు. కాకపోతే అది ప్రదర్శించడానికి వారికొక "బూచి " కావాలి . అలాంటి బూచి పాత్రకు RSS  లోని కొంతమంది నోటి తీటగాల్లను ఎన్నుకుని , వారు మాట్లాడే మాటలకు విపరీత పబ్లిసిటి కల్పిస్తూ , మోడి గారు అంటె పడని మేధావులను కలసి వారి వారి అవార్డులను వెనక్కి ఇచ్చేస్తునట్లు ప్రకటనలు చేయిస్తూ తమలోని అసహనాన్ని ప్రదర్శించారు "అసహన వాదులు" . అందులో బాగంగానే ఇప్పుడు అమీర్ఖాన్ గారి చేత పై ప్రకటన చేయించి ఉంటారు.

                                   ఈ సందర్బంగా అమీర్ ఖాన్ బాయి ఒక మాట అన్నారు. " నా భార్య కిరణ్ రావు , ఇండియాలో పెరిగిపోతున్న అసహనం గురించి,  ఎక్కువుగా బయపడుతుంది , ఇండియాను వదిలి విదేశాలకు వెళదామని అంటుంది " అని సన్నాయి నొక్కులు నొక్కాడు. కాని ఇంతకు తను ఏమనుకున్నది చెప్పలేదు . మరి ఇంతకాలం తనను ఆదరించిన ఇండియా లోని హిందూ ప్రజల మనోబావాలు గురించి అమీర్ఖాన్ గారికి తెలిసినంతగా , హిందూ రాజ  కుటుంబంలో పుట్టిన అయన భార్య గారికి తెలియక పోవచ్చు . ఎందుకంటే ఆమె గారికి "దేవుడు " అంటే నమ్మకం లేదు. మరి దేవుడు అంటె నమ్మకం లేని వ్యక్తికీ "దేవతల గడ్డ " అయిన భారత భూమిలో ఎలా ఉండాలి అనిపిస్తుంది?  అందుకే ఎదో వక వంకతో మొగుణ్ణి విదేశాలకు తీసుకు వెళ్లి అక్కడే ఉండిపోవాలని ఉబలాటం కాబోలు. అలా ఆమెకు కూడా కలిసి వచ్చింది. అందుకే మోడి గారి వ్యతిరేకులు అందరూ "అసహనం " పేరుతో అవార్డులు వెనక్కి ఇస్తుంటే , దైవానికి వ్యతిరేకి అయిన కిరణ్ రావు గారు ఏకంగా ఇండియానే వదిలేదామని డిసైడ్ అయి , ఆ ముక్క మొగుడి చెవిలో వేసినట్లు ఉంది. 

               మరి అమీర్ ఖాన్ గారు తన భార్య గారి మాటను పట్టించుకోక పోతే ఎలా చెప్పండి? తనకి ఇష్టం ఉన్నా లేక పోయినా భార్య చెప్పితే  వినాలి కదా? లేకపోతే కిరణ్ రావు గారిలో అసహనం ఏర్పడి , అది రాను రాను ఎక్కువ అయి ఆమే గారు కూడా తన "బేగం(భార్య ) అవార్డు " ను వెన్నక్కి ఇచ్చే ప్రమాదముంది . కాబట్టి జాగ్రత్త పడండి అమీర్ ఖాన్ గారు!.
            ఇండియాలో  అసహనవాదులు గురించి ఇంతకు ముందు నేను రాసిన

"మోడి పోభియా" తో బాదపడుతున్న మేదావుల సృష్టి పేరే అసహనం !!

   చూడండి 

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.