యెహ్! బానిస! బానిసలకు ఇంత అహంబావమా!
శ్రీ పాండవ వనవాసమొ, శ్రీ క్రిష్ణ రాయబారమో గుర్తు లేదు కానీ నేను చిన్నప్పుడు చూసిన సినిమాలో ఎన్.టి ఆర్ గారు బీముడిగా ’దారుణీ రాజ్య సంపద’ అనే పద్యాన్ని పాడి(బాక్ గ్రౌండ్ ఘంటసాల అనుకోండి)ఆపగానే,దుర్యోధనుడిగా నటిస్తున్న యస్ వి ఆర్ గారు ఒక డైలాగ్ కొడతారు.అది"యెహ్! బానిస! బానిసలకు ఇంత అహంబావమా!" అని. అది బాగా క్లిక్ అయిన డైలాగ్! ఎందుకంటే అప్పటి దాక కొండంత రాగం తీసి యన్.టి.ఆర్ గారు పద్యం పాడితే, ఒక్క డైలాగ్ తో అది పనికి రాని ప్రేలాపన గా మిగిలి పోయింది. అలాగే ఉంది ఇప్పుడు సీమాంద్రా యం.పి.ల పరిస్తితి చూస్తుంటే! తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ప్రకటించిందని, కేంద్రం మీద కారాలు మిరియాలు నూరుతూ, సీమాంద్రాకు చెందిన పదమూడు మంది కాంగ్రెస్ టి.డి.పి, వై.యస్.ఆర్ సి.పి. యంపిలు రెండు నెలలు క్రితం లోక్ సభ స్ఫీకర్ మీరాకుమార్ గారికి యమ అర్జంట్ అన్నట్లు రాజీ నామాలు సమర్పించేసారు . ఇచ్చి రెండు నెలలు అవుతున్నా స్పీకర్ గారు వాటిని ఆమోదించ లేదని, లగడ పాటి గారు డిల్లీ హై కోర్టులో పిటిషన్ కూడా వేసారని అంటున్నారు. రాజ్య సభలో ఒక్క హరిక్రిష్ణ గారు తప్పా, ఏ యం.పి. కూడా తమ రాజీ నామాను ఆమోదింపచేసుకోలేక ...