అవ్వ !అవ్వ !! పట్ట పగలు, వందల మంది చూస్తుండగా, ఆమెను 4 గురు రేప్ చేసినా , ఆమె కేమి తెలియలేదట!!

                                                                           

          స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంత దూరం వెళ్ళావు అంటె , పబ్లిక్ గా రేప్ చేసినా తనకేమి జరిగిందో తెలియనంత దూరం అందట . అలా ఉంది అమెరికాలోని  ఫ్లోరిడా బీచ్ లో రేప్ కు గురి అయిన చిన్నదాని సంగతి . అందుకే ఎప్పుడొ మార్చ్ 10 , 12 తారీకుల మద్య ఆమె మీద రేప్ జరిగినప్పట్కి పోలీసులకు రిపోర్ట్ చేయలేదు. అయితే ఆమె మీద జరిపిన అత్యాచార కాండను ఎవరో సెల్ ఫోన్ లో చిత్రికరంచడమ్,వేరే  ఒక కేసు లో విచారణ జరుపుతున్న పనామా పోలీసులకు , సదరు సెల్ పోన్లోని దృశ్యాలు   కంట బడడం వలన , వారు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడం వలన , రేప్ విషయం బయటకు వచ్చింది కాని, లేకుంటే అమ్మాయి అమాయకంగా రేపిస్టులతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ మరిన్ని రేప్ లకు గురి అయి ఉందేది . ఎందుకంటె వారు ఆమె ప్రెండ్సే కనుక! ఇప్పటికి ఇద్దరు ని అరెస్ట్ చేసారు . మిగాతవారి కోసం గాలిస్తున్నారు .   అసలు కద ఏమిటంటె                  

 పోయిన నెల లో అమెరికాలోని ప్లోరిడా బీచ్ లో వివిధ కళాశాలల విద్యార్దులు  "స్ప్రింగ్ బ్రేక్ "  ని ఎంజోయి చేస్తున్నారట , "స్ప్రింగ్ బ్రేక్ మనకు సంక్రాంతి సెలవులు మాదిరి  అక్కడి  స్తానిక కాలేజీలకు మార్చ్ ఏప్రిల్ నెలలో ఇచ్చే ఆటవిడుపు సెలవులు . అలబామా యునివర్సిటి విద్యార్దులు కూడా అందులో పాల్గొని ఎంజొయి చేస్తున్నారు . ఆ సమయంలో కొన్ని వందల మంది చూస్తుండగా ఒక 4 విద్యార్దులు ఒక అమ్మాయి పై గ్యాంగ్ రేప్ చేస్తూ ఆనందిస్తుంటె , ఆ దృశ్యాన్ని చూస్తున్న వారు, ఆమె అరుపులు వింటున్న వారు  కూడా , ఆ ర్తేపిస్టులను అదేమని వారించలేదు అట. అంటే అదంతా "స్ప్రింగ్ బ్రేక్ " ఎంజొయి మెంట్ బాగం అనుకున్నారు కాబోలు. నిజానికి ఆ సమయంలో ఆ అమ్మాయి డ్రగ్స్ సేవించి ఉండడం వలన తన మీద జరుగుతున్నా అత్యాచారాన్ని నిరోదించలేని దౌర్బాగ్యపు పరిస్తితి.

                                       కేసు నమోదు చేసిన తర్వాత , పోలిస్ విచారణలో , కేసు ఎందుకు పెట్త లేదు అని ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే, తన కు ఎదో అయిందని తెలుస్తుంది కాని, ఏమి జరిగిందో గుర్తు లేనందు వలన కేసు పెట్ట లేదు అందట . అదీ , ఆ అమ్మాయి కిచ్చిన విశ్రుంఖల స్వేచ్చ ఆమెకు కల్పించిన పరిస్తితి. పనామా సిటి పోలిస్ అధికారి "ప్రాంక్ కైతన్ " గారు ఈ  కేసు  గురించి తన అభిప్రాయం చెపుతూ "ఇంత నీచమైన కార్యం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు . ఇది ఎలా ఉందంటె అడవిలో క్రూర మృగాలు గుంపుగా జంతు కళేబరం మీద దాడి చేసినట్లుంది . కొన్ని వందల మంది ఆ సమయం లో అక్కడున్నా , వారు కేవలం తమ బీరు సీసాల మూతలు తీయడానికే ఆసక్తి చూపారు తప్పా , రేప్ కు గురి అవుతన్న  అమ్మాయిని  గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి మృగాలు సంచరిస్తున్న బీచ్ లు లాంటి బహిరంగ ప్రదేశాలకు అయినా సరే , మన పిల్లల్ని పంపడం క్షేమ కరం కాదు ."

               పై మాటలు అన్నది  మన దేశం లోని సాంప్రదాయ వాదులు కాదు . తన విచారణలో వెలుగు చూసిన ఒక ఘోరాతి ఘోరమైన , నీచాతి నీచమైన అమానవీయ చర్య గురించి తెలిసాక, ఆధునిక నాగరికత వ్యామోహంలో మనుషులు ఎలా జంతువులు గా మారిపోయారో అర్ధమయ్యాక , ఒక మహా నగర పోలిస్ ఆపిసర్  చెప్పిన మాటలు అవి. మన దేశం లో కూడా "మై చాయిస్ " పేరుతో ఈ  విష జంతు సంస్క్రుతి జడలు విప్పడానికి రెడి అయింది . దానిని మొగ్గలోనే త్రుంచి వేస్తే తప్పా , మన దేశం లోని స్త్రీ లకు రక్షణ ఉండదు. స్త్రీకి కుటుంబ రక్షణ , సామాజిక రక్షణ రెండు నిరంతర అవసరం. దానికి స్త్రీ వికాసానికి బంగకరం కాని రీతిలో , అవసరమైన కట్టుబాట్లతో కూడిన జీవన విదానం అవసరం.

 



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం