పాపం ! కత్రినా కైఫ్ ని ఆమె గారి భర్త ఎన్ని సార్లు "రేప్ " చేసాడో !!?
పూర్వకాలం లో దేవతలు నివసించే దేవలోకం కి, మానవులు నివసించే ఈ భూలోకం కి కనెక్షన్ లు ఉండేవి . అందుకే అప్పుడప్పుడు అప్సరసలు అయినా రంభ ఊర్వశి మేనకలు లాంటి వారు ,లేక వరూధిని లాంటి వారు భూ విహారానికి వచ్చి సేద దీరీ పోతుండే వారు అట . భూమి మీద కంటికి నచ్చిన వాడెవడు అయినా కనపడితే వాడితో అచ్చిక బుచ్చిక లాడి , కొన్నాళ్ళు వాడితో గడిపి , కడుపొ కాలో వస్తే ,పుట్టిన వారిని భూమి మీద తమ తో గడిపిన మగాడి ముఖాన కొట్టి ఎంచక్కా దులుపుకుని దేవలోకానికి వెళ్లగల స్వేచ్చా స్వాతంత్ర్యాలు సదరు దేవసాను లకు ఉండేవి . దేవతలను నిరంతరం తమ నృత్య గానాలతో ఎంటర్ టైన్ మెంట్ చేయడమే వారి వృత్తి కాబట్టి వారికి ఆ స్వేచ్చా స్వాతంత్ర్యాలు అవసరమే మరి , వారు దేవతలు కాబట్టి వారి గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా నిరంతరం యవ్వనం తో ఉండటం వారికి ఉన్న స్పెషాలిటీ . కాలాంతరాన దేవలోకానికి , భూలోకానికి కనెక్షన్ తెగిపోయినా, సదరు దేవతా జాతి లో కొందరు, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో హీరోయిన్ మాదిరి ఉంగరాలు పారేసుకున్న వారెవరో ,దేవలోకానికి సకాలం లో దేవ లోకం కి వెళ్ళ లేక ఇంకా భూమి మీదే ఉండి పోయా