అనుజుడిని చంపేసిన వారు ,ఆలి ని చంపాలనుకున్న వారు మన ప్రజా ప్రతినిదులు లంటా !
ఎన్నికల్లో డబ్బు, కులం లాంటివి ప్రబావం చూపుతున్నంత కాలం మన కిటువంటి నాయకులే దాపురించక తప్పదు. వారివురూ సాక్షాత్తు యం.యల్.ఎ లు. అంటే ప్రజల తరపున శాసనాలు చేయడానికి ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన వారు. ఒకరు జడ్చెర్ల యం.యల్.ఎ అయితే మరొకరు కైకలూరు యం.యల్.ఎ. ఇందులో జడ్చెర్ల యం.యల్.ఎ గారు సర్పంచ్ ఎన్నికల్లో తన బార్యకి పోటిగా తన తమ్ముడు అతని భార్యని నిలపటం సహించలేక, పోటి నుండి తప్పుకోమని తమ్ముడిని హెచ్చరించాడట. మాట విననందుకు తమ్ముడిని కాల్చి చంపాడట!. రాజకీయాల కోసం సోదరుల మద్య వైరం కొత్తేమి కాకపోయినా ఇలా నీచంగ తోడపుట్టిన వాడిని చంపటం అదీ ఒక ప్రజా ప్రతినిది చెయ్యడం అనేది రాష్ట్రం లో దిగజారిన రాజకీయాలకు పరాకా...