ఆవిడకు రెండు కార్డులు! సన్ని కల్లు తొక్కినందుకు ఒకటి , సహజీవనం చేస్తునందుకు మరొకటి !!!?

                                                                     
 

భారత దేశం లో ఏ హక్కులూ లేకుండా సహజీవనం చేస్తున్న వారి పట్ల ఉదార బావంతో , మొన్ననే సుప్రీం కోర్టు వారు ఒక రూలింగ్ ఇచ్చారు . దీర్ఘకాలం సహజీవన సంబందంలో కలిసి ఉన్నట్లైతే, దానిని వివాహబందం గానే పరిగణించాలని చెప్పారు . అయితే దీని వలన సక్రమ సంతానానికి ఏవైనా చిక్కులు కలుగుతాయేమో అనే దూర దృష్టితో , "దీర్ఘ కాల సహజీవనం  గడుపుతున్న వారి మద్య వివాహం జరుగలేదు అని ఎవరైనా ఆరోపణ చేస్తే, అట్టి దానిని రుజువు చేయాల్సిన బాద్యత ,ఆరోపణలు  చేసే వారి మీదే ఉంటుంది " అని ముక్తాయింపు ఇచ్చారు . అంటె ఏతా వాతా అత్యున్నత న్యాయస్తానం వారు చెప్పిందేమిటంటె , ఎవరైనా తమ వంశ పురుషుల సహజీవనం వలన , తాము కోర్టు కేసులలో ఇరుకున్నప్పుడు , తమ వంశ పురుషుడికి , అతనితో సహజీవనం చేసిన స్త్రీకి మద్య ఎలాంటి వివాహం జరుగలేదని విరే నిరూపించాలీ  . .ఇదొక విచిత్ర తీర్పు.

                                                                   

 ఇక పోతే ఖమ్మం పట్టణంలో సహజీవనం లోని లోటు పాట్లను  ప్రస్తావించ దగిన ఒక కేసు నమోదైంది . ఒకే స్త్రీ తన జీవిత కాలంలో ఒకరికి రెండవ బార్య గా , మరొకరికి సహజీవన వాసిగా , ప్రభుత్వం నుండి డబుల్ పాయిదా పొందుతూ ఉండటం వలన , చివరకు అది పోలిస్ కేసుకు దారి తీసింది .  ఒక ప్రభుత్వ ఉద్యోగి తన మొదటి బార్య మరణాంతరం ఈమెను  రెండవ వివాహం చేసుకుని ప్రభుత్వ రికార్డులలో నామినీ గా నమోదు చేయించటం వలన అతని మరణాంతరం ఆమెకు పెన్షన్ వస్తుంది . ఆ తర్వాత ఆమె వేరే అతనితో వివాహం లేకుండా సహజీవనం మొదలు పెట్టింది . తనకు మొదటి భర్త వలన వచ్చే పెన్షన్ కు బంగం లేకుండా అతని పేరుతో ఒక కుటుంబ కార్డు , ఇటు సహజీవనానికి బంగం లేకుండా రెండవ భర్త పేరుతో మరొక కుటుంబ కార్డు తీసుకుని , రెండు కుటుంబాలకు వెలుగుగా నిలిచింది అట .

                             కాని ఏవో ఆస్తుల గొడవ సందర్భంలో మొదటి భర్త యొక్క మొదటి భార్య సంతానం, , పక్కాగా రికార్డ్ ఆధారాలు సేకరించి ఆవిడ మీద , అవిడ సహచరుడు మీద పోలిస్ కేసు పెడితే , పోలిసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు మొదలు పెట్టారట . అదీ విషయం. ఒక వ్యక్తీ తో కలసి జీవించాలి అని నిర్నయించుకున్నప్పుడు , వారి సంబందానికి  ఒక అధికార గుర్తింపు అనేది చాలా అవసరం . అది సాంప్రాదాయ పద్దతిలో ఉండె వివాహం అయినా సరే , లేక చట్టం నిర్దేసించిన పద్దతిలో వివాహ నమోదు పద్దతి అయినా సరే! తాము చేస్తుంది కరెక్టు పని కాదు అని గిల్టీ పీలింగ్ ఉన్నవారే , ఇలా పెండ్లి పెటాకులు లేకుండా "సహా జీవనం " చేస్తుంటారు .      
                   
                    పెండ్లి రహిత సహజీవనం అనేది నాగరిక జీవనం లో నుండి ఉద్భవించిన నూతన  అయిడియాలజి ఏమి కాదు. కొన్ని ఆదిమ తెగలలో ఉన్నదే .   భద్రాచలం అడవులలో నివసించే కొన్ని ఆటవిక తేగల మద్య ఈ సాంప్రదాయం  ఇప్పటికి ఉంది . వారు పెండ్లి లాంటి తంతులు ఏమి లేకుండానే , కుటుంబ జీవనం కొనసాగిస్తుంటారు. కాకపోతే వారిలో నిజాయితీ ఉంటుంది కాబట్టి అ విదానం వలన , వారి సమాజంలో తల నొప్పులు ఏవి ఉండవు.  కాని ఈ  రోజు చేసుకున్న ఒప్పందాన్నే  తెలారిపాటికి ఉల్లంగించే  నాగరికులుం అని చెప్పుకుంటున్న వారు తిరిగి అదే ఆదిమ జీవన పద్దతిలో నివసిసిస్తాం, అంటె కుదిరే పనేనా? పైన చెప్పిన సంఘటనే దీనికి మంచి ఉదాహరణ. లేదూ మా ఇష్టం మాదే  అంటే అది వారి "మై చాయిస్". లో బాగమే తప్పా వేరు కాదు, 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం