దిక్కుమాలిన సమాజంలొ ఫుట్టడమే ఇళవరసన్, నాగరాజులు చేసిన తప్పా?
అది ధ ర్మపురి. ధర్మం ఎన్నిపాదాల మీద నడుస్తుందో తెలియదు మరి!ఆ వూళ్లో యువతీ యువకులు ఇళవరసన్, దివ్య. ఇద్దరూ ప్రెమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. ఆ పెళ్లికి అమ్మాయి తల్లి తంద్రుల అనుమతి లేదు. ఇద్దరి కులాలు వేరు. అయినా పర్వాలెదు పెళ్లికి కుల మతాలు అడ్డు కాదు. ఎందుకంటే మన రాజ్యాంగం లోనే రాసుకున్నాం.అటు అమ్మాయి కులస్తులు పెద్దకులం కాబట్టి సహజంగానే పెళ్లిని వ్చ్యతిరేకించి ఉండవచ్చు.అబ్బాయి దళితుడు కాబట్టి ఎన్నో తరాల నుండి వస్తున్న సాంప్రదాయ వ్యతీరేకత అమ్మాయి తరపు వారు కలిగి ఉండడం సహజమే అయినప్పట్టికి మారుతున్న పరిస్తితులకు అనుగునంగా సమాజాన్ని మార్చదంలో విఫలమ కావడంలో అందరి పాత్ర ఉంది. ఒక అమ్మాయి అబాయి పెండ్లి చేసుకోవడానికి కుల మతాలు అనుమతి అవసరం లేకపోయినా ఇరువైపుల తల్లి తండ్రుల అనుమతి కాని వారు ఒప్పుకోని పక్షంలో కోర్టు అనుమతి కాని అవసరం ఉందనేద