హోమంలో "నాగేంద్ర స్వామీ" సాక్షాత్కార అద్బుతం!
గార్లవడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్తానంలో బ్రహ్మోత్సవాలు ది25-05-2013 తేదిన ప్రారంభమై,ది 29-05-2013 తేదితో ముగిసాయి. ఆ రోజు29-05-2013 , చివరి రోజు కావటం , విశిష్టమైన "పూర్ణాహుతి" కార్యక్రమం ఉండటం చేత, మా కుటుంభ సబ్యులం అందరం తొందరగా ఇంటివద్ద పూజాదికాలు ముగించుకుని యజ్ణ వాటికకు వెళ్ళి కార్యక్రమాలు ప్రారంబిద్దామని అనుకున్నాం. మా ఆశ్రమం పక్కనే ఉన్న శ్రీ నాగేంద్రుని పుట్టలో పాలు పోసి, పూజలు నిర్వహించి వెలదామని, మా కుటుంబ సబ్యులు పట్టు పట్టడంతో నేనూ కాదనలేక సరేనన్నాను. ఆ రోజు తిది వారం కూడా చూచుకోకుండా సరే అనేశాను. కారణం మంచి సంకల్పం కలగడమే శుభ ఘడియలు అని నా ప్రగాడ విశ్వాసం.అందుకే కుటుంబ సబ్యుల కోరిక కాదన లేక పోయాను. స్నానం చేసి పుట్టకు నీళ్లు పోసి, ఆ తర్వాత కుటుంబ సబ్యుల మందరం పూజ చేసి, పాలు పోసాము. మా ఇంటి ప్రక్కన ఉన్న ఆ పుట్ట గురించి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html మ