ఒక్క వీరప్పన్ మరణిస్తే , వేల మంది వీరప్పన్ లు పుట్టారు , అల్లూరి గారు !!
"ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే , వేల మంది అల్లూరి సీతారామ రాజులు పుట్టి , నిన్నూ నీ సామ్రాజ్యాన్ని గడ గడలాడిస్తారు రూధర్ పర్డ్ " అని హీరో క్రిష్ణ గారు "అల్లూరి సీతారామ రాజు" సినిమాలో విరావేశం తో డైలాగులు చెపుతుంటే , చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఒక రకమైన వీర బావీద్వేగం కలుగుతుంది . నిజంగా స్వాతంత్ర సమర ఉద్యమంలో, అల్లూరి , భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులు అందరకు ఇలాంటి నమ్మకO ఉండటం వలననే తమ ప్రాణాలను తృణ ప్రాయంగా ఎంచి , స్వాతంత్ర సమరం లోకి ఉరికారు . కాని ఆ సమయం లో వారికి తెలియని ఒక రహస్యం ఏమిటంటె , "ఒకరు చస్తే వేల మంది పుట్టుకు వస్తారు " అనే సూత్రం విప్లవీరులకే కాదు, బడా చోరులకు , జారులకూ వర్తిస్తుందని . లేకుంటే సమాజ మనుగడ కష్టం కదా! సమాజం అన్నాక , చోరులూ ఉండాలి , జారులూ ఉండ...