కోటి ఆరోపణలు చేసినా ,ఒక్క కామెంట్ తో ఖతం !.
నిన్న ఒక విషయం మిద రాష్ట్రంలోని ఒక్క చానల్ తప్పా , మిగతా చానళ్ళు అన్నిస్క్రోలింగ్ లుతో సహా ప్రసారాలు చేసాయి . ఆ విషయం అవినీతి పరులైనా కాంగ్రెస్ పెద్దలలో ఒకాయనకు సంబందించింది .ఆయనగారు గతంలో తన మిత్రుడు ముక్యమంత్రిగా అధికారంలో ఉండగా , అ పదవిని అడ్డం పెట్టుకుని , అయన మరియు సదరు ముఖ్య మంత్రి గారికి దగ్గరి బండువుతో కలసి విదేశి కంపెనీలకు ఆంద్ర ప్రదేశ్ తిర ప్రాంతంలోని ఇసుక లిజ్ లు ఇప్పించే పూచి మిద సుమారు 110 కోట్ల పైన ముడుపులు డిమాండ్ చేయడం జరిగిందని , అమెరికా కోర్టులో కొంతమంది మిద అభియోగం మోపారట . అ దేశం లో ఆ కేసును సీరియస్ గా తీసుకుని నిందితుల ఆస్తుల జప్తులకు కూడా సిపార్సు చేసారట! అదిగో అటువంటి అభియోగాల చిట్టాలో మన రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి గారి స్నేహితుడు గారిది కూడా ఉందట . అయినా రాష్ట్రాల సరిహద్దులు సైతం చెరిపేసి , కొండలు తవ్విపోసి , ఖనిజ సంపదను కొల్లగొట్టిన వారినే "అప్త్రాల్ అది కూడా పెద్ద అవినితేనా " అని చప్పరించే అంత గొప్ప మనసున్న ప్రజలు ఉన్న రాష్ట్రంలో బోడి ఒక 100 కోట్ల రూపాయల