ఒక్క వీరప్పన్ మరణిస్తే , వేల మంది వీరప్పన్ లు పుట్టారు , అల్లూరి గారు !!


                                                                               

"ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే , వేల మంది అల్లూరి సీతారామ రాజులు పుట్టి , నిన్నూ నీ సామ్రాజ్యాన్ని గడ గడలాడిస్తారు రూధర్ పర్డ్ " అని హీరో క్రిష్ణ గారు "అల్లూరి సీతారామ రాజు" సినిమాలో విరావేశం తో డైలాగులు చెపుతుంటే , చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఒక రకమైన వీర బావీద్వేగం కలుగుతుంది . నిజంగా స్వాతంత్ర సమర ఉద్యమంలో, అల్లూరి , భగత్ సింగ్ లాంటి  విప్లవ వీరులు అందరకు  ఇలాంటి నమ్మకO ఉండటం వలననే తమ ప్రాణాలను తృణ ప్రాయంగా ఎంచి , స్వాతంత్ర సమరం లోకి ఉరికారు . కాని ఆ సమయం లో వారికి తెలియని ఒక రహస్యం ఏమిటంటె  , "ఒకరు చస్తే వేల మంది పుట్టుకు వస్తారు " అనే సూత్రం విప్లవీరులకే కాదు, బడా చోరులకు , జారులకూ వర్తిస్తుందని . లేకుంటే సమాజ మనుగడ కష్టం కదా! సమాజం అన్నాక , చోరులూ ఉండాలి , జారులూ ఉండాలి . కాకపోతే ఇది ప్రజాస్వామ్య యుగం కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైంది అంతే !ఇదంతా ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటె , క్రింద ఇవ్వబడిన సమచారం చూడబట్టి . 

                                                                            



పై సమాచారం వలన మనకు అర్దం అవుతుంది ఒకటే , ఒక్క వీరప్పన్ మరణిస్తే , సౌందర్య రాజన్ , శరవణన్ , మస్తాన్ వలి లాంటి వీరప్పన్ వారసులు వేల మంది రక్త చందనం స్మగ్లింగ్ లో పాలు పంచుకుంటున్నారు . పాపం వీరప్పన్ కొన్నీ వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి కారకుడైనా , చనిపోయే నాటికి తన భార్య లక్ష్మికి కాని, కూతురు కు కాని ఏమి మిగల్చలేదంట , ఒక్క గుడిసె తప్పా , కాని ఈ అభినవ వీరప్పన్ లు , వీరప్పన్ జీవిత చరిత్ర నుంచి గొప్ప గుణ పాటం నేర్చుకున్నట్లు ఉంది , స్మగ్లింగ్ కోసం వన వాసం చేయటం తెలివి తక్కువ పని  అని బావించి ,గ్రౌండ్ వర్క్ కి, ఎర్ర దళం "ఎర్ర  దళం " ఏర్పాటు చేసి , వారికి ,ఎర్ర చందనం దుంగ కు ఒక దానికి 5000 రూపాయలు ఇస్తాం అని ఆశ పెట్టేసరికి , ఆ దళమే  చిన్న పాటి స్మగ్లర్ లు గా మారి పోయారు. మొన్న చిత్తూరు అడవుల్లో ఎన్ కౌంటర్ కి గురి అయింది కూడా సదరు చిన్న పాటి స్మగ్లర్లే తప్పా , అరవ వాళ్ళు ఆరోపిస్తున్నట్లు "ఎర్ర కూలిలు " కారు . వెర్రి స్మగ్లర్లు. వీల్లకు డబ్బు వెర్రి ఎక్కువ . అదే వారిని లైప్ రిస్క్ తీసుకునేలా చేస్తుంది . 

