మాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! (1)

                                                                         
                                                               
                                   మనందరికి ఒక శుభవార్త! ఏమిటంటే రెపు అక్టోబర్ 1 వ తారీకు నుండి 19 వ తారీకు వరకు 11 వ జీవ వైవిద్య సదస్సు జరగనుంది. ఎక్కడో తెలుసా ?సాక్షాత్తు మన రాజధాని నగరమైన హైదరాబాదులో. ఒక ప్రపంచ స్తాయి సదస్సు మన రాజధాని లో జరగటం మనకు శుభవార్తే కదా!. ఇంతకి జీవ వైవిద్య సదస్సు అంటే క్లుప్తంగా తెలుసుకుందాము.
                      
460 కోట్ల సంవత్సరాలు! ఇది భూమి వయసు!
భూమిని ఒక మహిళతో పోలుద్దాం!… ప్రతి 10 కోట్ల సంవత్సరాలను ఒక సంవత్సరంగా లెక్కిద్దాం! అంటే… భూమి అనే మహిళ వయసు ఇప్పుడు 46 ఏళ్లు.
భూమి పుట్టి కళ్లు తెరిచిన తొలి ఏడేళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు! అది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం!
ఆ తర్వాత మరో 35 సంవత్సరాలపాటు భూమి జీవితంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నకు అస్పష్టమైన సమాధానాలు మాత్రమే లభించాయి.
భూమి 42 ఏళ్ల వయసులో… తొలి పుష్పం వికసించింది.
44 సంవత్సరాల వయసులో… రాక్షస బల్లులలాంటి భారీ సరీసృపాలు నడయాడాయి.
జస్ట్… ఓ ఎనిమిది నెలల కిందటే భూమిపై క్షీరదాలు నడక ప్రారంభించాయి.
పోయిన వారమే ఏప్ (తోకలేని కోతి) నుంచి మనిషి ఆవిర్భావ ప్రక్రియ మొదలైంది.
4 గంటల క్రితం.. ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు.
సరిగ్గా గంట క్రితం… మనిషి వ్యవసాయం కనిపెట్టాడు.
ఒకే ఒక్క నిమిషం కిందట.. పారిశ్రామిక విప్లవం, వెంటనే పొగలు, సెగలతో భూమి వేడెక్కడమూ మొదలైంది.
ఈ ఒకే ఒక్క నిమిషంలో అందాలకు నిలయమైన ఈ భూమి ఓ చెత్తబుట్టలా తయారైంది. మనిషి అవసరాలు మాత్రమే తీర్చే వనరులా మారింది. భూమి… ఇప్పుడు అలసిపోయింది. ఆయాసపడుతోంది.
460 కోట్ల సంవత్సరాల వయసున్న భూమికి… గత 206 ఏళ్ల నుంచే పెను ముప్పు వచ్చి పడింది. ‘అందరూ బాగుండాలి’ అనే సిద్ధాంతం నడిచినన్ని రోజులు భూమి బాగానే ఉంది. ‘నేను మాత్రమే బాగుండాలి’ అని మనిషి అనుకోవడం మొదలుపెట్టిన తర్వాతే సమస్య మొదలైంది.

మానవుడు అంతరిక్షంలో దూసుకుపోతున్నాడు. టివి, కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌, ఐ ఫోన్‌, ఇంటర్‌నెట్‌ ఇలా ఎంతో అభివృద్ధి సాధించాడు. తన స్వార్థం కోసం పాకులాడుతూ జీవ వైవిధ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. అడవులను ఇష్టానుసారంగా నరికి వేశాడు. క్రూర మృగాలను వేటాడి చంపాడు. సముద్రాలను కలుషితం చేసి జలరాశు ల నాశనానికి కారకుడయ్యాడు. పంటలకు క్రిమి సంహారక మందులు వాడి ప్రయోజకరమైన కీటకాలు, జంతువులు, క్రూర మృగాల నాశనానికి పూనుకున్నాడు. దీంతో సమతుల్యం దెబ్బతిని కొత్త, కొత్త రోగాలు, సునామీ లాంటి ప్రళయాలు సంభవిస్తున్నాయి. జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఆయుష్షూ తగ్గిపోయింది. మనుగడకే ప్రమాదం ముంచుకొస్తోంది. ప్రమాదపుటంచులో తిరిగి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలన్న జ్ఞానం కలిగింది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్యంపై శ్రద్ధ చూపడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. కొంత మేరకైనా తనవంతు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగమే నగరంలో అక్టోబర్‌ ఒకటి నుంచి జరగనున్న జీవ వైవిధ్య సదస్సు.
ప్రకృతిలో మనిషితో పాటు వన్యప్రాణులు, భూ, జల చరరాసులు, కీటకాలు, వృక్ష సంపద ఇలా అన్ని సమతుల్యంగా ఉంటేనే మానవులు జీవించగలరు.

లేదంటే రోగాలు, ప్రకృతి వైపరీత్యాలతో కొద్ది కాలానికే మానవులు కూడా అంతరించిపోయే ప్రమాదముంది. ఒకప్పుడు చైనా రాజు పిచ్చుకలను లేకుండా చేయాలని ఆదేశించారంట. ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారట. ప్రజలందరూ పిచ్చుకలను ఏరిపారేశారు. దీంతో పురుగులు, మిడతలు విపరీతంగా పెరిగిపోయి. పంట మొలకలను తినేశాయి. అంతే చైనాలో విపరితమైన కరువు కాటకాలొచ్చాయి. వేలాది మంది ప్రజలు చనిపోయారు. తన తప్పు తెలుసుకున్న చైనా రాజు తిరిగి పిచ్చుకలను పెంచారట. వాటి వృద్ధికి చర్యలు తీసుకున్నారంట. వన్య ప్రాణులనే పరిశీలిస్తే భూమిని సారవంతం చేయడంలో ముళ్ల పంది, అడవి పంది, ఎలుకలు, కుందేళు ్ల, ఎలుగు బంట్లు తదితర జంతువులు చేసే కృషి అసమాన్యమైనది. ఆయా జంతువులు ఆహార అన్వేషణలో భాగంగా నేల కింద ఉండే వివిధ రకాల దుంపలను ఆహారంగా తీసుకునేందుకు నేలను తవ్వుతాయి. నేల మొత్తం ఈ విధంగా దున్నడంతో గాలి మట్టిలో చేరి సారవంతమౌతుంది. ఈ వన్య ప్రాణులు విసర్జించిన వ్యర్థాలతో ఆ మట్టి మొత్తం సారవంతంగా మారి ఎరువుగా తయారౌతుంది. ఏ చిన్న మొక్క గింజ ఈ ప్రదేశంలో పడ్డా నీరు తగిలిన వెంటనే మొలకెత్తి, పెరిగి మహా వృక్షం అవుతుంది. పండ్లను, గింజలను ఆహారంగా ఈ వన్య ప్రాణులు తీసుకుంటాయి. గట్టి తనాన్ని కలిగిన గింజలు అరగకుండా మల విసర్జనలో బయట పడి చెట్లను వృద్ధి చేస్తాయి. ఈ విధంగా అడవుల్లో చెట్లను, గడ్డిని పెంచుతూ వన్య ప్రాణులు పచ్చదనానికి దోహదపడతాయి. అడవులు సమృద్ధిగా ఉంటే మానవ జీవితం సుఖవంతంగా ఉంటుంది. తుఫానులు, వరదలు, కరువు కాటకాలు, ఆహారపు కొరత తదితర సమస్యలు ఉత్పన్నం కావు.

మనిషికి తెలియకుండా ఇంతటి మహత్తరమైన కార్యాన్ని ఈ వన్య ప్రాణులు నిర్వహిస్తూ పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచుతూ మనుషులకు జీవ వైవిధ్యాన్ని అందిస్తున్నాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న వన్యప్రాణులు అంతరించిపోతుండడం ఆందోళనకరం. నేడు ఎన్నో పక్షులు, జంతువులు అంతరించి పోతున్నాయి. రాబందులు, కలిమి కోడి, సాలె పురుగు, నత్తలు, మిణుగురు పురుగులు, ఆలివ్‌ రిడ్లే తాబేళు ్ల, తోడేళు ్ల, నెమళు ్ల, కప్పలు, ఊర పిచ్చుకలు, పులులు ఇలా చెబుతూ పోతే పలు రకాల జంతువులు, పక్షులు, కీటకాలు రోజురోజుకు అంతరించి పోతున్నాయి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. వాటిని కాపాడాలంటే వాటి సహజసిద్ధ జీవనానికి ఆటంకం రాకుండా ఇప్పటికైనా జాగ్రత్త వహించాలి.అందుకే ఈ జీవ వైవిద్య సదస్సులు. .
.  ఈ 11 వ జీవ వైవిద్య సదస్సు లక్ష్యాలు                                                                                                          (1). అందరికీ అందుబాటులో వైవిధ్యం…
(2).  పేదరిక నిర్మూలనకు జీవ వైవిధ్యం
(3).  జీవ వైవిధ్యాన్ని సాధించడం ఎలా?
(4).  నగరాల నుంచి దేశ ప్రభుత్వాల వరకు అనుసరించాల్సిన ప్రణాళికల రూపకల్పన
(5)  జీవ వైవిధ్య అభివృద్ధికి పరస్పర సహకారం
(6).  సంప్రదాయ పరిజ్ఞానాన్ని సంరక్షించుకునేందుకు చట్టబద్ధ వ్యవస్థ
(7).  సాంస్కృతిక, స్వదేశీ, స్థానిక ప్రజల ప్రతిభా వారసత్వాల రక్షణకు నైతిక నియమావళి ఏర్పాటు
(8).  పంటలు, మొక్కల సంరక్షణపై అంతర్జాతీయ స్థాయి ప్రణాళిక.
              పై లక్ష్యాలలో 7 వది అయిన   లో స్తానిక  ప్రజల యొక్క సాంస్క్రుతిక వారసత్వాలలో కట్టు,బొట్టు(వస్తదారణ),బాష కూడ చేరుతాయి.ఆ విదంగా చూసినపుడు మన తెలుగు జాతిలో అంతర్దానమవుతున్నది ముఖ్యమైనది ఒకటి ఉన్నది. అదే మన "తెలుగు అమ్మాయి". ఈ విషయాన్ని గురించి  తరవాతి  టపాలో(మాయమై పోతున్న  తెలుగు అమ్మాయిని  రక్షించండి! (2)) లో వివరిస్తాను. అంత వరకు ఓపిక ఫట్టండి.(సశేషం)  
                                                                       



మాయమై పోతున్న తెలుగు అమ్మాయి 2 వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
                                                            

Comments

  1. "మాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి!"

    బాగుంది కానీ. ఏనాడో వెర్రెక్కిపోయిన తెలుగబ్బాయిని ఏమి చేద్దాం. గొట్టాం పాంట్లు, బోద కాలు పాంట్లు, ఇప్పుడు 40 జేబుల టార్పాలిన్ నేలకు జీరాడే చిరుగు పాంట్లు, ఇదేనా తెలుగబ్బాయి. అదీ వ్రాయండి మాష్టారూ.

    నా దృష్టిలో తెలుగబ్బాయి దాదాపుగా 1940లో మొదలెట్టి 1970లొచ్చేప్పటికి పూర్తి యూరోపియన్ వేషధారణ ను అనుకరించటం కాదు ఏప్ చెయ్యటం (కోతిలాగ అనుకరించటం అన్నమాట) మొదలు పెట్టాడు. మగాళ్ళు మాత్రం మా ఇష్టం వచ్చిన డ్రస్సులు వేసుకుంటాం, అమ్మాయిలు మాత్రం ఇలా ఉండండి అంటే జరిగే పనేనా!

    ReplyDelete
  2. మీ స్పందనకు మొదటగ దన్యవాదములు తెలుపుతున్నాను శివరామ ప్రసాదు గారు. పోతే మనం కోర్టులలో కొన్ని కేస్లు చూస్తుంటాము. విచారణ అర్హత ఉన్నప్పటికి,కాలదోషం(Time limitation) వల్ల విచారణకు స్వీకరించరు.అటువంటిదే ఈ తెలుగబ్బాయి కథ. పోయినోడు ఎలాగు పోయాడు. ఉన్న తెలుగుఅమ్మాయినైనా రక్షించుకుందాం అని తాపత్రయం.ఏమంటారు ?

    ReplyDelete
  3. మీ దృష్టిలో కాలదోషం అంటే ఎన్నాళ్ళకి పట్టినట్టు!! డిక్రీ ఐన కేసులో, డిక్రీ అమలుకు పన్నెండేళ్ళు, ఇచ్చిన బాకీ చెల్లువెయ్యకపోతే, ఆ బాకీ తీసుకున్న తేదీనుంచి మూడేళ్ళు, తాకట్టు పెడితే, తాకట్టు తేదీ నుంచి పన్నెండేళ్ళు, ఇలా కొన్ని కాల పరిమితులు న్యాయ శాస్త్రంలో పెట్టిన ఉద్దేశ్యం, లిటిగేషన్లు పెరిగిపోకుండా మాత్రమే కాని, బాధ్యతలు ఎగ్గోట్టటం న్యాయం అని కాదు. సరే, ఈ విషయంలో కాలదోషం ఎప్పటి నుంచి లెక్కేస్తారు . నాకు తెలిసి తెలుగు అమ్మాయిలాగ కనపడే పిల్లలు కనుమరుగయ్యి దాదాపుగా 30-35 ఏళ్ళు అయ్యింది. న్యాయ శాస్త్ర పరిధిలో ఏ లిటిగేషన్ కి అయినా సరే ఇంత కాలం ఎక్కడా ఇవ్వలేదు.ఎప్పుడైతే పంజాబీ డ్రస్ పేరుతో పైనుంచి కిందకు దిగేసుకునే బురఖాలాంటివి వాడటం, పై పైట ఊరికే మెడకు చుట్టుకునే ఫ్యాషన్ గుడ్డగా మారినప్పుడే తెలుగు ఆడపిల్ల Extinct అయిపోయింది.

    తెలుగు అమ్మాయి కావాలంటె తెలుగు అబ్బాయి కూడా కావాలి. జడ్డి మొహాలేసుకుని, అక్కడెక్కడో అమెరికాలో ఎవడో ఫ్యాషన్ పేరిటో, లేక సర్కస్ దివాలా కొడితే ఆ గుడారం ముక్కలు పాంటు గుడ్డలుగా అమ్ముకుంటే అదే వేలంవెర్రి అయిపొయ్యే మనకి. ఆడ పిల్లలు మాత్రం తెలుగమ్మాయిలలాగ ఉండాలా!! ఆంగ్లలో చక్కటి సామెత ఉంది "Leading by Example" అని . తెలుగబ్బాయిలు అలా ఏమన్నా చెయ్యగలిగితే, తెలుగమ్మాయీలూ కనపడటం మొదలుపెడతారు.

    ReplyDelete
  4. మొత్తానికి మేము తెలుగమ్మాయి గురించి చెపితే, మీరు తెలుగబ్బాయిని గురించి చెప్పి,ఈ ప్రస్తావన కు పరిపూర్ణత తెచ్చినందుకు దన్యవాదములు.కాకపొతే మీరు చెప్పేదాని ప్రకారం యూరోపియన్ సంస్క్రుతి పట్ల ఆకర్షణ వల్ల అబ్బాయి పూర్తిగ కనుమరుగు కావటానికి సుమారు ౩౦ యేండ్లు పట్టింది.అది గడచి మరో నలబై ఏండ్లు ఐయింది.కాని అమ్మాయి విషయంలో ఇంకా కనుమరుగు కాలం ౩౦ సంవస్సరాలే పూర్తి కాలేదు.ఇంకా పండగలకి,పబ్బాలకి అక్కడక్కడా తెలుగుఅమ్మాయిలు కనిపిస్తున్నారు. అందుకే అబ్బాయిల విషయంలో కాలదోషం పట్టిందని చెప్పడం జరిగింది.
    ఏదేమైన్నప్పటికి జాతికి ప్రతీక స్త్రీ మూర్తియే కాని పురుషుడు కాదు.తెలుగు తల్లి అంటాం.పూజిస్తాం.తెలుగు తండ్రి అనంకదా! భవిషత్తులో మన తెలుగు తల్లిని ఎక్కడ జీన్స్ పాంట్లో చూడాల్సివస్తుందో అనే భయంతోనే, కనీసం అమ్మాయిలలో ఐనా తెలుగుతనాన్ని నిలపాలి అనేది మా అభిమతం.అబ్బాయిలలో వద్దని కాదు, భవిష్యతులో ఏ యూరోపియన్ ఫ్యాషన్ డిజైనరో మన పంచెకట్టుకు మోడర్న్ టచ్ ఇస్తే అప్పుడు మీరు చెప్పిన్న అనుకరణ పద్దతిలో అనుసరిస్తారేమో!ఏదైనా ఒకటి మాత్రం నిజం ఒక తరం వారి నడతలకు వారి తల్లితంద్రుల తరం వారే కారణం. మన కట్టు,బొట్టు,సంస్క్రుతి మీద, వాటి పరిరక్షణ మీద అవగాహన లేకపోవడం వాటి గురించి మాట్లడేవాళ్ళని చాందసులుగాను, అభివ్రుద్ది నిరోదకులుగ ముద్ర వేయడం ఈ విలువల పతనానికి కారణం.

    ఏదైనా పూర్తిగ అంతరించిపోయేదాక వాటి గురించి పట్టించుకోము.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్ళు ఉంటుంది ఏ పనైనా.అందుకే అంతరించిపోతున్న జీవజాల పరిరక్షణలో బాగంగా స్తానిక ప్రజల సంస్క్రుతులను గుర్తించి, వాటిని కాపాడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరి పై ఉంది.

    ReplyDelete
  5. Lead by example Youngmen, Lead...lead and lead but by Example and not by mere yearning.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!