అనుమానముంటే డి.యెన్.యె.టెస్టులు చేయించుకోండి.అంతే కాని అభం శుభం తెలియని పిల్లల్ని హింసించకండి.
మొన్నీ మద్య మా ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి హట్టాతుగా రాక్షసుడుగా మారి తన బిడ్డను అమానుషంగా హింసించాడట!ఈ ఉదంతం మీద తల్లి మౌన ముద్ర దాల్చింది. కారణాలు ఇంకా పూర్తీగా తెలియ రాలేదు కాబట్టి తెలియని దానిని విశ్లేషించడం పద్దతి కాదు అని బావిస్తున్నాను. అయితే సామాన్యంగా సంసారాలలో పెద్దలు చేసే కొన్ని కొన్ని తప్పులు పిల్లలకి నరకమ్ చూపిస్తుంటాయి. సంసారానికి పునాది నమ్మక్కం. ఆ నమ్మఖ్ఖమే లేకపోతే ఆలుమగలుగా కలసి జీవించడం అనవసరం. ఈ నమ్మక్కం అనేది కూడా ఇంతకాలం మనం అనుసరిస్తూ వస్తున్న ప్రేమానురాగాలతో కూడిన సాంప్రదాయక సంసార జీవన విదానంలోనుండి వచ్చింది. కాబట్టి అట్టి నమ్మక్కం లేకపోవడమంటే పునాది లేని భవంతి లాంటిది ఆ కాపురం. ఎప్పుడైన కూలిపోవచ్చు. ప్రతి వ్యక్తి తన వారసత్వాన్ని అభిరుద్ది పరచుకోవడం అతని సహజ హక్కు. దానిని కాదనే అధికారం ఎవరికి లేదు. అటువంటి వారసత్వ అభిరుద్ది హక్కును కాలరాసేది తప్పుడు మార్గాలలో చరించే జ