     ఇక తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఈ "రక్త చందన రహస్య తరలింపు " ఉద్యమంలో , అన్ని స్తాయిల్లో వారిని బాగస్వాములు చేసినట్లు కనపడుతుంది . లేకుంటే వీరి దుంగల తరలింపు కార్యక్రమం గత దశాబ్ద కాలంగా నిరాటంకంగా కోన సాగుతుందా? ఇందులో ప్రదాన సహకారం అందించింది పోలిస్ శాఖ . పోలిస్ లోని కొంతమంది వీరప్పన్ భక్తులు స్మగ్లర్లకు సహకరిస్తూ , వారి బొజ్జలు తో పాటు ఆదాయాన్ని భయంకరంగా పెంచుకున్నారు . స్మగ్లర్లు , పోలిసుల మైత్రికి చిహ్నంగా తిరుపతిలో ఒక కాలని "దొంగా పోలిస్ కాలనీ " గా వ్యవహ రించబడుతుంది అంటె , వారి మైత్రీ బందం ఎంత ద్రుడమైనదో అర్దమవుతుంది . అల్లాగే రెవెన్యు , రాజకీయ వర్గాలు చివరకు మీడియా వాళ్ళు కూడా చేతులు కలుపబట్టె ఈ దంధా ఇంత కాలం నడస్తుంది . ఇప్పుడు స్మగ్లర్ ల మీద దాడులు చేస్తున్నారు అంటె దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి . దందా అంతా ప్రతిపక్ష వర్గాల్లోని కొంతమంది కి లాభిస్తుంది కాబట్టి అధికార పార్టీ ఎలర్ట్ అయి దుంగల దొంగల భరతం పడతానికి సిద్దపడింది. 

    ఈ  స్మగ్లింగ్  సొమ్మును కేవలం విలాసాలకు వెచ్చిస్తూ , స్మగ్లర్ల ఆదాయాలు పెంచుకుంటే ప్రభుత్వం కూడా ఇంత సీరియస్ కాకపోవునేమో ! కాని అదే సొమ్మును ఒక ముఖ్య మంత్రి మీద మర్డర్ ఎటేంప్ట్ కు ఉపయోగిస్తే , మరొక ముక్య మంత్రిని గద్దె దించడానికి ఉపయోగించారు . ఇది తెలిసిన మాజీ ముఖ్య మంత్రి గారు ప్రత్యర్ది వర్గాల ఆర్దిక మూలాలు దెబ్బతీసే పనిలో బాగంగా ఆపరేషన్ రెడ్ మొదలు పెట్టారు . ఏడుకొండలవాడి కరుణ వలన అదికారం లోకి ఎర్రచందన లాబీ వ్యతిరేక వర్గం అధికారం లోకి రావడం వలన దొంగల భరతం పడుతున్నారు . ఇందులో ఏడుకొండల వాని ఇంట్రెస్ట్ కూడా ఉంది . ఎందుకంటె దోపిడికి గురి అవుతుంది, అయన కిష్టమైన  శేషా చలం అడవుల "ఎర్ర వన సంపద " కాబట్టి. మరి దీనిలో పోలిస్ వారు ఎంత వరకు సపలీక్రుతులు అవుతారో చూడాలి . పోలిస్ వారిలో కూడా "ఒక్కొక్కరిని కాదు మస్తాన్ వలి ! వందమంది స్మగ్లర్లను పంపు " అని ఎదురు రొమ్ము చూపించే దమ్మున్న అపిసర్ట్లు కావాలి కదా! మొన్న బంగ్లాదేస్ లో చిత్తూరు పోలిసులు చూపిన తెగువ అలాంటిదే అని పేపర్ల కధనాలు .నూరు గొడ్లను తిన్న రాబందు ,ఒక్క గాలివానకే ఖతం " అనేది బడా స్మగ్లర్ లకు వర్తిస్తుంది కాబట్టి  చూదాం ఏమి జరుగనుందో ? 


     ఇకపోతే వీర స్మగ్లర్ల  వీరి సంపాదన ఏ యే రంగాలను, ఎలా  కలుషితం చేసిందో, చేస్తుందో , రేపటి టపాలో వివరిస్తాను . అంటె "రక్త చందన చరిత్ర 2" అన్న మాట. (సశేషం ). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం