ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే అనిపించే సంఘటన మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి , కన్నడ రాజధాని నగరం బెంగళూరులో లో జరిగింది అట . నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు లోని M.G రోడ్డులో సుమారు 60 వేల మంది జనం పోగయ్యారు అట . అందులో జంటలు తో పాటు ఒంటరి యువతులు ఉన్నారట. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరుగకుండా 1600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారట . అయినా సరే ఒంటరి ఆడపిల్లలకు లైంగిక వేధింపుల తిప్పలు తప్పలేదట. అదెలా జరిగింది అంటే , అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , ల...