పురుషులు బట్టలు మార్చుకునే ట్రయిల్ రూం లో "రహస్య కెమేరాలు " ఎందుకు పెట్టరు ?


                                                                                                 స్త్రీ పురుషులు సమానం! సమానం! సమానం ! అని,గొంతులు చించుకు అరస్తూ ,  వాస్తవ పరిస్తితులు గమనించకుండా , సమాజం లోని కొంతమంది "మగ వాళ్ళ బుద్ది " మారక ముందే , తమ వేష దారణ ,సాంప్రదాయ జీవన శైలి  మార్చుకున్న   ఆధునిక యువతీ యువకులారా నా ప్రశ్న కు బదులు ఇవ్వండి .

 స్త్రీ పురుషులు సమానమే అయితే  వస్త్ర దుకాణాల్లో బట్టలు మార్చుకునే "ట్రయిల్ రూం" లలో రహస్య కెమెరాలు స్త్రీల గదుల్లోనే ఎందుకు ఉంటున్నాయి ? పురుషుల గదుల్లో ఎందుకు కనపడటం లేదు? స్త్రీల శరీరానికి ఉన్న కమర్షియల్ విలువ పురుషుల శరీరాలకు ఎందుకు లేదు? స్త్రీ పురుషులు వస్త్ర దారణ విషయంలోనే  సమానం కానప్పుడు , నా ఇష్టం వచ్చిన విదంగా అర్ధ నగ్న  వస్త్రదారణ చేస్తాము  , సమాజం  ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అని అడిగే నైతిక అర్హత, అదునికులం  అని చెప్పుకునే వారికి ఉందా? 

మొన్న గోవా లో ఒక వస్త్ర వ్యాపారి , తన వస్త్రాలును దొంగిలించబడకుండా ఉండెందుకు , రక్షణ కోసం రహస్య కెమేరాలు  ట్రయిల్ రూంలో కాకుండా , బయట అమర్చుకున్నాడు . ఇది కేవలం మహిళా చోరుల నుండి తన వస్త్రాలు కాపాడుకోవడానికి చేసిన పనే కావచ్చు . దీనిని విదేశాల్లో సమర్దిస్తారేమో కాని ,స్త్రీలను దేవతలుగా పూజించే ఇండియాలో కుదరని పని. తన దుఖానంలో వస్త్రాలు కాపాడుకోవడానికి , స్త్రీల మానాభిమానాలు కించపరచే రహస్య కెమేరాలు ఏర్పాటు చేస్తాను అంటె కుదరదు . అందుకే సదరు వస్త్ర వ్యాపారి మీద మంత్రి స్మ్రుతి ఇరాని గారు కేసు పెట్టమని ఆదేసించారు. 

కాబట్టి వేలాది ఏండ్లుగా పోరాడుతున్న స్త్రీ పురుషుల మద్య అన్ని విషయాల్లో సమానత రాలేదు . స్త్రీల పట్ల మగవాడికి ఉండె సహజ "మగబుద్ది చపలత్వం " పోనంత వరకు స్త్రీ శరీరమ్ కూడా వ్యాపార వస్తువే . దానిని రక్షించుకోవడం  తప్పని సరి . పురుషుడు లోని మగ బుద్ది మారుతుందన్న గ్యారంటి ని ఆ భగవంతుడు తప్పా ఎవరూ ఇవ్వలేరు . ఒక వేళ అలాంటి ఉత్తమ పురుషులు ఉన్న సమాజం, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటె , వారిని ఆదర్శంగా తీసుకుని మనం మారడమో , లేక ఇక్కడి ఆధునిక  స్త్రీలకు వీసాలు ఇచ్చి అక్కడకు పంపడమో చేస్తే సరి పోతుంది ' కాని దుర్భిణి వేసి చూసినా అటువంటి మేలైనా "మేల్ సమాజం " కనపడదే ! 

   అందుచేత మన దేశంలో పురుషులు మారే అంతవరకు అయినా పద్దతి అయిన వస్త్రదారణ చేయడం మంచిది . మగాళ్ళు మారి పోయాక , ఆదునిక యువత ఇష్టం వచ్చిన విదంగా సగం వస్త్రాలు కట్టుకుని తిరిగినా పట్టించుకునే వాడు ఉండడు . కాబట్టి అందాక ఆగండి  ! తొందరపడి ముందే కూయకండి . కోయిల కూసిందని వసంతం రాదు . ఇష్టం వచ్చినట్లు సంచరించే   స్వేచ్చ ఇచ్చినంత మాత్రానా ఆదర్శ రాజ్యం  రాదు . దేనికైనా పరిణామ క్రమం వర్తిస్తుంది . అంత వరకు ఎవరి జాగర్తలో వారు ఉండడం మంచిది . 


Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.