ప్రస్తుతం భారతానికి ముప్పు కలిగిస్తుంది బ్రాహ్మణ వాదమా ? బజారు వాదమా ?
నిన్న పేస్బుక్ లో ఒక మిత్రుడు జన విజ్ఞాన వేదికకు చెందిన వారు , ఒక పోస్ట్ ను పబ్లిష్ చెయ్యటం జరిగింది . కొంతమంది పిడివాదులు (జరుగుతున్నమార్పులను గమనించని వారు ), నేటి సమాజం లోని అన్ని సమస్యలకు హిందూ సంప్రాదాయ వాదంలో ఒక బాగమైన "బ్రాహ్మణ వాదం" మూల కారణమని కాబట్టి దానిని నిర్మూలిస్తే తప్పా బారత దేశం అభివృద్ధి చెందదని పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు . వీరు చేసే ప్రచారాలు ఎలా ఉన్నాయి అంటే "దొంగలు పడ్డ అరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ". ఈ దేశం లో మేజార్టి ప్రజలు చదువు సంద్యలకు దూరమై, సమాజం వెనుకబాటు తనానికి ఒక్కప్పటి బ్రాహ్మణ వాదం కారణం కావచ్చు. కాని అది గతo . ఇప్పుడు మన దేశం లో నడుస్తున్నది బ్రాహ్మణ వాదం కాదు . పక్కా బజారు (వ్యాపార) వాదం . ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బులుకు పక్కలు వేసే పక్కా వ్యాపార వాదం . దిని విస్తరణ వల్లే మన సమాజం సర్వ నాశన మవుతుoది . ఈ వ్యాపార వాదాన్ని అడ్డం పెట్టుకునే మన దేశాన్ని విదేశి- యులు తమ పాలనల