సూపర్ మాన్,స్పైడర్ మాన్ లు కాదు, మనకు కావలసిందీ ఈ "ఫ్యామిలి మాన్" లు మాత్రమే!
నిజంగా ఇది ఒక అద్బుతమైన వార్త! మానవ సంబందాలు నాగరికత మాటున మ్రుగ్యమవుతున్న వేళ, కుటుంబ బందాలు, ఆర్థిక సంబందాలుగా చూడబడుతున్న వేళ, ఒక నిజమయిన బారతీయుడు అంటే నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న కేరళ గిరిజనుడతడు. పేరు అయ్యప్పన్. ఇతను తన బార్య సుదతో కలసి "కోన" అడవుల్లో తేనే సేకరణ ద్వారా జీవిస్తున్నాడు. బార్యకు ఏడు నెలల గర్బం. హట్టాతుగా నెప్పులు వచ్చే సరికి దగ్గరలో వైద్య సదుపాయం లేక విలవిల లాడి పోయాడు. ఒక ప్రక్కన జోరున వాన. ఇంకొక వంక వాహన సదుపాయం లేని ప్రాంతం. క్షణం ఆలోచించిన బార్యా, లోపలి బిడ్డ దక్కడం కష్టమని బావించిన అయ్యప్ప ఆలస్యం చెయ్యకుండా, బార్యను బుజాన వేసుకుని, నడక మొదలెట్టాడు పట్నం వైపు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నలబై కిలోమీటర్లు, అదీ అడవిలో ఏక బిగిన నడచి హాస్పిటల్కు బార్యను చేర్చాడట! పాపం బిడ్డను రక్షించలేకపోయినా, బార్యను మాత్రం కాపాడ గలిగారు డాక్టర్లు. ఇక్కడ మనం చూడాల్సింది అయ్యప్ప యొక్క నడక శామర్ద్యం గురించి కాదు. బార్య బిడ్డ మీద తనకున్న అంతులేని ప్రేమాను రాగాలు. నిజానికి...