తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారిని , చెప్పు తీసుకు కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !!!.
పెద్దమనిషి అనేవాడు ఎవడైనా, ఆలు మగల మద్య సమస్యలు వస్తే వాటిని సరిచేసి ,బుద్దిగా కాపురం చేసుకోండి అని చెపుతాడు . భార్యల తప్పు ఉంటే మందలింపులతో ,భర్తల తప్పు ఉంటే,అతన్ని చెప్పు తో కొట్టి అయినా సరే సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసేదే సాంప్రాదాయక "పెద్ద మనిషి తనం ". ఇటువంటి పెద్దమనిషి తనం మన పెద్దల్లో ఉండబట్టే మన కుటుంభ వ్యవస్థ ఇంతవరకూ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తుంది .ని కాని ఎప్పుడైతే సాంప్రాదాయక పెద్ద మనిషి స్తానే,స్త్రీ వాద సంఘాలు, గల్లి రాజకీయ నాయకులు ,లాయర్లు, పోలిసులు, కుటుంభ సమస్యల విషయంలో రంగ ప్రవేశం చేసారో,అప్పటి నుండి భారతీయ కుటుంభ వ్యవస్తకు బీటలు వారడం మొదలు అయిందని చెప్పవచ్చు. దానికి ఉతం ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 498 A. ఈ సెక్షన్ క్రింద దాఖలైన కేసుల్లో నూటికి 95% కేసులు తప్పుడు కేసులుగా గుర్తించబడ్డాయి అంటే ,పైన చెప్పిన వారు కుటుంభ వ్యవస్థ విచ్చిన్నతకు ఎలా పాల్పడుతున్నారొ అర్ధం అవుతుంది. ఇదే విషయం మీద సంపూర్ణ అవగాహన కొరకు మరియు సుప్రీం కోర్టు తీర్పు కొరకు ఇంతకు ముంద