డిల్లీ లో హెయిర్ స్టయిల్ నచ్చకపొతె కొట్టి చంపుతారట !
మన దేశ రాజధాని డిల్లి రేపిస్ట్ లకు రేసిస్ట్ లకు నిలయం అయిందా అని అనిపిస్తుంది ఈ మద్య జరుగుతున్నా ఘోర సంఘటనలు చూస్తుంటే !. సరిగా సంవత్సరం క్రితం దేశాన్ని ఒక ఊపు ఊపిన నిర్భయ రేప్ ఉదంతం దేశ రాజదానిలో స్త్రీలకు ఉన్న రక్షణను తేట తెల్లం చేసింది . డిల్లి రాష్ట్రంలో , కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టి మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పటికీ డిల్లి ప్రబుత్వాన్ని డిల్లి పోలిస్ యంత్రాంగం లెక్క చేయని పరిస్తితి! ఎందుకంటే డిల్లి పోలిస్ వారి పగ్గాలు కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ పరిదిలో ఉండటమే . ఇక ఇప్పుడు కెజ్రివాల్ గారి ప్రబుత్వం వచ్చాక పోలిస్ వారు రాష్ట్ర ప్రబుత్వం ని ఖాతరు చేస్తారు అన్నది అనుమానమే ! ముగ్గురు పోలిస్ అధికారుల మిద చర్యలు సాక్షాత్తు డిల్లి ముక్య మంత్రి ఒక రోజల్లా ధర్నా చెయ్యాల్సి వచ్చిందంటే డిల్లి పోలిస్ వారి పవర్ ఏమిటో అర్దమవుతున్ది. ఇలాంటి దౌర్బాగ్యపు విదాన...