రెండు కళ్ళ బాగు కోసం, ఉన్న గొంతు పోగొట్టుకున్న ఉత్తమయ్య!
ఈ రోజెందుకో ఒక కద చెపుదామనిపించింది. నాకు తోచిన కద చెపుతా,బాగున్నా లేకున్నా ఆసాంతం చదువుతారని ఆశిస్తున్నాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో మోతుబరుల కుటుంబాలు ఉన్నాయి. అందులో ఉత్తమయ్య కుటుంబం కూడ ఒకటి.ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరి కొడుకులుకి చెరో అయిదుగురు సంతానం వలన ,పిల్లా పీచు అంతా కలిసి ముప్పై మందితో ఉమ్మడి కుటుంబం అలరారుతూ ఉండేది. ఆ ఇంటిలో ఉత్తమయ్య మాటే వేదవాక్కు. ఆయన మాటను కాదనే దమ్ము ఎవరికీ లేదు. దానికి కారణం ఆయన వాయిస్ పవరే కాక సమయానుసారంగా ఆయన తీసుకునే నిర్ణయాలు సత్పలితాలు ఇస్తూ కుటుంబ అభివ్రుద్దికి తోడ్పడడమే. ఆ ఊరీ కి ప్రెసిడెంట్ గా తొమ్మిదేళ్ళు పని చేసిన అనుభవం ఉంది ఉత్తమయ్యకు.ఆ ఊరిలో ఉన్న అందరితో మంచిగా ఉండే వారు ఉత్తమయ్య కుటుంబ సబ్యులు. ఇలా ఉండగా పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. చిన్న కొడుకు కొడుకు ఒకడు వార్డు మెంబర్కి పోటి చేస్తానంటే ఒప్పుకోలేదు ఉత్తమయ్య. తర్వాత చేద్దువులే అన్నాడు. అంతే , వాడికి కోపం వచ్చింది. ఇంటి నుంచి వేరుగా వెళ్లి పోయి తన పెళ్ళ