"యమ వాహనం " ను దొంగిలించబోయి,"యమ లోకం " కు వెళ్ళిపోయిన "యమ దొంగ " !!!
ఈ వింత సంఘటణ ఆగ్రాకు సమీపంలో ఉన్న నాగల మణి అనే గ్రామంలో జరిగింది . ఆ గ్రామంలో సత్య ప్రకాష్ అనె ఆసామికి 'యమ వాహనం ' ని తలపించే మాంచి గేదె ఒకటి ఉంది .దానిని రోజూ లాగే తన పశువుల దొడ్లో కట్టేసి ,నిశ్చింతగా పడుకుండి పోయాడు ఆసామి సత్య ప్రకాష్ . అర్దరాత్రి వేళ ఒక జంతువుల దొంగ సత్య ప్రకాష్ దొడ్లోకి ప్రవేశించి సదరు గేదె ను చూసాడు .దానిని చూడగానే అతడికి 'యమ ఆశ 'కలిగింది .బాగా బలిసి ఉన్న అ గేదె కు మార్కెట్లో మంచి గిరాకి ఉంటుందని తలచి ,మెల్లగా దానిని పలుపుతో సహా తప్పించి తన వెంట తీసుకు పోసాగాడు .ఆ మహిషి కూడా వీడెక్కడికి తీసుకు వెళతాడో చుదామని సరదా పడి ,రెండు కిలో మీటర్లు వరకు కిమ్మనకుండా వెంట వెళ్లిందట.కాని రెండు కిలోమీటర్లు నడిచె సరికి కాళ్ళు నొప్పిపట్టి నాయేమో ఇక రాను అన్నట్లు మొండికేసింద...