ఒక్క రోజు మద్యం, మాంసం మానడమేనా జాతిపితకు మనమిచ్చే నివాళులు.?
నాకు మన ప్రభుత్వం వారు చేస్తున్నవి చూస్తే కొన్ని సార్లు నవ్వు వస్తుంటుంది.లేకపోతే ఏమిటండి. ప్రపంచం లో ఒక నూతన విదానం అదే నండి అహింసా విదానం తాను పాటించి, ప్రజలతో పాటింపజేసి, అ విదానంతొనే శత్రువులను నిరుత్తరలను చేసి భారత దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మన జాతి పిత మహాత్మ గాంది. అసలు అహింసా మార్గం అంటే ధర్నాలు, బందులు చేయ్యడమని ఈనాటి చాలా మంది అభిప్రాయం.కాని అహింసా మార్గం అంటె ఎదుటివారి హింసను సైతం భరిస్తూ, హింస లేకుండా ఎదుర్కొనీ తమ నిరసనను తెలియచెయ్యడమే అహింస అని ఎంతమందికి ఈ సో కాల్డ్ గాందెయవాదులు నేర్పుతున్నారు. నిత్యం బంధ్ల పేరుతో, ధర్నాల పేరుతో హింసకు పాల్పడుతు జనజీవనాన్ని అస్త్యవ్యస్తం చేస్తున్న వారికి గాంది వారసులం అని చెప్పుకొనే అర్హత ఉందా?నిజమైన అహింసా విదానం గురించి పార్టీ కార్యకర్తలకే చెప్పలేని వారు గాందిగారి సిద్దాంతాలను వల్లే వేస్తు అయన వారసులమని చెప్పుకోవడం హాస్యాస్పదం . ఇకపోతే ఏదో అయన పుట్టిన రోజు జరపాలి కాబ